విదేశీ యూనివర్శిటీల్లో మనోళ్లు
ప్రపంచీకరణ పుణ్యమా అంటూ భారత్ వెలిగి పోతోంది. విద్యా పరంగా విదేశాల్లో ద్వారాలు తెరుచు కోవడంతో మన దేశానికి చెందిన విద్యార్థులు అపారమైన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. తమ ప్రతిభా పాటవాలతో ఆకట్టుకుంటున్నారు. ఫారినర్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నారు. వ్యవస్థలను నియంత్రిస్తూ ఎప్పటికప్పుడు టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతున్న ఐటీ రంగంలో మనోళ్లు టాప్ లేవల్‌లో ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఒక ఊపు ఊపుతున్న గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు మన వాళ్ల చేతుల్లో నడుస్తున్నాయి. తమిళనాడుకు చెందిన సుందర్ పిచ్చెయ్, తెలుగువాడైన సత్య నాదెళ్ల , తదితరులు ఇండియా పేరు నిలబెడుతున్నారు. జీవితంలో ఊహించని వేతనాలు అందుకుంటున్నారు. విప్రో, ఇన్ఫోటెక్, ఇన్ఫోసిస్, పొలారిస్, తదితర కంపెనీల ప్రధాన విభాగాల్లో ఇండియన్స్ హవా కొనసాగుతోంది. మేనేజ్ మెంట్ రంగంలో మనవాళ్లే టాప్. కార్పొరేట్ కంపెనీలను విజయవంతంగా నడిపించడంలో సక్సెస్ అవుతున్నారు.
ఆనాడు దేశ విముక్తి కోసం మహాత్మా గాంధీ బారిస్టర్ చదువు కోసం దక్షిణా ఫ్రికాకు వెళితే..దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ..తదితరులు ఇతర దేశాల్లో చదువుకున్న వారే. ప్రస్తుతం వివిధ రంగాలలో ఉన్నత పదవుల్లో ఉన్నవారంతా అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, జర్మనీ, సౌతాఫ్రికా యూనివర్శిటీల్లో అభ్యసించారు. ఇక్కడ యూనివర్శిటీలలో చదువుకున్న వారు ఫారిన్ కంట్రీస్ కు ప్రయారిటీ ఇస్తూ అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడే సేవల్లో అందిస్తూ డాలర్ల వేట సాగిస్తున్నారు. ఇక విద్యా పరంగా టాప్ డిమాండ్ ఉన్న కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కు ప్రాముఖ్యత ఉంటోంది.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సైతం ఇతర దేశాల్లో చదువుకున్నారు. వివిధ దేశాల రాజ్యాంగాలను అవపోసన పట్టారు. లక్షలాది మంది పిల్లలు ఇపుడు విదేశీ బాట పట్టారు. మేనేజ్ మెంట్ గురువులుగా వినుతికెక్కారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు సడలించడం, పర్యాటకరంగం కొత్త పుంతలు తొక్కడంతో మరిన్ని అవకాశాలు పెరిగాయి. యుఎస్ తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా కంట్రీస్ కు ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఫారిన్ డిగ్రీస్ తో పేరు సంపాదించుకున్నారు.
వ్యాపార, వాణిజ్య రంగాలలో తమదైన ముద్ర వేస్తున్నారు. అపారమైన అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే దేశ పరిశ్రమల రంగంలో దూసుకుపోతున్న దిగ్గజాల కంపెనీలను నిర్వహిస్తున్న వారంతా మేనేజ్ మెంట్ లో సక్సెస్ అయ్యారు. స్టీల్ రంగంలో తమదైన బ్రాండ్ ను టాటా స్వంతం చేసుకుంది. 1937లో టాటా ఏళ్ల పాటు వ్యాపార రంగంపై ప్రభావం చూపిస్తోంది. టాటా కోనెల్ యూనివర్శిటీలో బీఎస్ ఇన్ ఆర్కిటెక్షర్ లో , హార్వర్డ్ యూనివర్శిటీలో 1975లో అడ్వాన్స్‌డ్ మేనేజ్ మెంట్ ప్రోగ్రాంలో చదివారు.
ఆది గోద్రెజ్ గోద్రెజ్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీలకు ఛైర్మన్‌గా ఉన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదివారు. ఐంఐటీ స్లోన్‌లో స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో పట్టా పొందారు. అక్కడే చదువుకొని ఇండియాకు వచ్చారు. కస్టమర్ల కు నాణ్యవంతమైన ఉపకరణాలను అందించడంలో గోద్రెజ్‌ను గొప్ప కంపనీగా తీసుకు వచ్చేందుకు కృషి చేశారు. లైసెన్స్ రాజ్‌గా పేరొందారు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన వ్యాపారుల్లో అంబానీల పేరు ఉంటుంది. రిలయన్స్ ఈ పేరు ప్రపంచ మార్కెట్‌ను శాసించే స్తాయికి చేరుకుంది. 1959లో జన్మించిన అనిల్ అంబానీ చేయని వ్యాపారమంటూ ఏమీ లేదు. రిలయన్స్ ఏడీఏ గ్రూపు కంపెనీలకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఎంటర్‌టైన్ మెంట్ రంగంలో తనదైన ముద్ర వేసేలా చేశారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 44 ఎఫ్ ఎం రేడియో స్టేషన్లను బిగ్ ఎఫ్ ఎం పేరుతో నడుస్తున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఎంబీఏ చేశారు. డీటీహెచ్ సర్వీస్ కు శ్రీకారం చుట్టారు.
హమారా బజాజ్ ఈ పదాలు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఎక్కడికి వెళ్లినా బజాజ్ స్కూటర్లు, వాహనాలు ప్రతి ఇంటిలో ఉండేలా పాటుపడ్డారు. ఆటోమొబైల్ రంగంలో తమదైన ముద్ర వేశారు. రాహుల్ బజాజ్ కంపెనీలకు ఛైర్మన్‌గా ఉన్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో మేనేజ్ మెంట్ రంగంలో పట్టా పొందారు. వీరితో పాటు విప్రో ఛైర్మన్ అజీం ప్రేమ్ జీ స్టాన్ పోర్డ్ యూనివర్శిటీలో డిగ్రీ పొందారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు ఛైర్మన్‌గా ఉన్న కుమార్ మంగళం బిర్లా లండన్ స్కూల్ ఆప్ బిజినెస్‌లో చదివారు. మహింద్రా గ్రూప్ ఆప్ కంపెనీలకు ఛైర్మన్‌గా ఉన్న ఆనంద్ మహీంద్ర హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చేశారు.
రాజకీయ రంగంలో రణధీరులు - ఇక రాజకీయ రంగానికి వస్తే ఈ దేశానికి ప్రధానిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇంగ్లాండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జిలో డాక్టర్ ఆప్ ఫిలాసఫర్‌గా పట్టా గడించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో కూడా చదివారు. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ చదువుకున్నారు. లాలో పట్టా పొందారు. ఎల్ ఎల్ ఎం లో చదివారు. నజ్మా హెప్తుల్లా కార్డియాక్ ఆంటోనమీలో పీహెచ్‌డీ పట్టా పొందారు.
శశిథరూర్ మోస్ట్ వాంటెడ్ పొలిటిషియన్‌గా పేరొందారు. మేధావిగా వినుతికెక్కారు. కాంగ్రెస్ పార్టీకి గొంతుకగా ఉన్నారు. ఎంపీగా యుఎన్‌లో ప్రసంగించారు. సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ నుండి ప్రశంసలు అందుకున్నారు. టుఫ్ట్స్ యూనివర్శిటీ నుండి పీహెచ్‌డీ అందుకున్నారు.
పి. చిదంబరం. ఈ పేరు దేశ వ్యాప్తంగా సుపరిచితం. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చేశారు. జైరాం రమేష్, మెలేన్ యూనివర్శిటీలో చదివారు. సుబ్రమణ్య స్వామి హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకున్నారు. జ్యోతిరాదిత్యా సింధియా హార్వర్డ్, స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీల్లో అభ్యసించారు. యూనివర్శిటీ ఆఫ్ పెన్సులేనియా లో ఎంబీఏ చశారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ నుండి నవీన్ జిందాల్ చదివారు. అగతా సంగ్మా నాటింగ్‌హం యూనివర్శిటీ నుండి ఎన్విరాన్‌మెంటల్ నుండి పట్టా పొందారు.
