కియా క్యా కమాల్ కర్ దియా..!

కియా క్యా కమాల్ కర్ దియా..! ఆటోమొబైల్ రంగంలో కియా మోటార్స్ దుమ్ము రేపుతోంది. ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా వాహనాల అమ్మకాలు కొంత మేరకు తగ్గినా ఇండియాలో మాత్రం కియా సంస్థ తయారు చేసిన కార్లకు భలే డిమాండ్ ఉంటోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని అనంతపురం జిల్లాలో ఇటీవలే ప్రారంభించింది. ప్రస్తుతం మారుతి సుజుకి, టాటా , హ్యుండాయి , హొండా, వోక్స్ వాగన్ , ఇన్నోవా , తదితర వెహికల్స్ ను కొనుగోలు చేస్తూ వచ్చారు. వీటికి తోడుగా కియా కంపెనీ ఆకట్టుకునే డిజైన్స్, అద్భుతమైన ఫీచర్స్ , అందుబాటు ధరల్లో వాహనదారులకు, వెహికిల్స్ ప్రియులకు మార్కెట్లోకి విడుదల చేసింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కియా స్లిటోస్ కాంపాక్ట్ ఎస్ యూవీ మోడల్ కారు ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనిని కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. దీని ధర 9 లక్షల 69 వేల రూపాయల నుండి 15 లక్షల రూపాయలకు పైగా ఉంది. ఈ కారును మొదటిసారిగా 2018 లో జరిగిన ఆటో షో లో ప్రదర్శించారు. ఇండియాలో కియా కంపెనీ 2 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. ప్రస్తుతానికి అనంతపురం ప్లాంట్ లో వీటిని తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారైన కార్లు విదేశాలకు త్వరలో ఎగుమతి కానున్నాయి....