బిఎండబ్ల్యు మోటార్స్ కంపెనీ డైరెక్టర్‌గా పల్లవి సింగ్
ప్రతి ఒక్కరి కల ఒక్కటే..వాహనాలను ప్రేమించే వారికి ..అదేమిటంటే బిఎండబ్ల్యు మోటార్స్ కంపెనీనే ప్రిఫర్ చేస్తారు. ఎక్కువగా రిచ్ పీపుల్స్, బిజినెస్ పర్సనాలిటీస్, సెలబ్రెటీస్, కంపెనీల సీఇఓలు, మేనేజింగ్ డైరెక్టర్లు, ప్లేయర్స్, సినీ నటులు, ఇలా ప్రతి రంగానికి చెందిన వారంతా మొదటగా ప్రయారిటీ ఇచ్చేది ఈ కంపెనీ ద్వారా తయారయ్యే వెహికిల్స్‌ను కోరుకుంటారు. అందులో ప్రయాణించడం అన్నది ఓ కల కానే కాదు..అదో స్టేటస్ సింబల్. కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు..కొనుగోలు చేసేందుకు..ట్రావెల్ చేసేందుకు ఉత్సాహ పడతారు. ప్రపంచంలోనే మోటార్స్ రంగంలో బిఎండబ్ల్యు కంపెనీ కార్లు, ఇతర వెహికిల్స్‌కు ఎనలేని డిమాండ్ ఉంటోంది. ఈ కంపెనీకి చెందిన వెహికిల్స్ ను కేవలం సినిమాల్లో చూడటమే తప్పా ఎక్కడా చూడలేం.
ఇపుడు యూట్యూబ్ అందుబాటులోకి రావడంతో ప్రతి వాహనం గురించి తెలుసుకునే వీలు కలుగుతోంది. వాహనాల మార్కెట్‌లో నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న బిఎండబ్ల్యు కంపెనీకి ఏకంగా ఇండియాకు చెందిన మహిళ..పల్లవి సింగ్‌ను ఇండియాలోని బిఎండబ్ల్యు మార్కెటింగ్ విభాగానికి డైరెక్టర్‌గా నియమించింది సదరు కంపెనీ. విద్యా పరంగా ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న పల్లవి సింగ్..అంతకు ముందు 2017 ఆగస్టు నెలలో ఎంజీ మోటార్స్ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. జర్మనీకి చెందిన లక్సరీ కార్ల తయారీ కంపెనీ అయిన బిఎండబ్ల్యు మార్కెటింగ్ విభాగంలో చేరారు. హార్లీ డేవిడ్‌సన్, యమాహా కంపెనీల్లో పనిచేశారు. ఎంజీ మోటార్స్ ఎలక్ట్రికల్ కార్ల విభాగంలో 2000 వేల కోట్లు ఇన్వెస్ట్ చేసింది.
పల్లవి సింగ్ 2009 సంవత్సరం డిసెంబర్ నెలలో హార్లే డేవిడ్ సన్ కంపెనీలో జాయిన్ అయ్యారు. ఆ కంపెనీలోని వివిధ విభాగాలలో పనిచేశారు. ఆ కంపెనీలో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకున్నారు. అనతి కాలంలోనే మార్కెటింగ్ విభాగం మొత్తం ఆమె చేతుల్లోకి తీసుకున్నారు. అంతలా ఆమె కష్టపడ్డారు. టూ వీలర్ మేకర్ కంపెనీ అయిన యమాహాలో చేరారు. అక్కడ కూడా తనదైన శైలిలో పనిచేస్తూ ప్రశంసలు అందుకున్నారు. పనితీరులో సునిశితమైన పరిశీలన..నిబద్ధత, క్రమశిక్షణకు పెట్టింది పేరు ఆమె. ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చేశారు. ప్రతిష్టాత్మకమైన బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీలో మేనేజ్‌మెంట్ కోర్సు చదివారు. మార్కెటింగ్ రంగంలో ఎంతో అనుభవం సంపాదించిన పల్లవీ సింగ్‌కు అరుదైన అవకాశం బిఎండబ్ల్యు కంపెనీ రూపంలో దొరికింది. హ్యాట్స్ ఆఫ్ యూ..పల్లవీ..కీప్ ఇట్ అప్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి