బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ - ఏటీఎంలలో డబ్బులుండక పోతే ఫైన్ - ఖాతాదారులకు ఊరట .!

కేంద్ర ప్రభుత్వంలో కొలువు తీరిన కమల దళపతి నరేంద్ర దామోదరదాస్ మోదీజీ అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని తప్పించారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు. ఆర్బీఐకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది సర్కార్. ఎట్టి పరిస్థితుల్లోను ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించంది. దీంతో భారత ప్రభుత్వానికి, దేశానికి, జాతి మొత్తానికి కస్టోడియన్‌గా ఉన్న ఆర్బీఐ అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. దీంతో బ్యాంకుల ఎడా పెడా చార్జీల మోత నుంచి కొంత ఉపశమనం లభించినట్లయింది. ఉన్నట్టుండి అర్ధరాత్రి నోట్ల రద్దు ప్రకటన చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా ఖాతాదారులు, ప్రజలు, రైతులు, వ్యాపారులు, దినసరి కూలీలు, ఉద్యోగస్తులు, చిరు వ్యాపారులు, కిరాణాకొ్ట్టుదారులు, స్టూడెంట్స్, ఇలా ప్రతి ఒక్కరు డబ్బులు దొరకక నానా ఇబ్బందులు పడ్డారు. రోజుల తరబడి ఏటీఎంల దగ్గర, బ్యాంకుల వద్ద నిరీక్షించారు. వారిపై పోలీసుల ...