కామెడీ పండింది..వంద కోట్లు దాటేసింది

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రిలీజ్ అయిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా అంచనాలు దాటేసింది.. రికార్డులను తిరగ రాస్తోంది. కంటెంట్ పరంగా పవర్ ఫుల్ గా లేక పోయినా కామెడీ మాత్రం పంట పండడంతో వద్దంటే డబ్బులు వచ్చి పడుతున్నాయి. విడుదలైన రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విక్టరీ వెంకటేశ్, నేచురల్ స్టార్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఇపుడు టాప్ వన్ పొజిషన్‌లో ఉంది. హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పిల్లలు, పెద్దలు, మహిళలు అంతా టాకీసులకు క్యూ కడుతున్నారు. అత్త గారి పాత్రలో ప్రగతి..అల్లుళ్లుగా వెంకీ, తేజ్ ల నటనకు వంద మార్కులు పడ్డాయి. తమన్నా పర్వాలేదనిపించినా ..ప్రకాశ్ రాజ్, పృథ్విల కామెడీ మరింత ఆకట్టుకునేలా చేసింది. ఫైట్లు, ద్వందార్థాలు ఏవీ లేక పోయినా..రొమాన్స్ కొంచెం శృతి మించినా కాసుల వసూలుకు అడ్డు లేకుండా పోయింది. విడుదలైన అన్ని థియేటర్లలో ఎఫ్ 2 హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శింప పడుతోంది. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు దాటేసిందని నిర్మాత దిల...