పోస్ట్‌లు

నవంబర్ 18, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆట అద్భుతం..విజయం సంచలనం

చిత్రం
గ్రీస్‌ యువ సంచలనం స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ ప్రతిష్టాత్మక విజయంతో తన సత్తా చాటాడు. వరల్డ్‌ టాప్‌ ఆటగాళ్లు పాల్గొన్న ఏటీపీ ఫైనల్స్‌లో సిట్సిపాస్‌ విజేతగా నిలిచాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు ఇంకా ఒక్క గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీ కూడా నెగ్గక పోయినా, దిగ్గజ ఆటగాళ్లను దాటి జెండా ఎగుర వేశాడు. ఆరో సీడ్‌ సిట్సి పాస్‌ 2 గంటల 35 నిమిషాల్లో 6–7, 6–2, 7–6 స్కోరుతో ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ను ఓడించాడు. 21 ఏళ్ల 3 నెలల వయసులో ఏటీపీ ఫైనల్స్‌ టైటిల్‌ సాధించిన సిట్సిపాస్‌, 2001 తర్వాత అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.  ఫైనల్స్‌ చేరిన తొలి సీజన్‌లోనే సిట్సిపాస్‌ విజేతగా నిలవడం మరో చెప్పుకోదగ్గ విశేషం. ఫైనల్‌ పోరులో తొలి సెట్‌ సుదీర్ఘ ర్యాలీలతో సాగింది. ఇద్దరి మధ్య సాగిన హోరాహోరీ పోరుతో సెట్‌ టై బ్రేక్‌కు చేరింది.  అద్భుతమైన ఫోర్‌హ్యాండ్‌లతో దాడి చేసిన థీమ్‌ దూసుకు పోయాడు. 5–6 వద్ద సిట్సిపాస్‌ ఒక సెట్‌ పాయింట్‌ను కాపాడు కోగలిగినా, ఆ తర్వాత థీమ్‌ పదునైన సర్వీస్‌ను రిటర్న్‌ చేయలేక సెట్‌ కోల్పోయాడు. అయితే సిట్సిపాస్‌ రెండో సెట్‌లో పట్టుదలగా నిలబడ్డాడు. తొలి గేమ్‌ను గెలుచుకున్...

షో ముగిసినా తగ్గని క్రేజ్

చిత్రం
తెలుగు బుల్లి తెరమీద రికార్డు క్రియేట్ చేసిన స్టార్ మాటీవీలో టెలికాస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ ముగిసినా ఇంకా దాని క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి లెక్కలేనన్ని అవకాశాలు తలుపు తడుతున్నాయి. వీరిలో అందరికంటే ఎక్కువగా రాహుల్, పునర్నవిల గురించే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇక రాహుల్ చేజారిన రాములో రాములా పాటను మరోసారి అతనితో పాడించాలని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాహుల్‌.. ఆర్‌ఎక్స్‌100 ఫేమ్‌ హీరో కార్తీకేయ నటిస్తున్న 90 ఎమ్‌ఎల్‌ చిత్రంలో సింగిల్‌ సింగిల్‌ అనే పాటను పాడారు. దీనికి యూట్యూబ్‌లో మంచి ఆదరణే లభిస్తోంది. బిగ్‌బాస్‌ విజేత రాహుల్‌ వరుస ఇంటర్య్వూలు, పాటలతో బిజీ అయి పోయాడు. మరోవైపు బిగ్‌బాస్‌ పార్టిసిపెంట్లు రీయూనియన్‌ పేరుతో  గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. హిమజ, మహేశ్‌, పునర్నవి, వరుణ్‌, వితిక, అలీ, అతని భార్య మసుమా హాజరయ్యారు. వరుణ్‌, వితికలు వరుస ఫొటో షూట్‌లతో ఏదో విధంగా అలరిస్తూనే ఉన్నారు.  పునర్నవి తన తదుపరి కెరీర్ ను సినిమాలపై దృష్టి సారించింది. మరోవైపు రాహుల్‌.. తనను గెలిపించిన అభిమానుల కోసం నగరంలో లైవ్‌ కన్స...

ఆశలు సజీవం..దక్కేనా విజయం

చిత్రం
భారత ఫుట్‌బాల్‌ జట్టు ప్రస్తుతం అగ్ని పరీక్షను ఎదుర్కుంటోంది. ఒమన్‌తో తాడో పేడో తేల్చు కోవడానికి మన జట్టు సిద్ధమైంది. 2022 ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌కు అర్హత రేసులో నిలవాలంటే ఇండియాకు ఈ విజయం తప్పనిసరి. ఒకవేళ ఓడిందంటే మాత్రం ఇక దారులు మూసుకు పోయినట్లే. క్వాలిఫయర్స్‌లో భాగంగా గ్రూప్‌ ‘ఇ’లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఇప్పటికే భారత్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఒక దాంట్లో ఓడి పోగా, మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. భారత్‌ 3 పాయింట్లతో గ్రూప్‌లో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు ఒమన్‌ మాత్రం నాలుగింటిలో మూడు గెలిచి 9 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంది. క్వాలిఫయర్స్‌ తొలి అంచె పోటీల్లో ఇరు జట్లు గౌహతి వేదికగా తలపడగా భారత్‌ 1–2తో ఓటమి చవి చూసింది. ఆ మ్యాచ్‌లో 80 నిమిషాల పాటు ఆధిక్యం కనబరిచిన భారత్‌, చివరి 10 నిమిషాల్లో చేతులెత్తేసి రెండు గోల్స్‌ ప్రత్యర్థికి సమర్పించుకొని ఓడిపోయింది. ఆసియా చాంపియన్‌ ఖతర్‌తో జరిగిన మ్యాచ్‌లో అంచనాలకు మించి మన జట్టు రాణించింది. ఈ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. గెలుపు ఖాయం అనుకున్న బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌లను ‘డ్రా’తో సరి పెట్టుకున్న భారత్‌ ప్రస్తుత...

మంద గమనంలో మార్కెట్

చిత్రం
కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నా ఇండియన్ మార్కెట్ మాత్రం అంతకంతకూ దిగజారుతోంది. దీని ప్రభావం అన్ని వ్యాపార రంగాలపై పడుతోంది. ఆర్థిక మందగమన భయాలతో భారతీయ స్టాక్‌ మార్కెట్‌ తీవ్రంగా నష్ట పోయింది. దీంతో రెండు ట్రేడింగ్‌ సెషన్ల లాభాలకు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, భారత వృద్ధి మంద గించగలదన్న వివిధ సంస్థల నివేదికలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పూర్తిగా దెబ్బ తీశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా తగ్గడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 72 పాయింట్లు పతనమై 40,284 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 11,885 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రైవేట్‌ బ్యాంక్, ఐటీ, ఇంధన, ఎఫ్‌ఎమ్‌సీజీ, వాహన షేర్లు మరింతగా క్షీణించాయి. సెన్సెక్స్‌ లాభాల్లో ఆరంభమైనా, అర గంటకే నష్టాల్లోకి జారి పోయింది. కొంత సమయం పాటు లాభ, నష్టాల మధ్య కొనసాగినా, ఆ తర్వాత పూర్తిగా నష్టాల్లోనే ట్రేడైంది. ఒక దశలో 185 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ మరో దశలో 135 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 320 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. కంపెనీల క్య...

కంపెనీల మోత..కస్టమర్లకు దెబ్బ

చిత్రం
నిన్నటి దాకా కస్టమర్లకు బంపర్ ఆఫర్స్ పేరుతో బురిడీ కొట్టించిన తెల్కం కంపెనీలు ఇప్పుడు బిల్లుల మోత ముగించేందుకు రెడీ అవుతున్నాయి. అపరిమిత డేటా వినియోగం పెరిగినా, మార్కెట్లో పోటీ తీవ్రతరం కావడం కూడా ఇందుకు ప్రధాన కారణమవుతోంది. భారీ నష్టాలు, పేరుకు పోయిన రుణాలు, సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కేంద్రానికి వేల కోట్లు చెల్లించాల్సి రావటంతో కంపెనీలకు పాలుపోవడం లేదు. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే వినియోగదారులపై భారం మోపాల్సిందేనని టెలికం కంపెనీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా కాల్‌ చార్జీలను పెంచ బోతున్నాయి. వచ్చే నెల నుంచి కాల్‌ చార్జీలను పెంచనున్నట్లు వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించాయి. అచార్జీల పెంపు ఎంత మేర ఉంటుందనేది మాత్రం నిర్దిష్టంగా వెల్లడించ లేదు. కస్టమర్లకు అంతర్జాతీయ స్థాయి డిజిటల్‌ సేవలు అందించడాన్ని కొనసాగించే క్రమంలో టారిఫ్‌లు పెంచబోతున్నాం అని వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. కొద్ది సేపటికే భారతీ ఎయిర్‌టెల్‌ కూడా తమ రేట్ల పెంపు ప్రతిపాదనలు వెల్లడించింది. అతి వేగంగా మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టు టెలికం రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. డిజ...

ఏపీలో మార్కెట్లకు మహర్దశ

చిత్రం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి ఏపీలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పలు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఏపీలోని అన్ని మార్కెట్‌ యార్డులను నాడు, నేడు పథకం కింద ఆధునికీక రించడంతో పాటు మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను పటిష్ట పరచాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. పంటల ధరలు ఎక్కడ పడి పోతుంటే అక్కడ వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ కూడా గిట్టు బాటు ధర కంటే తక్కువకు అమ్మేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఐదో అగ్రి మిషన్‌ సమావేశంలో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్‌ యార్డ్‌ విధిగా ఉండాలన్నారు. అవసరమైతే అధ్యయనం చేసి మరికొన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని రైతు బజార్లలో రైతులు కాని వారు అమ్మకాలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, నిబంధనలు తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 56 రైతు బజార్లను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు...

చరిత్ర సృష్టించిన పెద్దల సభ

చిత్రం
భారత సమాఖ్య వ్యవస్థకు పెద్దల సభ ఆత్మవంటిది. అదే ఎప్పటికీ శాశ్వతం. వాజ్‌పేయి సెంటిమెంట్‌తో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. పెద్దల సభ రెండో సభ అయినప్పటికీ దానిని ఎప్పుడూ తక్కువ చేయ కూడదు. జాతి అభివృద్ధి కోసం  ఈ సభ పలికే మద్దతు అత్యంత కీలకమైనదిగా అభివర్ణించారు ప్రధానమంత్రి మోదీ. సభ చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపేందుకు, సభను స్తంభింప జేసేందుకు మధ్య సమతుల్యత పాటించాలని పార్టీలకు సూచించారు. 250వ సమావేశాలను పురస్కరించుకొని ప్రధాని సభలో మాట్లాడారు. రాజ్యసభలో అధికార ఎన్డీయేకి మెజార్టీ లేక పోవడంతో ఎన్నో కీలక బిల్లులు చట్ట రూపం దాల్చడం లేదు. వీటిపైనే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి.  రాజ్యసభ సభ పేరుకే ద్వితీయ సభే కావొచ్చు. కానీ అదొక అద్వితీయ సభ అని వాజ్‌పేయి అన్న వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. ఆయన సెంటిమెంట్‌తో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. పెద్దల సభ రెండో సభ అయినప్పటికీ దానినెప్పుడూ తక్కువ చేయ కూడదు. జాతి అభివృద్ధికి ఈ సభ పలికే మద్దతు అత్యంత కీలకం గొప్పదని కొనియాడారు. ఆర్టికల్‌ 370, 35(ఏ) వంటి బిల్లుల్ని ఆమోదించడంలో రాజ్యసభ కీలక పాత్ర పోషించింది. ఆ పాత్రను ఎవరూ మర్చి పోలేరని అన్నారు. జాతి ప్...

బాబుకు ఏసీబీ ఝలక్

చిత్రం
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హైదరాబాద్‌ లోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం ఝలక్ ఇచ్చింది. 14 ఏళ్ల క్రితం ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసులో చంద్రబాబు స్టే గడువు ముగియడం, హైకోర్టు నుంచి ఎలాంటి పొడిగింపు లేక పోవడంతో కేసులో తదుపరి ప్రక్రియను ప్రారంభిస్తామని ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదుదారుగా ఉన్న లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని, తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించ కూడదని సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చింది. దీంతో చంద్రబాబు స్టే గడువు ముగిసిన విషయాన్ని, ఆ స్టేకు ఎలాంటి పొడిగింపు లేక పోవడాన్ని జడ్జి తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు. విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ, తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు 2005లో హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు కొనసాగుతాయని వాదిం...

సమ్మెపై తేల్చేసిన ధర్మాసనం

చిత్రం
ఉత్కంఠకు తెరపడింది. హైకోర్టు ఇక లేబర్ కోర్టుదే పూర్తి బాధ్యతగా అభివర్ణిస్తూ కీలక తీర్పు వెలువరించింది. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 45 రోజులకు చేరుకుంది. ఆత్మహత్యలు, అరెస్టులు, దాడులు, కేసులు, ఆరోపణలు చోటు చేసుకున్నాయి. గృహ న్రిబంధాలు సైతం జరిగాయి. ఈ సందర్బంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మరో వైపు ప్రభుత్వాన్ని హెచ్చరించింది కూడా. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని తేల్చే అధికారం కన్సిలియేషన్‌ అధికారి అయిన కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌కు లేదని స్పష్టం చేసింది. కార్మిక శాఖ కమిషనర్‌ తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకం. ఈ విషయాన్ని తేల్చే అధికారం పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్‌ 12 ప్రకారం లేబర్‌ కోర్టుకు మాత్రమే ఉంది. మేం జారీ చేస్తున్న ఈ ఉత్తర్వుల ప్రతి అందిన రెండు వారాల్లోగా సమ్మె వ్యవహారంపై కార్మిక శాఖ కమిషనర్‌ తగిన నిర్ణయం తీసుకుని లేబర్‌ కోర్టుకు నివేదించాలి. ఒకవేళ ఏ నిర్ణయాన్ని తీసుకోనట్లయితే అందుకు కారణాలను వివరిస్తూ ఆర్టీసీ సమ్మె కేసులోని వాదప్ర తివాదులందరికీ కూడా తెలియ జేయాలి. సమ్మెలోకి వెళ్లడమంటే ఉద్యోగం వదిలి వెళ్లి పోవడమని భావించడం...