కామెడీ పండింది..వంద కోట్లు దాటేసింది
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రిలీజ్ అయిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా అంచనాలు దాటేసింది.. రికార్డులను తిరగ రాస్తోంది. కంటెంట్ పరంగా పవర్ ఫుల్ గా లేక పోయినా కామెడీ మాత్రం పంట పండడంతో వద్దంటే డబ్బులు వచ్చి పడుతున్నాయి. విడుదలైన రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విక్టరీ వెంకటేశ్, నేచురల్ స్టార్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఇపుడు టాప్ వన్ పొజిషన్‌లో ఉంది. హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పిల్లలు, పెద్దలు, మహిళలు అంతా టాకీసులకు క్యూ కడుతున్నారు. అత్త గారి పాత్రలో ప్రగతి..అల్లుళ్లుగా వెంకీ, తేజ్ ల నటనకు వంద మార్కులు పడ్డాయి. తమన్నా పర్వాలేదనిపించినా ..ప్రకాశ్ రాజ్, పృథ్విల కామెడీ మరింత ఆకట్టుకునేలా చేసింది. ఫైట్లు, ద్వందార్థాలు ఏవీ లేక పోయినా..రొమాన్స్ కొంచెం శృతి మించినా కాసుల వసూలుకు అడ్డు లేకుండా పోయింది.
విడుదలైన అన్ని థియేటర్లలో ఎఫ్ 2 హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శింప పడుతోంది.
ఇప్పటికే 100 కోట్ల రూపాయలు దాటేసిందని నిర్మాత దిల్ రాజు , డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రకటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ భారీ స్థాయిలో లేక పోయినప్పటికీ మినిమం గ్యారెంటీ స్థాయిలో ఉండేలా సినిమాను తీర్చిదిద్దారు డైరెక్టర్. ఎలాంటి హింసకు తావు లేకుండా ఇంటిల్లిపాది హాయిగా ..నవ్వుకునేలా చేశారు. లొకేషన్లు..డ్యాన్సులు..పంచ్‌లు..ప్రసాలతో ఆద్యంతమూ సినిమాను నడిపించిన తీరును మెచ్చుకోకుండా ఉండలేం. అందుకే జనం లీనమై పోయారు సినిమాలో. ఒకప్పుడు 20 కోట్లు వసూలు చేయడమే గొప్ప..కానీ ఇపుడు ఆ సీన్ మారింది. వారం రోజుల లోపే సినిమా రిజల్ట్ వచ్చేస్తోంది. వ్యూయర్స్ అభిప్రాయాలలో మార్పు చోటు చేసుకుంది. బాగుంటే ఆదరిస్తున్నారు.. లేదంటే తిరస్కరిస్తున్నారు.
ఎంత పెద్ద హీరో అయినా..హీరోయిన్ ఏ స్థాయిలో ఉన్నా.. కథ బాగోలేక పోతే డోంట్ కేర్ అంటున్నారు. దీంతో తెలుగు సినిమా కొంత పుంతలు తొక్కుతోంది. కంటెంట్ బలంగా ఉండడం..హీరో హీరోయిన్ల ఎంపిక..టైమింగ్..స్క్రీన్ ప్లే..సంగీత నేపథ్యం..డ్యాన్సులు..పాటలు..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రిచ్ గా ఉండేలా చూస్తున్నారు. ఇటీవల విడుదలైన అన్ని సినిమాలలో కంటే ఎఫ్ 2 వసూళ్లలో ముందంజలో ఉంది. గత కొంత కాలంగా సినిమాలు తీసినా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేదు..నిర్మాత దిల్ రాజుకు. దీంతో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రావిపూడి ఈసారి కసితో తీసిన కామెడీ ఎంటర్ టైన్ మెంట్ మూవీ ఎఫ్ 2 ఏకంగా వంద కోట్లకు చేరుకోవడం టాలీవుడ్‌ను విస్మయానికి గురి చేస్తోంది.
ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో సైతం కాసులు కొల్లగొడుతోంది ఈ సినిమా. వెంకటేష్ ..వరుణ్ తేజ్ లు డైరెక్టర్ ఆశించిన దానికంటే ఎక్కువగా పాత్రల్లో లీనమవడం ..కామెడీని పండించడంతో సినిమా సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. మొత్తం మీద గతంలో కోల్పోయిన డబ్బులన్నీ తిరిగి వెంకట రమణా రెడ్డి అలియాస్ దిల్ రాజుకు దక్కడంతో ఊపిరి పీల్చుకున్నట్టయింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి