రోజుల్లో కానిది..గంటల్లో అవుతుందా..?
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆఘమేఘాల మీద ఎందుకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారో వివరాలు సమర్పించమంటూ రాష్ట్ర సర్కార్ ను ఆదేశించింది. 109 రోజులు సమయం అడిగిన మీరు కేవలం 24 గంటల్లో ఎన్నికలు ఎలా జరుపుతారంటూ డివిజన్ బెంచ్ ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రభుత్వం ఆఘ మేఘాల మీద పురపాలికల ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నం చేస్తోందని, దీని వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్ప ఒరిగేది ఏమీ ఉండదని ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తెలంగాణలోని పట్టణాలను అశాస్త్రీయంగా విభజించారని, మార్పులు చేశారని ఆరోపణలు చేశారు.
మున్సిపోల్స్ ప్రక్రియను కేవలం ఎనిమిది రోజుల్లో ఎలా పూర్తి చేయాలనీ అనుకుంటున్నారో అర్థం కావడం లేదని బెంచ్ పేర్కొంది. ఎన్నికలు జరిపేందుకు మూడు నెలలకు పైగా టైం పడుతుందని చెప్పిన సర్కార్ ఆఘమేఘాల మీద ఇలా పేర్కొనడం భావ్యం కాదన్నారు. మీరు తెలిపినట్టు, నిజమే నాలుగు నెలల పనిని మూడు నెలల్లో చేస్తే ఏమీ కాదు ..కానీ నెల రోజుల లోపే చేస్తేనే అనుమానం వస్తుంది. వార్డుల విభజనకు 32 రోజులు , ఎస్సీ , ఎస్టీ , బీసీ , మహిళా ఓటర్ల గుర్తింపు కోసం 28 రోజులు , వార్డుల ఖరారుకు 7 రోజులు , చైర్మన్ రిజర్వేషన్స్ కోసం 7 రోజులు ఇలా అడిగిన ప్రభుత్వం ..కేవలం ఒకే ఒక్క రోజులో చేస్తామంటే ఎలా అని డివిజన్ బీచ్ ప్రశ్నిచింది.
అభ్యంతరాలను ఏ విధంగా పరిష్కరించారు.? ఎంత సమయం తీసుకున్నారు ? కొత్త చట్టం తీసుకు వచ్చినప్పుడు ..పాత చట్టం ప్రకారం ఎన్నికలు ఎలా జరుపుతారు .? అసలు కొత్త చట్టం లో ఏమున్నది ? పాత చట్టానికి కొత్త దానికి తేడా ఏమోటో ..వివరాలతో కోర్టుకు రావాలని బెంచ్ ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా తప్పుల తడకగా జరిగిందంటూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అంజన్కుమార్ రెడ్డి కోర్ట్ లో పిల్ వేశారు. చీఫ్ జస్టిస్ చౌహన్ , జడ్జి షమీమ్ అక్తర్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వాదించారు. మొత్తం మీద మున్సిపల్ పోల్స్ వ్యవహారం కోర్టుకు చేరడంతో ఎన్నికలు మరింత ఆలశ్యం అయ్యేలా ఉన్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి