మోస్ట్ ఫేవరబుల్ బ్రాండ్..టాటా..!

కోట్లాది రూపాయల పెట్టుబడులతో ప్రారంభించే కంపెనీలకు రేటింగ్ అత్యంత ముఖ్యమైనది. వాటి పనితీరు, మార్కెట్‌లో దాని స్థితిగతులు, వార్షిక సంవత్సరంలో దాని పనితీరు మెరుగు పడిందా లేదా..ఆదాయంలో ఏ పొజిషన్‌లో ఉన్నది..భవిష్యత్‌లో ఎలా వుండబోతోందన్న దానిపై ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా నమ్మకమైన సంస్థలు టాప్‌లో ఉన్న కంపెనీలను ఎంపిక చేస్తాయి. మన ఇండియా వరకు వస్తే రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టాటా కంపెనీ అత్యంత నమ్మకమైన బ్రాండ్‌గా నిలిచింది. తన స్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది. అటు సర్వీసులోను..ఇటు వినియోగదారుల నమ్మకాన్ని చూరగొంటూ తన వ్యాపారాన్ని అంతకంతకూ విస్తరించుకుంటూ పోతోంది టాటా. ప్రధాన రంగాలలో తనదైన ముద్రను కనబరుస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోంది టాటా గ్రూపు. ఆటోమొబైల్ రంగంతో పాటు ఐటీ సెక్టార్‌లో టాటా కంపెనీలు దుమ్ము రేపుతున్నాయి. ఐటీ పరంగా టాప్ రేంజ్‌లో వుంది. టీసీఎస్ భారీ లాభాలను మూటగట్టుకుంటోంది.2019లో భారత్ లో మోస్ట్ ఫేవరబుల్ బ్రాండ్‌గా టాటా కంపెనీ నిలిచింది. యునైటెడ...