అనుభ‌వ జ్ఞానం జీవితానందం ..!

బాబాలు, గురువులు, మెంటార్స్‌, లైఫ్ స్కిల్స్ ట్రైన‌ర్స్‌తో ఈ దేశం వెలిగి పోతోంది. ఎక్క‌డ పుస్త‌కం క‌నిపించినా చ‌ద‌వాల‌న్న ఉత్సుక‌త క‌లిగిన నాకు అనుకోకుండా పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో ఐ ల‌వ్ యు మ‌నీ కొత్త‌గా క‌నిపించింది. ప‌నిగ‌ట్టుకుని మిత్రుడొక‌రు దానిని నా చేతిలో పెట్టారు. ఓ వైపు వ్య‌క్తిత్వ , వికాస‌, తాత్విక‌, సామాజిక‌, ఆర్థిక‌, రాజ‌కీయ‌, సాంస్కృతిక‌, సాహిత్య‌, క్రీడా రంగాల‌పై అమితాస‌క్తి ఒకింత న‌న్ను ఉండ‌నీయ‌లేదు. ఎందుకు చ‌ద‌వాలి అని ఓ ప్ర‌శ్న వేశా. నువ్వు ఇలా అంటావ‌నే ఇది నీకు నా వైపు నుంచి ..తీసుకో అన్నాడు. గురువు గ‌డియారం గారు ఎప్పుడూ అంటూ వుండే వారు..ఏదీ ఉచితంగా తీసుకోకు అని..అలా అలవాటైతే వ్య‌క్తిత్వం కోల్పోవ‌డమేన‌ని చెప్పాక‌..ధ‌ర చిన్న‌దే అయినా కొంత స‌మ‌ర్పించుకున్నా. స‌హ‌చ‌రుడు వ‌ద్ద‌న్నా చేతిలో పెట్టా. సామాన్యంగా త‌ను చ‌దివి..ఆలోచించి..త‌న‌ను తాను త‌ర్కించుకొని పుస్త‌కాన్ని వ‌ద‌ల‌ని మ‌న‌స్త‌త్వం క‌లిగి ఉండ‌డంతో నేను కాద‌న‌లేక పోయా.
రెండున్న‌ర గంట‌ల ప్ర‌యాణం. హోరు గాలి..ఊపిరి తీసుకోనీయ‌కుండా వ‌ర్షపు జ‌ల్లులు ..కిటికీ ప‌క్క‌నే కూర్చోవ‌డం. ప్ర‌కృతిని చూడటం అల‌వాటు. చేతిలో సురేష్ పుస్త‌కం క‌ద‌లాడుతోంది. కాగితాలు రివ్వుమంటూ రెప రెప లాడుతున్నాయి. మాన‌వ సంబంధాల‌న్నీ ఆర్థిక సంబంధాలేన‌న్న కార్ల్ మార్క్స్ వాస్త‌వాన్ని జీర్ణించుకుంటూనే ప‌ద్మ‌నాభ‌న్ గురించి శోధించా. ఈ దేశం ప‌ట్ల అత‌డికి అపార‌మైన ఆస‌క్తి..అనుర‌క్తి..ప్రేమ‌..అభిమానాలున్నాయ‌ని అర్థ‌మై పోయింది. ఎందుకో చూద్దామ‌నుకుంటూనే బ‌త‌క‌డానికి డ‌బ్బులు ఎందుక‌ని అనుకునే నేను ..సురేష్ ..చిన్న‌నాటి అమ్మ‌మ్మ‌, నాయన‌మ్మ‌, తాత‌య్య‌ల క‌థ‌లు చెప్పిన‌ట్టు స్టోరీస్‌ను ఉద‌హ‌రిస్తూ మ‌నీ గురించిన విలువేమిటో మ‌ట్టి బుర్ర‌కు త‌ట్టింది. అలా అనుకోకుండా ప‌ద్మ‌నాభ‌న్ నాకు ఇష్టుడై పోయాడు. నా పుస్త‌కాల వ‌రుస‌లో చేరిపోయాడు. ఇపుడు సామాజిక మాధ్య‌మాల్లో ఆయ‌న చెప్పే ప్ర‌తి అంశాన్ని నేను ఫాలో అయ్యేలా మారి పోయా. డ‌బ్బు ప‌ట్ల మ‌న‌కంటూ కొన్ని అభిప్రాయాలు సాంప్ర‌దాయ‌బ‌ద్దంగా ఉంటాయి. వాటిని కాద‌న‌లేం. ఎందుకంటే అవి కొన్నేళ్లు..కొన్ని త‌రాలుగా మ‌నతో పాటే అంటి పెట్టుకుని ఉన్నాయి. వీటిని ఆచ‌రిస్తూ పోయాం..మ‌ళ్లీ వెన‌క్కు తిరిగి చూడ‌లేక పోయాం. అక్క‌డే మ‌నీ ఏ ర‌కంగా మ‌న‌ల్ని జీవించేలా చేస్తుందో..లైఫ్‌కు ఎలా గుర్తింపు తీసుకు వ‌స్తుందో గుర్తించ లేక పోయాం.
దీంతో క‌ష్టాలు..ఆపై చీవాట్లు.ఎందుకూ ప‌నికిరాని వారంటూ కామెంట్లు భ‌రిస్తూ కాలం వెళ్ల‌దీస్తూ ..ఇలా పుస్త‌కాల‌తో కుస్తీ ప‌ట్ట‌డం.. వెచ్చ‌ని టీ తాగుతూ ..క‌బుర్ల‌లో మునిగి పోవ‌డం. మారుతున్న కాలంలో మ‌నీ లేకుండా బ‌త‌క‌లేం అనేకంటే ఉండ‌లేం. ఇపుడు ఆక్సిజ‌న్ కంటే ఎక్కువ‌గా అయిపోయింది.నీళ్లు..గాలి..ప్రాణం..వైద్యం..జ‌ర్నీ..ఐడెంటిటీ..హోదా..రాజ‌సం..అధికారం..ప్రేమ‌..ల‌వ్‌..సెక్స్‌..భ‌క్తి..ముక్తి ..స్టైల్‌..లుక్స్‌..అంతా క‌రెన్సీతోనే ముడిప‌డి పోయాక..ఇక ఏం అన‌గ‌లం..వీట‌న్నిటిని ప‌ద్మ‌నాభ‌న్ ద‌గ్గ‌రుండి ప‌రిశీలించారు.
దేశ , విదేశాల్లో మ‌నీ విలువ గురించి మ‌నం ఎలా
ఉండాలో ..ఏం చేయ‌కూడ‌దో.. సోదాహ‌ర‌ణంగా వివ‌రిస్తున్నారు. మ‌న‌ల్ని మ‌రింత స‌మ‌ర్థులుగా..శ‌క్తివంత‌మైన వ్య‌క్తులుగా..కుటుంబ విలువ‌ల‌ను కాపాడే వారిగా మ‌లుస్తున్నారు. విస్తృత పాఠాలు..దైనందిన జీవితంలో ఎదుర‌య్యే ఆర్థిక స‌వాళ్ల‌ను ఎలా అధిగ‌మించాలో నేర్పిస్తున్నారు. ఈ మ‌ధ్యే ఆయ‌న రాసిన అనుభ‌వ జ్ఞానం పుస్త‌కాలు ల‌క్ష‌ల్లో అమ్ముడు పోయాయి. రికార్డును తిరగ‌రాశాయి. స్మార్ట్ వేగవంత‌మైన కాలంలో సైతం పుస్త‌కాలు కొనుగోలు చేస్తున్నారంటే ..దాన‌ర్థం ర‌చయిత ఆచ‌రణాత్మ‌క‌ను క‌లిగి ఉండ‌డ‌మే.
ర‌చయిత‌గా, క‌విగా, వ‌క్త‌గా, జీవిత శిక్ష‌కుడిగా, అనుభ‌వం క‌లిగిన స‌ల‌హాదారుగా ఎన్నో ర‌కాలుగా సురేష్ ప‌ద్మ‌నాభ‌న్ సేవ‌లందిస్తున్నారు.
క‌ర్ణాట‌క‌కు చెందిన ఆయ‌న దేశ వ్యాప్తంగా మ‌నీపై వ‌ర్కుషాపులు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంద‌రికో నూత‌న ప‌ద్ధ‌తుల్లో శిక్ష‌ణ ఇస్తూ మ‌నీ అవ‌స‌రాన్ని నేర్పిస్తున్నారు.
ఒక్క రూపాయిని ఖ‌ర్చు చేయ‌డం అంటే మ‌రో రూపాయిని కోల్పోవ‌డం అన్న‌మాట‌. అందుకే వేలు, వంద‌లు, కోట్ల రూపాయ‌ల గురించి ఆలోచించ‌కండి..ఎవ‌రైనా స‌రే రోజుకో రూపాయిని పొదుపు చేయ‌డం అల‌వాటు చేసుకోండి. నిజ‌మైన ధ‌న‌వంతులు ఎవ‌రంటే ..నోట్లు..కోట్లు ఉన్న వాళ్లు కాదు..జ‌స్ట్‌..అప్పులు లేకుండా ఉండ‌టం. కాదంటారా..అయితే సురేష్ ప‌ద్మ‌నాభ‌న్‌ను అనుస‌రించండి ..అమూలాగ్రం అత‌డి పుస్త‌కాల‌ను చ‌ద‌వండి..మీలో కొత్త ఉత్సాహం ఉర‌క‌లేస్తుంది. మ‌నీ ప‌ట్ల దుర‌భిప్రాయం తొల‌గి పోతుంది. అవును..క‌దూ..గాలి లేకుండా కొంత సేపు ఉండ‌గ‌ల‌మేమో కానీ..మ‌నీ లేకుండా ఉండ‌గ‌ల‌మా..!

కామెంట్‌లు