భ‌క్తుల కొంగు బంగారం .. పెద్ద ద‌ర్గా వ‌రం ..!


దేశం అంతా కడప వైపు చూస్తోంది . సెలబ్రెటీలు .. పొలిటికల్ లీడర్లు ..వ్యాపార .. వాణిజ్యవేత్తలు ..నటీ నటులతో ఆ ప్రాంతం పాపులర్ అయ్యింది అదే పెద్ద దర్గా. ఇప్పుడు అదే హాట్ టాపిక్ . తిరుమల తిరుపతి ని దర్శించుకునే వాళ్లంతా దర్గాను చూసి తరిస్తున్నారు . తమ మొక్కులు తీర్చుకుంటున్నారు . గత పదేళ్లుగా ఈ దర్గా మరింత ప్రాచుర్యం పొందింది. పేదలు... ధనికులు ..కులాలు ..మతాలు ..ద్వేషాలు ..విద్వేషాలు ..అన్నీ అక్కడ అగుపించవు. అంతా సమానులే .. సామాన్యులే . ఇదీ దర్గా ప్రత్యేకత. కడపలో దిగితే చాలు అక్కడి వారంతా దర్గా దగ్గరికేనా అని అడుగుతారు. మనల్ని అక్కడికి తీసుకు వెళతారు. ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అన్నార్తులు ..ఆనాధలు ..అక్కడికి వస్తారు. దర్గాలోనే వుంటారు . తమను దీవించమంటూ వేడుకుంటారు. ఇలాంటి దృశ్యాలు కోకొల్లలుగా అగుపిస్తాయి . 

ఎంత సంపాదించినా సరే ఇక్కడికి వచ్చాక తమ అహాన్ని మరిచి పోతారు . లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు . ఇదీ దీని ప్రత్యేకత . కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భావిస్తారు. అందుకే ఈ మధ్య ఇంకా భక్తుల తాకిడి ఎక్కువైందని నిర్వాహకులు చెబుతారు. అధికారులు .. లీడర్లు ..సినీ నటులు ..కళాకారులు ..ఇలా ఏదో సమయంలో వస్తారు . మొక్కులు తీర్చుకుని వెళతారు . నటులు మహేష్ బాబు , చరణ్ , బాల కృష్ణ ..అక్షయ కుమార్ .. అలీ .. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ .. ప్రముఖ డ్రమ్మర్ శివమణి ..ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా సరిపోదు . అభిషేక్ బచ్చన్ .. ఆయన భార్య చాదర్ లు సమర్పించుకున్నారు . 

తాము కూడా మనుషులమేనని ..నటులు స్పష్టం చేశారు . అదేమిటో కానీ ఇక్కడికి ఒక్కసారైనా రాకపోతే నేను మనిషిగా వుండలేనంటాడు ప్రపంచాన్ని తన మ్యూజిక్ తో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఏ ఆర్ రెహమాన్ . ప్రతి ఏటా ఉర్సు ఉత్సవం వైభవోపేతంగా జరుగుతుంది . రాజస్థాన్ .. మహారాష్ట్ర , తెలుగు రాష్ట్రాలు ..యుపి , అస్సాం ..ఢిల్లీ ..ఇలా దేశం నలుచెరుగులా వస్తారు . పేరొందిన వారు ఇక్కడికి రావడం ఆనవాయితీగా మారింది . ప్రతి ఏటా తన కుటుంబంతో రెహమాన్ ఇక్కడికి వస్తారు . ఉత్సవం జరిగే వేళ ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు . తన గొంతుతో ఖవ్వాలి నిర్వహిస్తారు . రాత్రి మరో ప్రపంచాన్ని ఆవిష్కరిస్తారు . భక్తితత్వం ... సూఫీ తత్వం కలగలిసిన దృశ్యం అక్కడ ఆవిష్కరిస్తారు .

అందుకోసం ఆయన తన బృందం తో కలిసి కచేరీలు నిర్వహిస్తారు . ఇది గత కొంత కాలంగా జరుగుతూ వస్తోంది . రెహమాన్ వచ్చాక దర్గా స్వరూపమే మారిపోయింది . తన కెరీర్ పరంగా ఎంత బిజీగా వున్నా సరే ...కోట్లు కాదనుకుని .. ఆఫర్లను వద్దనుకుని ఉత్సవ శోభను మరింత జాగృతం చేసేలా అల్లా రఖా రెహమాన్ పాలు పంచుకుంటారు . దయామయులు ..అన్నీ కోల్పోయిన వాళ్ళు ..ఫకీర్లు ..ముల్లాలు ..ఆనాధలు .. కొడుకులు ..బిడ్డలు వదిలేసినా వాళ్ళు ..సమాజం చేత నెట్టివేయబడ్డ వాళ్ళు ..స్వాంతన కోసం దర్గా వద్దకు వస్తారు . ఎక్కడికి వెళ్లినా హుండీలు ..డబ్బులు ..కానీ ఇక్కడ అప్పుడే విరబూసిన గులాబీ పూలు దర్శనం ఇస్తాయి ..సాయంత్రం వేళ .. రాత్రి సమీపించే సమయాన భ్కత్తుల సమక్షంలో దర్గా వెలిగి పోతుంది . 

అటు కాశ్మీరు నుండి ఇటు కన్యాకుమారి దాకా భక్తులు దర్గాను దర్శిస్తారు . అంతా సమానమే .. అంతా ఒక్కటే .. బయట వినిపించే రణగొణధ్వనులు వుండవు . మాత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ దర్గా. కోర్కెలు ..భాదలు తీర్చే కొంగు బంగారంగా భాసిల్లుతోంది . ఈ దర్గాకు 300  ఏళ్ళ చరిత్ర వున్నది . క్వాజా పీరుల్లా హుస్సేనీ దేశమంతటా తిరిగారు . కడపలో సమాధి అయ్యారు . అదే పెద్ద దర్గాగా నేడు వెలుగొందుతోంది. భక్తులకు భరోసా కల్పిస్తూ బతుకు సారాన్ని బోధిస్తోంది . ఎంతో విశిష్టత కలిగిన పెద్ద దర్గాను మీరు దర్శించుకోండి . ఆ అనుభవ సారాన్ని మీలోకి చేర్చుకోండి.!

కామెంట్‌లు