నిబద్ధతకు నిదర్శనం..శివన్ కు పురస్కారం..!

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థకు ప్రపంచ స్థాయిలో ఎనలేని పేరు తీసుకు వస్తున్న ఆ సంస్థ చైర్మన్ కె. శివన్ అలియాస్  కైలాసవాడివు శివన్ కు అరుదైన పురస్కారం దక్కింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కలాం పేరుతో ఏర్పాటు చేసిన అవార్డును శివన్ కు అందచేసింది. అంతరిక్ష పరిశోధనల్లో విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ఆయనకు ఈ గౌరవాన్ని అంద చేసినట్లు  ప్రభుత్వం తెలిపింది. చందమామ వద్దకు చంద్రయాన్ ను దిగ్విజయంగా పంపించడంతో  ఒక్కసారిగా శివన్ పేరు దేశవ్యాప్తంగా మారు మ్రోగింది. 1957 లో తమిళనాడు రాష్ట్రంలో శివన్ జన్మించారు. ప్రతిష్టాత్మకమైన విక్రమ్ సారాభాయి స్పెస్ సెంటర్ లో అంతకు ముందు డైరెక్టర్ గా  సేవలు అందించారు.

లిక్విడ్ ప్రొపులిజియన్ సెంటర్ లో కూడా పని చేశారు. క్రైజోనిక్ ఇంజన్లను తయారు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే శివన్ కు  రాకెట్ మ్యాన్ అని మరో పేరు కూడా ఉంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన శివన్ చిన్నప్పటి నుంచే ఎంతో కస్టపడి చదువుకున్నారు. వారి కుటుంబంలో మొదటి సారిగా గ్రాడ్యుయేట్ పాసైన వ్యక్తి ఆయన ఒక్కరే.  మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలాజీలో డిగ్రీ పొందారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశారు. 1982 లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలాజీ బెంగళూరు లో ఏరో స్పెస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. బాంబే లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలాజీ లో పీహెచ్ డి అందుకున్నారు.

ఇక్కడ ఎరోనాటిక్ స్పెస్ లో పరిశోధన చేశారు. అంతే కాకుండా నేషనల్ అకాడెమీ ఆఫ్ ఇంజనీరింగ్ , ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా , సిస్టమ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థల నుండి ఫెలోషిప్స్ అందుకున్నారు శివన్. 1982 లో ఇస్రోలో జాయిన్ అయ్యారు. ఉపగ్రహాల తయారీ , రూపకల్పన , లాంచింగ్ విభాగాలలో శివన్ పని చేశారు. పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికిల్ ప్రాజెక్టులో ఉన్నారు. శివన్ పైఠీరుకు మెచ్చిన ప్రభుత్వం అతడిని 2014 లో ఎల్పీ ఎస్సీ ప్రాజెక్ట్ కు డైరెక్టర్ గా నియమించింది. వీఎస్ ఎస్ సి కి కూడా ఆయనే బాధ్యతలు చేపట్టారు. మిషన్ ప్లానింగ్ , మిషన్ డిజైనింగ్ , స్ట్రాటజీ ప్లానింగ్ అంతా శివన్ చూసుకున్నారు. పీఎస్ ఎల్వి దిగ్విజయంగా నింగికి ఎగసింది.

ఇస్రోలో కీలక పాత్ర పోషించిన ఆయన జీఎస్ ఎల్వి , జీఎస్ ఎల్వి - ఎంకే 3 , ఆర్యేల్ వి - టీడీ తయారీలో , ప్రయోగంలో ఆయనే కీలకంగా మారారు. 6 డి ట్రాజెక్టరి సిమ్యులేషన్ సాఫ్ట్ వెర్ లో చీఫ్ ఆర్కిటెక్ట్ గా ఉన్నారు . ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కీలక విజయాల్లో శివన్ ఉన్నారు. తాజాగా చంద్రయాన్ మొదటి సారిగా ఫెయిల్ అయినప్పటికీ, మరోసారి చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఈ సక్సెస్ సామాన్యమైనది కాదు. అందుకే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా శివన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. చందమామ వద్దకు వెళ్లిన చంద్రయాన్ అక్కడి నుంచి జాబిల్లి ఫోటోలను కూడా పంపిస్తోంది. ఇదంతా నిబద్దతతో , వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తున్న భారతీయ శాస్త్రవేత్తలదే. అందులో ఈ క్రెడిట్ అంతా శివన్ కే దక్కుతుంది. హ్యాట్స్ ఆఫ్ శివన్. మరిన్ని గెలుపుల్లో మీ పాత్ర ఉండాలని కోరుకుందాం. 

కామెంట్‌లు