మీడియా మొగల్స్ షైతం - మీడియా రంగంలో పేరొందిన బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టులు కూడా ఇతర దేశాల్లో చదువుకున్న వాళ్లే. ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రికకు ఎడిటర్‌గా ఉన్న అరుణ్ శౌరి న్యూయార్క్‌లోని సైరాకాస్ యూనివర్శిటీలో డాక్టరేట్ పొందారు. బాంబే మేగజైన్‌కు ఎడిటర్‌గా ఉన్న వీర్ సాంఘ్వి ఆక్స్‌ఫర్డ్ బిజినెస్ స్కూల్‌లో చదువుకున్నారు.
తన మాటల తూటాలతో దుమ్ము రేపుతున్న మోస్ట్ వాంటెడ్ జర్నలిస్ట్‌గా పేరొందిన అర్నాబ్ గోస్వామి ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీలో చదివారు. సోషల్ ఆంత్రోపాలజీలో ఎంఏ చేశారు. ఇండియా టుడే ఫౌండింగ్ ఎడిటర్ గా ఉన్న మధు ట్రెహాన్ కొలంబియా యూనివర్శిటీలో జర్నలిజంలో డిగ్రీ చేశారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుండి కరన్ తాపర్, బర్కాదత్ ..కొలంబియా యూనివర్శిటీలో జర్నలిజంలో డిగ్రీ పొందారు. రాజ్‌దీప్ సర్దేశాయ్ ఆక్స్‌ఫోర్డ్‌లో చదివారు.
రీసెర్చ్ అండ్ అకడెమీస్‌లో ..యూనివర్శిటీ ఆఫ్ లండన్‌లో చారిత్రాత్మక పరంగా పరిశోధనలు చేశారు..రొమిల్లా థాపర్.
పర్‌డ్యూ యూనివర్శిటీ నుండి ఎన్. ఆర్. రావు స్ట్రక్చరల్ కెమిస్ట్రీ లో పట్టా తీసుకున్నారు.
కళ పరంగా..గిరీష్ కర్నాడ్ కు మంచి పేరుంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ఎంఏ ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీలు పొందారు. బాలివుడ్‌లో నటిగా పేరొందిన పరిణీతి చోప్రా యుకె లోని మాంచెస్టర్ బిజినెస్ స్కూల్‌లో బిజినెస్, ఫైనాన్స్, ఎకనామిక్స్‌లో పట్టాలు పొందారు. టుఫ్ట్స్ యూనివర్శిటీ నుండి అమీషా పటేల్ ఎకనామిక్స్‌లో డిగ్రీ చదివారు. ఇందులో గోల్డ్ మెడల్ సాధించారు. యూనివర్శిటీ ఆఫ్ మెల్‌బోర్న్ నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్ లో రణదీప్ హూడా చదివారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సోహా అలీఖాన్, పుర్‌డ్యూ యూనివర్శిటీ నుండి దుల్హర్ సల్మాన్ బీబీఏ చదివారు.
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఎంఐటీ స్లోన్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్ చదివారు. పెప్సీ మాజీ సీఇఓ ఇంద్రా నూయి యాలే స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీలో సల్మాన్ రష్డీ చదివారు. ఆర్థిక వేత్తగా పేరొందిన అమర్త్య సేన్ ..ఓహియో యూనివర్శిటీ, కాలిఫోర్నియా యూనివర్శిటీలలో పట్టాలు పొందారు. .మైక్రో సిస్టమ్స్ సృష్టికర్త వినోద్ కోస్లా స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ నుండి ఎంబీఏ చేశారు. హాట్ మెయిల్ సృష్టికర్త సబీర్ భాటియా ఇదే యూనివర్శిటీ నుండి ఎంఎస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. మైక్రో సాఫ్ట్ సిఇఓగా ఉన్న సత్య నాదెళ్ల, యూనివర్శిటీ పెన్సీల్వానియా నుండి ఎంబీఏ చదివారు గూగుల్ సిఇఓ సుందర్ పిచెయ్. హార్వర్డ్ యూనివర్శిటీ నుండి ఫేమస్ ఫిల్మ్ మేకర్ మీరా నాయర్, టొరెంటో యూనివర్శిటీ నుండి రోహింటన్ మిస్త్రి చదువుకున్నారు. మొత్తం మీద మనవాళ్లు ఇతర దేశాల వారితో అన్నింటా పోటీ పడ్డారు. తమకు ఎదురు లేదంటూ చెప్పకనే చెప్పారు. సో..చదువు ఏ ఒక్కరి స్వంతం కాదన్నది వీరిని చూస్తే తెలుస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి