వీళ్లు..నిజమైన హీరోలు..!
సినిమా రంగాన్ని రారాజులుగా ఏళుతున్న వాళ్లు ..తమకు తాము గొప్పవాళ్లమనుకుని భావించుకునే వాళ్లు..తాతలు..ముత్తాతలు..ఆపై తరాల పేరు చెప్పుకుని ఊరేగుతున్న వాళ్లు ..కార్పొరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా..డబ్బులు పోగేసుకుంటూ ఫోజులు కొడుతున్న వాళ్లు సిగ్గుపడేలా వీళ్లు ..తెర మీదనే కాదు నిజ జీవితంలో కూడా తాము హీరోలమేనంటూ నిరూపించుకున్నారు. అన్నమో రామచంద్ర అంటూ లెక్కనేంత మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా ..ఎన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నా వారి తలరాతలు మారడం లేదు. ఈ దేశ అభివృద్ధిలో అధిక భాగం వ్యవసాయ రంగానిదే. ప్రపంచ బ్యాంకు ఆధిపత్యం.
.విదేశాల జోక్యం దెబ్బకు మార్కెట్ రంగం కుదేలై పోయింది. పుణ్యంకొద్దీ దొరికిన ఈ పాలకులు ప్రజల బాగోగుల గురించి పట్టించు కోవడం మానేశారు. ఆరుగాలం కష్టపడి..అప్పులు చేసి ..తిప్పలుపడి పంట పండిస్తే..మద్ధతు దొరకని దుస్థితి దాపురించింది. ఎక్కడ చూసినా ఆకలికేకలు..అన్నార్థుల ఆర్తనాదాలు..తట్టుకోలేక మధ్యలో తనువులు చాలిస్తున్న మట్టి బిడ్డలు. ధాన్యంపై దళారీల పెత్తనం పెరిగి పోవడంతో పండించే రైతులకు దిక్కే లేకుండా పోయింది. సిండికేట్ గ్రూపుల దెబ్బకు మార్కెట్లు వెల వెల బోతున్నాయి.
మితిమీరిన రాజకీయ జోక్యంతో బ్రోకర్ల, దడవాయిల ముందు చూపు దోపిడీకి నిలువునా మోసపోతున్నారు. పెప్సీ, కోక్, మిరిండా, బిస్లెరీ, రాయల్‌స్టాక్, శ్యాంసంగ్, సోనీ, వివో , అడిడాస్, లో దుస్తులు, జాకీ, తదితర కంపెనీల ప్రకటనల్లో నటించే నటీనటులు, క్రికెటర్లు, సెలబ్రెటీలు కోట్లు వెనకేసుకుంటున్నారు. ప్రజల కోసం తమను వెర్రిగా అభిమానించే వారి కోసం ఒక్క పైసా ఖర్చు చేసిన పాపాన పోలేదు. వీరంతా ఒక ఎత్తైతే తాము మాత్రం మనుషులేమనంటూ ఇంకొందరు డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు. ఏ సమాజం తమను నెత్తిన పెట్టుకుని పూజిస్తుందో..ఆ సమాజంలో భాగమైన జనం కోసం ఎంతో కొంత తిరిగి ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.
అన్నం పెట్టే రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు తావీయకుండా తోచినంత మేర సహాయం చేస్తున్నారు. అలాంటి వారిలో తమిళ రైజింగ్ స్టార్ విశాల్, హిందీ నటులు నానా పటేకర్, అక్షయ్ కుమార్ తమకు వచ్చిన రెమ్యూనరేషన్స్ నుండి రైతులను ఆదుకుంటున్నారు. వారికి ఎంతో కొంత సాయం చేసేందుకు ముందుకు రావాలని ..భాగం పంచు కోవాలని పిలుపునిస్తున్నారు. తెర మీద కనిపించే బొమ్మల కంటే మట్టి నుండి ధాన్యం పండించే మహిమ కలిగిన రైతులే రియల్ హీరోలంటూ వారికి సలాం చేస్తున్నారు..భేషజాలకు తావీయకుండా సామన్యమైన మనుషుల్లాగే ఆలోచించడమే కాదు ఆచరణలో చేసి చూపించిన వీళ్లు నిజమైన మానవులు..భారతమాత బిడ్డలు..కాదంటారా..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి