అమెజాన్‌లో ఆగ‌ని స‌మ్మె - అంత‌టా ఆందోళ‌న బాట

ప్ర‌పంచంలోనే ఈ కామ‌ర్స్ రంగంలో టాప్ రేంజ్‌లో కొన‌సాగుతున్న అమెరికాకు చెందిన దిగ్గ‌జ కంపెనీ అమెజాన్ లో ఉద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఆయా దేశాల‌లో ఏర్పాటైన కంపెనీల ఎదుట వారు స‌మ్మెకు దిగారు. ఓ వైపు బంప‌ర్ ఆఫ‌ర్స్, భారీ డిస్కౌంట్ల‌తో డాల‌ర్ల‌ను కొల్లగొడుతూ లెక్క‌లేనంత ఆదాయాన్ని పొందుతున్నా త‌మ‌కు మాత్రం వేత‌నాలు పెంచ‌డంలో శ్ర‌ద్ద చూపించ‌డం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ‌మే త‌మ‌కు జీతాలు పెంచాల‌ని లేక‌పోతే జీవ‌నం కష్ట‌మ‌వుతుంద‌ని వాపోయారు. కంపెనీ మాత్రం ఇదంతా అవాస్త‌వ‌మంటూ కొట్టి పారేసింది. ఉద్యోగులు మాత్రం ఆయా దేశాల‌లో రోడ్ల‌పైకి వ‌చ్చారు. ప్ర‌పంచ మంత‌టా అన్ని దేశాల్లో స‌మాచారంతో పాటు వీడియోలు వైర‌ల్ అయ్యాయి. అయినా అమెజాన్ డోంట్ కేర్ అంటోంది. త‌మ‌కు వ‌చ్చిన ముప్పేమి లేదంటూ కొట్టి పారేసింది.

స‌మ్మెలు చేసినా, ఆందోళ‌న‌లు చేప‌ట్టినా..పోరాటానికి దిగినా జీతాలు మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో పెంచ‌మంటూ స్ప‌ష్టం చేసింది. స‌మ‌స్య మాత్రం ముదిరి పాకాన ప‌డింది. త‌మ ప‌ని టైమింగ్స్ ను మెరుగు ప‌ర్చాల‌ని, జీతాలు స‌రిపోయినంతగా పెంచాల‌ని కోరారు. అమెరికాలోని ప్ర‌ధాన కార్యాల‌యంతో పాటు ఇంగ్లండ్, జ‌ర్మ‌నీ , త‌దిత‌ర దేశాల‌లో ఉద్యోగులు, సిబ్బంది ఆందోళ‌న బాట ప‌ట్టారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌త్యేక డిస్కౌంట్ల‌తో అమెజాన్ 15 నుండి ఆఫ‌ర్స్ ఇస్తోంది. దీనికి భారీ ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంది. ఈ స‌మ‌యంలో ఉద్యోగులు స‌మ్మె బాట ప‌ట్ట‌డం ఒకింత మార్కెట్‌ను కుదుపుల‌కు లోను చేసింది. ఈ కామ‌ర్స్ రంగంలో ఇప్ప‌టికే టాప్ వ‌న్ రేంజ్‌లో ఉంటోంది. ఉద్యోగులు 70 శాతానికి పైగా విధులు బ‌హిష్క‌రించారు. అమెరికాలోని ఫుల్‌ఫిల్‌మెంట్ సెంట‌ర్‌లో ఎంప్లాయిస్ విధులు బ‌హిష్క‌రించారు. ఆరు గంట‌ల పాటు రోడ్ల‌పైనే ఉన్నారు. ఉద‌యం, సాయంత్రం షిప్టుల్లో ప‌నులు పూర్తిగా నిలిచి పోయాయి. ప‌ని గంట‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని, వాటిని త‌క్ష‌ణ‌మే త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు ఉద్యోగులు. మిగ‌తా ఈ కామ‌ర్స్ కంపెనీల కంటే అమెజాన్‌కు భారీ ఆదాయం స‌మ‌కూరినా త‌మ‌ను ప‌ట్టించు కోవ‌డం లేదని ఆరోపించారు.

జీతాలు పెంచాలంటూ గ‌తంలో ప‌లుమార్లు విన్న‌వించినా స్పందించ లేద‌న్నారు. ఫిర్యాదులు అస‌లు ప‌ట్టించు కోవ‌డం లేద‌ని, కంపెనీ ప‌ని భారాన్ని మ‌రింత పెంచిందంటూ విమ‌ర్శించారు. అమెజాన్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని శాఖ‌ల్లో 6 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. 24 గంట‌ల లోపే ప్రొడ‌క్ట్స్‌ను డెలివ‌రీ చేస్తామంటూ ..కంపెనీ హామీ ఇస్తోంద‌ని..దీంతో త‌మ‌పై తీవ్ర ఒత్తిడి ఎక్కువై పోయింద‌ని ఉద్యోగులు ల‌బోదిబోమంటున్నారు. అయితే, అమెజాన్ డోంట్ కేర్ అంటోంది. ఈ స‌మ్మె వ‌ల్ల త‌మ రోజూ వారీ కార్య‌క‌లాపాల‌కు ఎటువంటి ఇబ్బంది క‌ల‌గ‌డం లేదంటూ పేర్కొంది. ఉద్యోగులు, సంఘాలు అడిగిన‌వ‌న్నీ ఇప్ప‌టికే ఇచ్చేశామ‌ని తెలిపింది. ఇదిలా ఉండ‌గా త‌మ జీతాల్లో కోత పెడుతూ ..క‌స్ట‌మ‌ర్ల‌కు డిస్కౌంట్లు ఇస్తున్నారంటూ బాధితులు వారంటున్నారు. 

కామెంట్‌లు