స్ఫూర్తి శిఖరం అతడే ఓ సైన్యం
ఒకటే జననం ఒకటే మరణం. ఒకటే విజయం అదే ఇంపాక్ట్. ఇప్పుడు వేలాది మందికి వేదం మంత్రం. ఏమిటిది అనుకుంటున్నారా అవును ఇది అక్షరాలా నిజం. కాదనలేని నగ్నసత్యం. లబ్దప్రతిష్ఠులైన వ్యక్తులు. విజయం అంచుల దాకా వెళ్లి వచ్చిన వాళ్ళు . గెలుపును స్వంతం చేసుకున్న విజేతలు. సమాజాన్ని నిత్యం ప్రభావితం చేసే మహోన్నతమైన వ్యక్తులు.ఇలా ఒకరా ఇద్దరా వందలాది మంది మనకు పాఠాలు చెబుతారు. మనం కోల్పోయిన వన్నీ గుర్తుకు తీసుకు వస్తారు. తమ అనుభవ సారాన్ని అత్యంత ఉద్విగ్నతతో మనల్ని కట్టి పడేస్తారు. ఇదంతా ఒకే ఒక్క మనిషి సాధించిన అపూర్వ మైన సక్సెస్. అతడే ఓ శక్తి. వివిధ రంగాలలో అత్యున్నతమైన స్థానాలలో ఉన్న వారందరు అక్కడికి వస్తారు. మీతో పాటే మనసు విప్పి మాట్లాడతారు. ఆడో పాఠశాల . అదో ప్రకృతి ప్రసాదించిన పర్ణశాల. యుద్ధానికి సన్నద్ధం చేసే మైదానం. నిత్యం ధైర్యం నింపే వాక్యాలు .. అక్షరాలు..మాటలు .. వేల పుస్తకాలు చదివినా అబ్బని జ్ఞానం ..అలవోకగా అర్థం కానీ జీవిత సారం అంతా గంపా నాగేశ్వర్ రావ్ ఏర్పాటు చేసిన ఇంపాక్ట్ లో దొరుకుతుంది .
మనసును శాంత పరిచి మనిషిగా మార్చే దేవాలయం. నిత్యం ప్రాతః స్మరణీయం లాంటి బతుకును జయించిన యోగుల ప్రవచనాలు వెరసి మనల్ని ధీరులుగా మారుస్తాయి. మనం ఏం కావాలో ..మనం మనలా ఎలా ఉండాలో తెలుసుకుంటాం. ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసిన వివేకానంద ..జాతిని జాగృతం చేసిన గాంధీ లాంటి వారి సింప్లిసిటీని అర్థం చేసుకుంటాం. మనం మనుషులుగా తయారవుతాం. బడుల్లో చెప్పని బతుకు పాఠాలు ఇక్కడ వల్లె వేస్తాం. ఇదంతా గంపా కృషే. ఒక్కరితో ప్రారంభమైన ఈ గెలుపు ..యాత్ర ఇప్పుడు వేలాది మంది సైనికుల్ని తయారు చేసింది.
పట్టుదల ..కృషి ..ఉంటె సరి పోతుందా ఆటు పోట్లను ఎదుర్కునే సామర్థ్యం కావాలిగా ..అదే ఇంపాక్ట్ లో సమృద్ధిగా లభిస్తుంది. విజ్ఞానం ..వివేకం ..మూర్తీభవించిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన దార్శనికుల్ని మనం కలుసుకుంటాం. తక్కువ ఖర్చుతో విలువల్ని ..ఇంగ్లీషులో ప్రావీణ్యుల్ని చేస్తున్న ఆర్కే మఠ్ భాద్యులు ..జేడీ లక్ష్మీనారాయణ..వీరేంద్రనాథ్.. సద్గురు శ్రీ పరిపూర్ణానంద ..ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి .. పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ..వ్యక్తిత్వ వికాస నిపుణులు ..హారిక రెడ్డి .. వేణు భగవాన్ .. పల్లెటూరు నుండి వచ్చి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో ఆంగ్లంలో పాఠాలు చెప్పిన చిరంజీవి ..ఇలాంటి వారు చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద లిస్ట్ తయారవుతుంది . ఇదంతా విప్పి చెబితే ఏడాది పడుతుంది .
చావు చివరి అంచుల దాకా వెళ్లి తిరిగి వచ్చిన వాళ్ళు ..సూసైడ్ చేసుకోవాలని అనుకుని ఆగిపోయిన వాళ్ళు ..జీవితం ఎందుకురా ఓ ఖర్మ అనుకుంటూ తిట్టుకునే వాళ్ళు .. ఇక నా కొద్దు ఈ బతుకు వద్దంటూ లోలోపట మధన పడుతున్న వాళ్ళు ..నిరాశ నిస్ప్రుహ లో కొట్టు మిట్టాడుతున్న వాళ్ళు ..ఇలా వేలాది మంది యువతీ యువకులు ఇంపాక్ట్ పుణ్యమా అంటూ దారిలోకి వచ్చారు. వారే మరి కొందరికి దిశా నిర్దేశనం చేసే స్థాయికి చేరుకున్నారు . ఇదంతా గంపా చేసిన ప్రయత్నం. ఎలాంటి వ్యాపార ..వాణిజ్య పోకడలు పోకుండా కొన్నేళ్ల పాటు ఇంపాక్ట్ పేరుతో తరగతులు నిర్వహిస్తున్నారు.
జీవితంలో పైకి రావాలన్నా .. గుండెల్లో కొండంత ధైర్యం రావాలన్నా .. మనకంటూ ఓ బ్రాండ్ కావాలన్నా .. వేరొకరి చట్రంలో చిక్కుకోకుండా ..మనకు మాత్రమే సాధ్యమయ్యే లా ఓ ఇమేజ్ దక్కాలంటే ..లైఫ్ డామేజ్ కాకుండా విన్నింగ్ ఇమేజ్ కావాలంటే ఇంపాక్ట్ లో చేరాలి . అప్పుడు వ్యక్తి వ్యవస్థ గా మారిపోతాం. అలా కాక పోయినా సమాజం గర్వించేలా ..కుటుంబం తమ పేరు చెప్పుకునేలా మాత్రం తయారవుతాం .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి