థ్యాంక్యూ శివ‌..హ్యాట్సాఫ్ మ‌హేష్ బాబు..!

విజ‌యం అంటే ఏమిటో..దాని మ‌జా అంటే ఏమిటో..అదెలా మ‌నిషిని ఇబ్బంది పెడుతుందో ఇపుడు తెలుసొచ్చింది..ప్రిన్స్ మ‌హేష్ బాబుకు. సినిమా అంటే ఎంత ప‌వ‌ర్ ఫుల్ మాధ్య‌మ‌మో భ‌ర‌త్ అనే నేను చూశాక అర్థ‌మ‌వుతుంది అంద‌రికీ. రెండో ఆట‌కు కూడా పిల్లలు..పెద్ద‌లు టాకీసుల ముందు నిల‌బ‌డ‌టం ద‌ర్శ‌కుడి టాలెంట్‌కు ద‌క్కిన గౌర‌వం. అంతేనా ఆర‌డ‌గుల అంద‌గాడు..క‌ల‌ల రాకుమారుడు హీరో అలా వ‌చ్చేస్తుంటే అర్ధ‌రాత్రి అయ్యాక కూడా చ‌ప్ప‌ట్లే చ‌ప్ప‌ట్లు.
బ‌హుషా ఇలాంటి స‌న్నివేశాలు సినిమాలలో..లేదా భావోద్వేగాల స‌మ్మేళ‌నాలు ఎక్కువ‌గా క్రికెట్ మ్యాచ్‌ల‌లో గోచ‌రిస్తుంటాయి. రెండేళ్ల పాటు సూప‌ర్ స్టార్‌కు చెప్పుకోద‌గిన విజ‌యాలు లేవు. శ్రీ‌మంతుడు త‌ర్వాత మ‌ళ్లీ కొర‌టాల క‌సితో తీసిన సినిమా ఇది. అందుకేనేమో ద‌ర్శ‌కుల హీరో మ‌హేష్ బాబు అని ఎప్పుడో చెప్పారు. అది వెండి తెర మీద చూస్తే తెలిసి పోతుంది. అంచ‌నాల‌కు మించి దేశ వ్యాప్తంగా ..అటు ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తుంటే మ‌నం ఏం చేయ‌గ‌లం. మ‌ళ్లీ సినిమా చూడ‌టం త‌ప్పా..
ప‌ల్లెల్లో ప‌డుచుద‌నం..గుండెల్లో ప్రేమ‌త‌నం మ‌ళ్లీ గుబాళించిన‌ట్లు మ‌హేష్‌ను చూశాక క‌లిగింది. అంద‌మంటే శ‌రీర‌మేనా..కాదు దుస్తుల
ఎంపిక‌లో..న‌డ‌వ‌డంలో ఒక స్టైల్‌. అదే ప్రిన్స్ స్పెషాలిటీ..ఎంత క‌ష్ట‌మైన సీన్ వ‌చ్చినా స‌రే దానిని ఈజీగా ..ప్రేక్ష‌కుడు ఊహించుకునే లోపే ఆక‌ట్టుకునేలా చేయ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. అభిమానుల ఒత్తిళ్లు ..ఇంకో వైపు రెండు సినిమాలు అనుకోని రేంజ్‌కు రాలేక పోవ‌డం..ఒక స్టార్ ఇమేజ్‌ను మ‌ళ్లీ నిల‌బెట్టుకోవాలంటే క‌ష్ట‌ప‌డాలి. న‌ట‌న‌లో వేరియేష‌న్ చూపించాలి. అందుకే ఏడాది పాటు ఎవ్వ‌రికీ అందుబాటులో లేకుండా పోయాడు.
