చిదంబరం స్వయం కృతాపరాధం

కాలం చాలా విలువైనది అంతకంటే బలీయమైనది. దీనిని తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వాళ్ళు ,
ఇంకో సమయంలో మౌనం వహించడమే లేక తమ తప్పిదాల వల్లనో లేక ఇంకే ఇతర వివాదం, సమస్య వల్లనో తల దించు కోవాల్సి రావొచ్చు. ప్రపంచంలో దేనినైనా కోల్పోయేందుకు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు సిద్ధంగా ఉంటారు. కానీ తమ పదవులు పోతే తట్టుకోలేరు. అంతకంటే ఎక్కువగా అధికారం కోల్పోతే ఉండలేరు. కుర్చీకి వున్న పవర్ అలాంటింది. ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా జరగవచ్చు. భారత దేశంలో ఈ తరహా రాజకీయాలు మరీ ఎక్కువగా ఉంటాయి. పైకి కనిపించక పోయినా, లోలోపట పగలతో రగిలి పోతుంటారు. చిరునవ్వులు అలాగే ఉంటాయి. కానీ వేధింపులు మరో రకంగా పలకరిస్తాయి. 

ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందో అప్పటి నుంచి వేట మొదలైంది రెడీనా సరి అధికారంలోకి వచ్చిన మోడీ అండ్ షా దెబ్బకు ప్రతిపక్ష పార్టీలు , నాయకులు, అధినేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అన్నిటి కంటే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ నే పవర్ లోకి రావాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఓ వైపు చంద్ర బాబు సైలెంట్ అయి పోగా ..దేవ గౌడ మిన్నకుండి పోయారు. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేకుండా చేయాలన్నది మోడీ కంకణం కట్టుకున్నారు. బలమైన నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లో నెంబర్ టూ గా ఉన్న చిదంబరం ఎట్టకేలకు  అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ అయ్యారు. అంతకు ముందు ఆయన సీబీఐకి అందుబాటులో లేకుండా పోయారు. 

దీంతో చిదంబరం దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసు ఇచ్చారు. తాను ఎక్కడికి వెళ్ళలేదంటూ సడన్ గా ఢిల్లీ పార్టీ ఆఫీస్ లో ప్రత్యక్షమయ్యారు. తాను ఎక్కడికి వెళ్లలేదని, తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. కానీ సీబీఐ ఆయన మాటలను విశ్వసించ లేదు. అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కావాలని తమ పార్టీకి చెందిన సీనియర్ నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోందంటూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆరోపణలు చేశారు. అయినా ఫలితం లేక పోయింది. చిదంబరం విషయంలో హాయ్ డ్రామా నడిచింది. ఎప్పుడైతే అమిత్ షా హోమ్ మినిష్టర్ గా భాద్యతలు చేపట్టారో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఎవరు ఎప్పుడు జైలు కు వెళతారో తెలియని పరిస్థితి నెలకొంది. చిదంబరం మంత్రిగా ఉన్న సమయంలో సోహ్రాబుద్దీన్ ఎంకౌంటర్ విషయంలో ఇదే అమిత్ షా ను అరెస్ట్ చేశారు. దీంతో పాగా పెంచుకున్న అమిత్ దెబ్బకు దెబ్బ తీశారు. పైకి బీజేపీ మాత్రం ఇది తమ పరిధిలోకి రాదని పేర్కొంది. చుమ్బరం తప్పు చేశారు.అందుకే అనుభవిస్తున్నారు. ఇందులో పీఎం , హోమ్ మినిస్టర్ ల ప్రమేయం ఎందుకుంటుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!