పోస్ట్‌లు

నవంబర్ 10, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ముందుకు రాక పోతే మేము రెడీ

చిత్రం
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు వ్యూహంపై శివసేన గుంభనగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వాన్ని ఎవరూ ఏర్పాటు చేయలేక పోయిన పక్షంలో తమ వ్యూహం ఏమిటో అప్పుడు ప్రకటిస్తామని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి తీసుకున్న నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని చెప్పారు. గవర్నర్ చొరవతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనే ఆశా భావంతో ఉన్నామని అన్నారు. ఏకైక పెద్ద పార్టీని ఆహ్వానించడం సహజమే. కానీ, మెజారిటీ ఉందను కున్నప్పుడు ఫలితాలు వెలువడిన 24 గంటల్లోనే ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ఎందుకు, ముందుకు రాలేదో మాకు అర్ధం కావడం లేదు అని రౌత్ అన్నారు. శివసేన భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుతూ, గవర్నర్ వేసిన మొదటి అడుగుపై స్పష్టత వచ్చి, ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరూ, ముందుకు రాకుంటే అప్పుడు శివసేన తమ వ్యూహాన్ని ప్రకటిస్తుందని చెప్పారు. ఇరు పార్టీల మధ్య ఇప్పుడు మాటల యుద్ధం నడుస్తోంది. కాగా ఉద్దవ్ థాక్రే బీజేపీపై , దేవేంద్రపై ఫైర్ అయ్యారు. బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరిస్తే రెండవ పెద్ద కూటమిగా ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ను మహారాష్ట్...

షెఫాలీ పరుగులు..రికార్డు బద్దలు

చిత్రం
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌ శర్మ రికార్డును భారత మహిళా జట్టు ఓపెనర్ షెఫాలీ వర్మ బద్దలు గొట్టింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో భారత్ మహిళల జట్టు 84 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ చెలరేగి ఆడింది. 49 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 73 పరుగులు చేసింది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అర్ధ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కు రాలైన భారత క్రికెటర్‌గా షెఫాలీ రికార్డుల కెక్కింది. ఈ క్రమంలో రోహిత్‌శర్మ రికార్డు బద్దలైంది. రోహిత్ 20 సంవత్సరాల 143 రోజుల వయసులో అర్ధ సెంచరీ సాధించగా, షెఫాలీ 15 సంవత్సరాల 285 రోజుల్లోనే ఆ ఘనత సాధించింది. యూఏఈకి చెందిన ఎగో డాజ్ 15 ఏళ్ల 267 రోజుల్లోనే అర్ధ సెంచరీ సాధించి ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండగా, షెఫాలీ వర్మ రెండో స్థానంలో నిలిచింది. ఇక, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 185 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ 73, స్మతి మంధాన 67, కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్ 21 పరుగులు చేశారు. అనంతరం 186 పరుగుల విజయ లక్ష్యంతో...

దమనకాండ దారుణం..కామెంట్స్ బాధాకరం

చిత్రం
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ చేసిన కామెంట్స్ నిరాధారమైనవి. అత్యున్నతమైన పదవిలో ఉన్న ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు. వేలాది మంది కార్మికులు కడుపులు మాడ్చుకుని, స్వచ్చందంగా నిర్బంధాలను దాటుకుని తరలి వచ్చారు. ఇలాంటి మాటలు మాట్లాడటం సీపీకి తగదని హితవు పలికారు ఆర్టీసీ జెఎసి నేత అశ్వత్థామ రెడ్డి. నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. సంబంధాలు ఉన్నందునే చలో ట్యాంక్‌ బండ్‌కు అనుమతి ఇవ్వలేదని సీపీ అంజనీకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ మావోయిస్టలు ఉన్నా రంటూ అనవసర ఆరోపణలు చేసి సమ్మెపై ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారు. సీపీ వ్యాఖ్యలు మమ్మల్ని బాధించాయి. చలో ట్యాంక్‌ బండ్‌ కార్యక్రమంలో పాల్గొన్నదంతా కార్మికులే. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సహకరించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలకు కృతజ్ఞతలు. మహిళా కండక్టర్ల పాత్ర కీలకం. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు శిరసు వంచి వందనాలు చెబుతున్నాం. పోలీసుల దమనకాండను ఖండిస్తున్నాం. సమ్మె సక్సెస్ అయ్యే వరకూ మహిళా సిబ్బ...

మన ప్లేయర్స్ అదుర్స్

చిత్రం
వెస్టిండీస్‌ మహిళల జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు మహిళలు..అదే జోరును టీ20ల్లో కూడా కొనసాగిస్తున్నారు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 84 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత మహిళలకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు స్మృతీ మంధాన, షెఫాలీ వర్మలు తొలి వికెట్‌కు 143 పరుగులు సాధించారు. షెఫాలీ 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేయగా, స్మృతి మంధాన 46 బంతుల్లో 11 ఫోర్లతో 67  పరుగులు చేసి విండీస్ బౌలర్ల భరతం పట్టారు.  విండీస్‌తో జరిగిన చివరి వన్డేలో విశేషంగా రాణించి, సిరీస్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మంధాన, టీ20 మ్యాచ్‌లో కూడా బౌండరీల మోత మోగించారు. మరొక వైపు షెఫాలీ కూడా బ్యాట్‌కు పని చెప్పడంతో భారత స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఈ జోడికి జతగా చివర్లో హర్మన్‌ప్రీత్‌ 21 పరుగులతో వేదా కృష్ణమూర్తి15 పరుగులతో క్రీజులు నిలిచారు. మన ప్లేయర్స్ ధాటిగా ఆడటంతో భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కాగా, మంధాన, షెఫాలీలు 143 పరుగుల భాగ స్వామ్యం రిక...

మరాఠాలో వెనక్కి తగ్గిన బీజేపీ

చిత్రం
మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ పంపిన ఆహ్వానంపై బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. సరైన సంఖ్యా బలం లేనందున ప్రభుత్వ ఏర్పాటుపై వెనుకంజ వేసింది. ఈ మేరకు బీజేపీ శాసన సభా పక్ష నేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ గవర్నర్‌ను కలిసి ఈ విషయం తెలియ జేశారు. అయితే ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించిన విషయం తెలిసిందే.  అసెంబ్లీలో బల నిరూపణ చేయాలని గవర్నర్‌ గడవు విధించారు. దీనిపై ఫడ్నవిస్‌ నివాసంలో భేటీ అయిన బీజేపీ కోర్‌ కమిటీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవద్దని నిర్ణయించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగినంత బలం లేదని.. సమావేశం అనంతరం గవర్నర్‌ను కలిసి తమ నిర్ణయాన్ని తెలిపింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత  ఉత్కంఠగా మారాయి. కాగా అంతకు ముందు ఎట్టి పరిస్థితుల్లో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు గల మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎ...

సిద్ధూ కోసం ఇమ్రాన్ ఆరా

చిత్రం
 పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ను పాకిస్తాన్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. సరిహద్దులకు సమీపంలోని డేరా బాబా నానక్‌ వద్ద ప్రధాని మోదీ, కర్తార్‌పూర్‌లో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అకల్‌ తఖ్త్‌ జతేదార్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, కేంద్ర మంత్రి హర్‌ సిమ్రత్‌ కౌర్, మాజీ క్రికెటర్, నవ్‌ జ్యోత్‌ సింగ్‌ సిద్దూ తదితర 500 మంది ప్రముఖులతో కూడిన మొదటి యాత్రికుల బృందం ‘జాతా’ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అయితే పాక్‌లోని కర్తార్‌పూర్‌ కారిడర్‌ ప్రారంభోత్సవానికి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్దూ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. భారత్‌ నుంచి బయల్దేరిని యాత్రికుల బృందం కోసం కర్తార్‌పూర్‌లో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటు అక్కడి నాయకులు ఎదురు చూశారు. ఈ సందర్బంగా ‘మన సిద్దూ ఎక్కడా’అంటూ ఇమ్రాన్‌ ఆసక్తిగా అడిగారు. సిద్దూను మన సిద్దూ అంటూ ఇమ్రాన్‌ సంబోధించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా...