సమాచార విప్లవం ..సామాజిక చైతన్యం..రాకేష్ రెడ్డి ఓ ఆయుధం..!

ఇన్నేళ్ల స్వతంత్ర భారత దేశంలో పెను సంచలం సమాచార హక్కు చట్టం. 2005 లో ఎప్పడైతే అమలులోకి వచ్చిందో అప్పటి నుంచి ఇండియా వ్యాప్తంగా సామాజిక వేత్తలు, ఆర్టీఐ కార్యకర్తలు, ప్రజాస్వామిక వేత్తలు, కవులు , కళాకారులు, నిబద్దత కలిగిన జర్నలిస్టులు కోట్లాది ప్రజలను ఈ చట్టం గురించి చైతన్యం చేయడంలో నిమగ్నమయ్యారు. మరికొందరు ఆర్టీఐ కార్యకర్తలుగా స్వచ్చందంగా పని చేస్తున్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలుస్తున్నాడు తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ రెడ్డి . పారదర్శక పాలన తో పాటు, కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా పనిచేస్తున్న వారిలో జవాబుదారీతనం ఉండాలని కొన్నేళ్ల నుంచి పోరాడుతున్నారు.
జనాన్ని, సమాజాన్ని చైతన్యం చేయాలంటే చాలా శక్తి ఉండాలి . అంతకంటే నిబద్దత కావాలి. మరింత బలంతో పాటు బలగం కూడా కావాలి. తానే ఒక అడుగు ముందుకు వేశాడు రాకేష్ రెడ్డి. అదే ఇప్పుడు వేళా అడుగులు పడేలా చేసింది. ఈ చట్టమే కాదు దేశ వ్యాప్తంగా అటు కేంద్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు, అమలవుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు , మంజూరైన నిధులతో పాటు సమాచార కమిషన్ ఎలా పని చేయవచ్చో అవగాహన కల్పిస్తున్నారు . అంతే కాకుండా ఆయన స్వంతంగా ఫ్యాక్ట్లీ పేరుతో ఆన్ లైన్ లో న్యూస్ పోర్టల్ నడుపుతున్నారు.సోషల్ మీడియా విభాగంలో ఇప్పుడది పెను సంచలం రేపుతోంది. వరంగల్ ఎన్ఐటి లో చదివిన రాకేష్ రెడ్డి ఒరాకిల్ లో పని చేశారు. ప్రభుత్వ పాలసీలు, వాటి వెనుక ఉన్న మతలబుల గురించి ఆయనకు తెలిసినంతగా వేరెవ్వరికి తెలియదు . ఆర్టీఐ యాక్ట్ ఎంత బలమైన చట్టమో జనాన్ని జాగృతం చేశారు.
భూమి సంస్థకు కో ఫౌండర్ గా ఉన్నారు. అభ్యాస్ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ కు కో ఫౌండర్ గా ఉండగా , ది లక్ష్య ఫౌండేషన్ కు బోర్డు అఫ్ ట్రస్టీగా ఉన్నారు . ఫ్యాక్టీలిని స్థాపించారు. జర్నలిజం పరంగా ఫెల్లౌషిప్స్ పొందారు. దేశ వ్యాప్తంగా పలు సంస్థల్లో రాకేష్ రెడ్డి మాట్లాడారు . రెడ్డి తో పాటు మరికొందరు ఫ్యాక్ట్లీ లో పని చేస్తున్నారు. మనోజ్ మండువ, శశికిరణ్ దేశెట్టి కో ఫౌండర్స్ గా ఉండగా తేజస్వి ప్రతిమ ఎడిటర్ గా భాద్యతలు చూస్తున్నారు. నరేష్ మెంటర్ గా ,సలహాదారుగా సేవలు అందిస్తున్నారు. భరత్ గునిగంటి , సూర్య కందుకూరి , పార్వతి మోహన్ , సాయి సంతోష్ అఖిల్ మోతె , ఉప్పు రాకేష్ , కంచర్ల భరత్ , పవిత్ర , జ్యోతి , సురేష్, మోనార్క్ లు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు . రాకేష్ రెడ్డి మన వాడైనందుకు గర్వపడదాం. ఆయన ఆశయం నెరవేరాలని కోరుకుందాం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!