జగన్..బాబుల మధ్య మాటల యుద్ధం ..!

ఆంధ్రా అసెంబ్లీ రణరంగాన్ని తలపింప చేసింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..తాజా ముఖ్యమంత్రి సందింటి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ నీళ్ల అంశం కుదిపేసింది. చర్చంతా దీనిపైనే జరిగింది. బాబు, జగన్‌ల మధ్య మాటల యుద్దం నడిచింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. శాసనసభ నియమ నిబంధనలకు కాళేశ్వరం , గోదావరి -కృష్ణా లింక్‌పై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సభలో వాడి వేడిగా చర్చ జరిగింది. తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి నీళ్లు తెస్తామని ఇందు కోసం ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఓకే చేశారని ఏపీ సీఎం జగన్ సభలో ప్రకటించారు. తనకున్న సత్సంబంధాల వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. తెలంగాణ భూమి మీదుగా గోదావరి జలాలను తరలించి..ఏపీలోని కృష్ణా ఆయకట్టును స్థిరీకరిస్తామని చెప్పారు. ఈ విషయంపై సీఎం అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ నుంచి ఒకవేళ నీళ్లు రాకపోతే ఏం చేస్తారంటూ చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. దీనిపై తీవ్రంగా స్పందించారు జగన్. ఏపీలో అభివృద్ధి కోసం కేసీఆర్ సహకరిస్తున్నారు. ఏపీకి తెలంగాణ నుంచి నీళ్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. తెలంగాణ హద్దులో ఉ...