వరల్డ్ వైడ్ గా వైరల్ .. బ్రియనా విలియమ్స్ సెన్సేషన్

ఒకే ఒక్క ఫోటో ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేసేస్తోంది. ఆ ఒక్కరు ఎవరో కాదు బ్రియనా విలియమ్స్ . ఇప్పుడు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో, తన కథ వైరల్ అవుతోంది. కొద్ది నిమిషాల లోపే దానిని లక్షలాది మంది చూశారు..పెద్ద ఎత్తున స్పందించారు. ఆమె సాధించింది ఏమిటంటే అసాధారణ విజయం. ఆమె సింగిల్ మదర్. కుటుంబ సమస్యలు ఆమెను కుదురుగా ఉండనీయ లేదు. ఓ వైపు పిల్లాడు, ఇంకో వైపు బతుకు భారం. మానసికంగా చితికి పోయింది . కానీ బ్రియనా మాత్రం చదువు కోవడం మాత్రం ఆపలేదు.

ప్రపంచంలోనే పేరు పొందిన హార్వర్డ్ యూనివర్సిటీ లో చోటు సంపాదించారు. అక్కడ న్యాయ శత్ర విభాగంలో ప్రత్యేకించి లా కోర్సు ను ఎంచుకున్నారు. ఇదే సమయంలో ఆమె కోర్టుకు వ్యక్తిగత సమస్య కారణంగా హాజరు కావాల్సి వచ్చింది. విలియమ్స్ కు అప్పుడే పరీక్షలు. తనకు రాసేందుకు అవకాశం ఇవ్వమని వేడుకుంది. ఆమె విన్నపాన్ని మన్నించింది అక్కడి కోర్ట్. కన్నీళ్లను దిగమింగుకుని బ్రియాన్ లా పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది . సక్సెస్ ఫుల్ గా న్యాయ విద్యను పూర్తి చేసింది. లా పట్టా పొందింది. ఆమెకు ఇప్పుడు 24 ఏళ్ళు.

జ్యురీస్ డాక్టర్ డిగ్రీ సంపాదించింది విలియమ్స్. కొన్ని రోజులు కోర్టు చుట్టూ తిరగడంతో నే సరి పోయింది. ఇంకొన్ని రోజులు నేను పూర్తిగా మానసికంగా, శారీరకంగా చితికి పోయా, ఓ వైపు బాబు ఇంకో వైపు పూర్తిగా బెడ్ మీదే ఉన్నా కదలలేని స్థితి. ఈ సమయంలో నా ముందు లా పూర్తి చేయాలని అనుకున్నా. కష్టపడ్డాను..చివరకు సాధించాను..పట్టా అందుకున్నా. అని కన్నీటి పర్యంతమైంది. ఈ విజయం నాలాంటి వారికి కనువిప్పు కావాలని అంటోంది బ్రియాన్ విలియమ్స్. ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ కావడం ..అది ప్రపంచాన్ని విస్మయ పరిచేలా చేసింది. చిన్నపాటి సమస్యలకు బెంబేలెత్తి పోయే మన మహిళలు ఆమెను చూసి నేర్చు కోవాల్సింది ఎంతో ఉంది కదూ.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!