బాద్‌షాకు అరుదైన పురస్కారం
బాలీవుడ్‌లో బాద్‌షాగా పేరు సంపాదించుకున్న , విలక్షణ నటుడిగా వినుతికెక్కిన ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్‌కు అరుదైన పురస్కారం లభించింది. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు మహిళల సంక్షేమం, వారి హక్కుల కోసం ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు ఈ హీరో. సినిమా రంగంలో తనకంటూ ఓ బ్రాండ్ తో పాటు విశిష్టమైన ఇమేజ్‌ను స్వంతం చేసుకున్న ఘనత ఆయనకే చెల్లింది. మాటల్లో మేనరిజం..నడకలో ..నడతలో డిఫరెంట్‌గా ఉండే ఆయనంటే జనానికి అమితమైన ఆసక్తి..అంతకంటే అభిమానం కూడా. హీరోగా ఆయన నిలదొక్కుకునేందుకు ఎన్నో కష్టాలు అనుభవించారు. బాలీవుడ్‌లో ఖాన్‌ల త్రయందే హవా. ఎంతో మంది కొత్తగా హీరోలు తెరంగ్రేటం చేసినా..ఈ ముగ్గురిని ఢీకొనేందుకు..వారి స్పీడ్‌ను తగ్గించేందుకు ఏ ఒక్కరు చేరుకోలేక పోయారు. చాలా మంది హీరోలు ప్రయత్నం చేసినా..ఫలితం దక్కలేదు.
ఎందుకంటే ఈ ముగ్గురిలో ఎవరికి వారే హీరోలు. ఏ ఒక్కరిని గొప్ప వారుగా నిర్ణయించలేం. ఎందుకంటే ..ఎవరూ చెప్పలేరు. వీరంతా ఎవరి అండ లేకుండానే..ఇంకెవ్వరి తోడ్పాటు..సిఫారసులు తీసుకోకుండానే స్వంతంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్‌లో స్టార్స్‌గా ఎదిగారు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లు ఎప్పటి లాగానే ఉన్నారు. ఎవరికి వారే ..ఒక్కోరిది ఒక్కో స్టైల్. మాటల్లో డిఫరెంట్..చేతల్లో కూడా డిఫరంటే. నటనలో తమ ప్రతిభతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. ఈ ముగ్గురికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఎక్కువే. అమీర్ ఖాన్‌కు దిల్ సినిమాతో స్టార్ డమ్ లభిస్తే..షారూఖ్ కెరీర్ 1992లో ప్రారంభమైంది. దీవానా సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. బాజీఘర్ మూవీ బంపర్ సక్సెస్. ఢర్ బాక్సాఫీస్ బద్దలు కొట్టింది.
కభీ హా కభీ నా సక్సెస్ కాగా కరణ్ అర్జుణ్ సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా బ్లాక్ బ్లస్టర్‌గా రికార్డ్ బ్రేక్ చేసింది. దిల్‌వాలే దుల్హేనియా లే జాయింగే మూవీ ఆల్ టైం రికార్డుగా నమోదైంది. రామ్ జానే యావరేజ్‌గా నడిచింది. పర్దేసి సినిమా హిట్. మాధూరీ దీక్షితో నటించిన దిల్ తో పాగల్ హై మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. కుచ్ కుచ్ హోథా హై సినిమా బంపర్ హిట్‌గా రికార్డు సృష్టించింది. మొహబ్బతే సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. కభీ ఖుషీ కభీ ఘమ్ సినిమా బ్లాక్ బ్లష్టర్ గా పేరు తెచ్చుకుంది. ఇలా చెప్పుకుంటే ఎన్నో సినిమాలు ఆయన ఖాతాలో చేరాయి. అటు సినిమా రంగంలో రాణిస్తున్న ఈ సూపర్ స్టార్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా లోని మెల్‌బోర్న్‌కు చెందిన లా బ్రోట్ యూనివర్శిటీ షారూక్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేయనున్నట్లు ప్రకటించింది. మహిళలు, పిల్లల కోసం మీర్ అనే సంస్థను స్థాపించి..మహిళా సాధికారిత కోసం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కృషిని అభినందిస్తూ డాక్టర్ ఆఫ్ లెటర్స్‌ను ప్రధానం చేయునున్నట్లు యూనివర్శిటీ ప్రకటించింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి