పండు వెన్నెల్లో సమీరం..త్రివిక్రం..!

తెలుగు సినిమాకు దక్కిన అరుదైన వ్యక్తి..శక్తి..స్ఫూర్తి..త్రివిక్రం శ్రీనివాస్. జీవితం అంటే ఏమిటో, దానిని ఎలా ఒడిసి పట్టు కోవాలో ఈ దిగ్గజ దర్శకుడికి తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదు. లైఫ్ సాఫీగా సాగి పోవాలంటే కమ్యూనికేషన్ ముఖ్యం. ఇందులో మాటలు మరింత బలాన్ని ఇస్తాయి. గుండెకు ఆక్సిజన్ లాగా పని చేస్తాయి. నిరాశకు లోనైన వాళ్ళు, బతుకును కోల్పోతున్న వాళ్ళు ..అపజయపు ఊబిలో కొట్టు మిట్టాడుతున్న వాళ్ళు , రాస్తాలో దారి తెలియని వాళ్ళు, కార్పొరేట్ కంపెనీలను ఎలా విజయవంతంగా నడపాలో తెలియక కొట్టుకు చేస్తున్న వాళ్లకు త్రివిక్రం డైలాగ్స్ టానిక్ లాగా పనిచేస్తాయి. హృదయ కవాటాలకు యెనలేని ఉత్సాహాన్ని ఇస్తాయి. అందుకే అతడంటే వేలాది మందికి అభిమానం. చెప్పలేనంత పిచ్చి. 

ఏది ఆచరిస్తామో అదే అతడి మాటల్లో ప్రతిధ్వనిస్తుంది. కొందరు తమ గోడల మీద , ఇంకొందరు తమ మెడల్లో చిప్ లాగా దాచుకుంటారు. ఒకే మూస ధోరణిలో ప్రయాణం చేస్తున్న తెలుగు సినిమాకు త్రివిక్రం కొత్త రక్తాన్ని ఎక్కించాడు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీసే నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ ఇచ్చే డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకులంతా ప్రొడ్యూసర్స్ కోసం వేచి చూస్తే ..నిర్మాతలే తన కోసం క్యూ కట్టేలా చేసుకున్నాడు ఈ డైరెక్టర్. ప్రతి హీరో కల త్రివిక్రం తో ఒక్కసారైనా నటించాలని కోరిక. పాత్రలను ఎలా వాడుకోవాలో , ఈ సన్నివేశాన్ని ఎలా తీయాలో ..ప్రేక్షకుల నాడిని ఎలా పట్టుకోవాలో బాగా తెలుసు. చాలా మంది దర్శకులు రాసే వాళ్ళ మీద ఆధార పడితే, ఆయన మాత్రం స్క్రీన్ ప్లే , మాటలు , సినిమా అన్నీ అతడే. చిన్నా , పెద్దా అన్న తేడా అంటూ ఉండదు. సంగీతం, సాహిత్యం , మాటలు ఇలా ప్రతి ఫ్రెమ్ లో తెలుగుదనం , చిలిపితనం, హాస్యం , వేదాంతం, రొమాన్స్ , హీరోయిజం , రౌద్ర రసం ..ప్రతిదీయే సమ పాలల్లో ఉండేలా చూస్తాడు. 

ఆయన ఫిలిం మేకింగ్ అన్నది వెరీ డిఫరెంట్.  సినిమాకు పేరు పెట్టడం దగ్గరి నుండి రిలీజ్ అయ్యే దాకా తనకు మాత్రం ప్రత్యేకం అన్నట్టుగా తీర్చి దిద్దడంలో అతడు ప్రత్యేకం . అతడు, జులాయి , అత్తారింటికి దారేది , అరవింద సమేత లాంటి సినిమాలు ఆయన ప్రతిభకు ఆనవాళ్లు. తాజాగా మరోసారి బన్నీ తో తీస్తున్న సినిమా టీజర్ విడులా చేశారు.  స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించి తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. సినిమాకు ‘అల.. వైకుంఠపురములో’ అనే టైటిల్‌ నిర్ణయించారు. అంతేకాదు బన్నీ, మురళీ శర్మ మధ్య సాగే సన్నివేశాన్ని టీజర్‌ రూపంలో చూపించారు. అందులో స్టైలిష్‌ స్టార్‌ మధ్య తరగతి యువకుడిలా కనిపించారు. ‘ఏంట్రోయ్.. గ్యాప్‌ ఇచ్చావు?’ అని మురళీ శర్మ ప్రశ్నిస్తే.. ‘ఇవ్వలా.. వచ్చింది’ అని బన్నీ ఎటకారంగా సమాధానం చెప్పే తీరు ఆకట్టుకుంది. మొత్తం మీద త్రివిక్రం తెలుగు సినిమాకు దక్కిన అదృష్టం కాదంటారా. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!