ముందు నుంచే ఇంట్రావ‌ర్ట్ అయిన మ‌హేష్ ..స‌క్సెస్ స్వంతం చేసుకునేందుకు ..బాక్సులు బ‌ద్ద‌లు కొట్టేందుకు..ఫ్యాన్స్ గుండెల్లో గెలుపు కిక్కు ఎక్కించేందుకు డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ లు ఎక్స్‌పెక్టేష‌న్స్ కంటే ఎక్కువ‌గా చేశాడు. అందుకే ఇవాళ సినీవాళిలో చ‌ర్చ‌. టీవీలో అనుకోకుండా వ‌చ్చిన ఎంఎస్ ధోనీ సినిమా చూస్తున్న‌ప్పుడు ఎవ‌రీ అమ్మాయి..భ‌లే క‌నెక్ట్ అవుతోంది..పాత్ర‌లో అనుకున్నా..ఉన్న‌ట్టుండి బ్రేకింగ్ న్యూస్ చూస్తే కొర‌టాల కైరాను క‌న్‌ఫ‌ర్మ్ చేశాడ‌ని చూశాక‌..మ‌న‌సు దూది పింజెలా తేలి పోయింది. ఎంత చ‌క్క‌గా ఒదిగి పోయింది..పాత్ర‌లో..స‌మాజం..సినిమా..రాజ‌కీయం..మీడియా వీటన్నిటిని విడిచి వుండ‌లేం. అలా ఎవ‌ర‌న్నా అంటే అది వారి అమాయ‌క‌త్వం..ప్ర‌తి దానిలోను మంచి చెడులు వుంటాయి. స్వీక‌రించే దానిని బ‌ట్టి వుంటుంది. స్మార్ట్ ఫోన్లు డామినేట్ చేస్తున్న స‌మ‌యంలో ..ఇంట‌ర్నెట్ ఏలుతున్న ఈ త‌రుణంలో ..ఒక్క సారిగా ల‌క్ష‌లాది మందిని 3 వేల‌కు పైగా థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డ‌మంటే మాట‌లా..అది ఒక్క సినిమాకే చెల్లుబాట‌వుతుంది..
రాజ‌కీయ రంగంలో వున్న వారు..రావాల‌ని అనుకుంటున్న వారు..ప్ర‌జాప్ర‌తినిధులు..ప్ర‌తి ఒక్క‌రు భ‌ర‌త్ అనే నేను చూడాలి. ప్ర‌జాస్వామ్యం ఎలా వుండాలో..మ‌న‌కున్న బాధ్య‌త‌లు ఏమిటో..జ‌నానికి నేత‌ల‌కు మ‌ధ్య ఉన్న బంధం ఎలాంటిదో..ఏం చేస్తే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌వ‌చ్చో చాలా ఈజీగా తెర మీద చూయించారు శివ‌. నిన్న బాహుబ‌లి..మొన్న రంగ‌స్థ‌లం..ఇవాళ భ‌ర‌త్ అనే నేను..రేపు
ఇంకొక‌టి రావ‌చ్చు..కానీ ఇలాంటి సినిమా మాత్రం రాద‌నే చెప్పాలి.
సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ..అక్కౌంట‌బిలిటీకి మ‌ధ్య‌న జ‌రిగే ఈ స‌న్నివేశాలు మ‌న‌ల్ని థియేట‌ర్ ద‌గ్గ‌ర‌కు తీసుకు వెళ‌తాయి. ఇంత రిచ్‌గా సినిమా తీసినందుకు నిర్మాత దాన‌య్య‌కు..ఇంత మంచి స‌బ్జెక్టును ఎంచుకున్నందుకు శివ‌కు..వంద శాతానికంటే ఎక్కువ‌గా న‌టించి మెప్పించినందుకు సూప‌ర్ స్టార్‌కు మ‌రోసారి థ్యాంక్స్‌. వాట్ ఏ కాంబినేష‌న్‌..వీళ్లంతా క‌ళాకారులు..సాహిత్యంలోని మ‌జాను ఆస్వాదించిన వాళ్లు..
అందుకే సామాజిక బాధ్య‌త‌ను భుజానికెత్తుకుని మ‌న‌ల్ని
. ఆలోచించేలా చేశారు. శివ‌..దేవీశ్రీ‌..రామ‌జోగ‌య్య‌..క‌నిపించే వీళ్ల‌తో పాటు ఎంతో శ్ర‌మ‌కోర్చిన టెక్నిషియ‌న్స్‌..తెర వెనుక క‌ష్ట‌ప‌డిన వారంద‌రికీ హ్యాట్సాఫ్‌. ముమ్మాటికీ ఇది మిల్క్ బాయ్ మ‌హేష్ బాబు సినిమా. ప్ర‌తి తెలుగువాడు గ‌ర్వించ‌ద‌గిన సినిమా.
  

కామెంట్‌లు