ఒప్పో వైస్ ప్రెసిడెంట్‌గా సుమీత్ వాలియా..!
భారతీయులు దుమ్ము రేపుతున్నారు. తమ ప్రతిభా పాటవాలతో దిగ్గజ కంపెనీలను మెస్మరైజ్ చేస్తున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, షియోమీ, అడోబ్, అమెజాన్ ఇలా ప్రతి మేజర్ కంపెనీలన్నీ ఇండియా జపం చేస్తున్నాయి. ఏకంగా టాప్ రేంజ్‌లో ఉన్న వారికి అద్భుతమైన అవకాశాలు అందజేస్తున్నాయి. తాజాగా ఇండియన్ మార్కెట్ వర్గాలను ఆశ్చర్య పోయేలా చేశాయి రెండు దిగ్గజ కంపెనీలు. ఈ రెండింటిలో ఒకటి చైనాకు చెందిన ఒప్పో మొబైల్ తయారీ కంపెనీ అయితే..మరొకటి జర్మనీకి చెందిన బిగ్గెస్ట్ మోటార్స్ కంపెనీ బిఎండబ్ల్యుకు చెందింది. ఒకరేమో పల్లవీ సింగ్ అయితే ..ఇంకొకరు సుమీత్ వాలియా. ఇప్పటికే రెండూ కంపెనీలకు ప్రపంచ వ్యాప్తంగా బ్రాండ్ కలిగి ఉన్నాయి. ఇండియన్ మార్కెట్‌లో వీటికున్నంత డిమాండ్ ఇంకేదానికి లేదంటే ఆశర్య పడాల్సిన పనిలేదు.
ఒప్పో కంపెనీ కార్యకలాపాలు చూసుకునేందుకు, వ్యాపార పరంగా మిగతా కంపెనీలకు షాక్ ఇస్తూ..తన మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఇండియాకు చెందిన సుమీత్ వాలియాకు అరుదైన అవకాశం కల్పించింది. ప్రొడక్ట్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా సుమీత్‌ను నియమిస్తున్నట్లు ఒప్పో మొబైల్స్ కంపెనీ ప్రకటించింది. తమ బ్రాండ్ ను మరింత విస్తృతం చేయడంతో పాటు తమ కంపెనీకి భవిష్యత్ పట్ల మరింత నమ్మకాన్ని పెంచేలా చేసేందుకు, కస్టమర్లతో తమ బ్రాండ్ ఉత్పత్తులు కొనుగోలు చేసేలా కృషి చేసేందుకు సమర్థవంతమైన వ్యక్తిని నియమించామని స్పష్టం చేసింది. ప్రొడక్ట్ అండ్ మార్కెటింగ్ విభాగాలను చూసుకుంటారని తెలిపింది.
వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉండేలా తమ కంపెనీని తీర్చిదిద్దే బాధ్యత సుమీత్ వాలియాకు అప్పగించడం జరిగిందన్నారు. ఇండియన్ మార్కెటింగ్‌తో పాటు టెక్నాలజీ విభాగాన్ని కూడా చూసుకుంటారని తెలిపింది. యాపిల్, శాంసంగ్ , వివోలతో పాటు ఒప్పో కూడా తన మార్కెట్ వాటాను రోజు రోజుకు పెంచుకుంటోంది. ఇండియన్స్ ఎక్కువగా యూత్ ఒప్పో ఉత్పత్తుల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. వీరి వాటా ఎక్కువగా ఉంటోంది. ఒప్పో కంపెనీని ఇండియాలో విస్తరించి దాదాపు ఆరు సంవత్సరాలు కావస్తోంది. కొత్త రోల్‌ను ఇక నేటి నుంచి సుమీత్ పోషిస్తున్నందుకు ఆనందంగా ఉందంటూ ఒప్పో ఒప్పో ఇండియా సిఇఓ, సౌత్ ఏషియా ప్రెసిడెంట్ అయిన చార్లెస్ వోంగ్ తెలిపారు. మొత్తం మీద సుమీత్ సమర్థతకు ఇది పరీక్షా కాలం అన్నమాట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి