ఫ్లిప్ కార్ట్ క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్

ఇండియాలో టాప్ వ‌న్ ఈ కామ‌ర్స్ కంపెనీగా పేరొందిన ఫ్లిప్ కార్ట్..ప్ర‌పంచ ఈకామ‌ర్స్ దిగ్గ‌జ కంపెనీ అమెజాన్ , స్నాప్ డీల్ కంపెనీల‌కు షాక్ ఇచ్చింది. ఏకంగా కొత్త‌గా కో - బ్రాండెడ్ క్రెడిట్ కార్డును విడుద‌ల చేసింది. ఈ కార్డును పొంద‌డం వ‌ల్ల ఎన్నో ఉప‌యోగాలు ఉంటాయి క‌స్ట‌మ‌ర్స్ కు. యాక్సిస్ బ్యాంకు, మాస్ట‌ర్ కార్డ్‌తో క‌లిసి ఫ్లిప్ కార్డ్ కంపెనీ కో - బ్రాండెడ్ క్రెడిట్ కార్డును తీసుకు వ‌చ్చింది. అయితే , ఈ స‌దుపాయం ప్ర‌స్తుతం ఎంప‌కి చేసిన వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే తొలుత అందిస్తుంది. భ‌విష్య‌త్‌లో అంద‌రికీ విస్త‌రింప చేయాల‌నే ఆలోచ‌న‌తో దీనికి శ్రీ‌కారం చుట్టింది ఫ్లిప్ కార్ట్. ఈ కో - బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ద్వారా ఫ్లిప్ కార్ట్ , మింత్ర‌, 2గుడ్ ల‌లో కొనుగోలు చేసే ప్ర‌తిదానిపై 5 శాతం అన్ లిమిటెడ్ క్యాష్ బ్యాక్ వ‌చ్చేలా చేస్తుంది. 

ఈ స‌దుపాయం వ‌ల్ల క‌స్ట‌మ‌ర్ల‌కు వ‌స్తువులు తీసుకున్న ఆనందంతో పాటు పెట్టిన ఖ‌ర్చులో కొంత తిరిగి వ‌స్తుంది. ఈ ఛాన్స్ వ‌ల్ల ఇప్పుడున్న వినియోగ‌దారుల‌తో పాటు మ‌రికొంత మంది క‌స్ట‌మ‌ర్లు ఫ్లిప్ కార్డ్ ఇచ్చే వెస‌లుబాటును పొందేందుకు వీలు క‌లుగుతుంది. అంతేకాకుండా ఇత‌ర రిటైల్ కొనుగోలుపై కూడా 1.5 శాతంకు పైగా క్యాష్ బ్యాక్ ల‌భించ‌నుంది. ఈ క్యాష్ బ్యాక్ మొత్తం అప్ప‌టిక‌ప్పుడే కాకుండా ప్ర‌తి నెలా వినియోగ‌దారుల ఖాతాల్లో ఫ్లిప్ కార్ట్ జ‌మ చేస్తుంది. ఈ స‌దుపాయం కో -బ్రాండెడ్ క్రెడిట్ కార్డు తీసుకున్న లేదా పొందిన క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్ర‌మే ల‌భిస్తుంది. దీని వ‌ల్ల ఖ‌ర్చు చేశామ‌న్న బాధ అంటూ ఉండ‌దు. ప్ర‌తి నెల నెలా వేత‌నం జ‌మ అవుతున్న మాదిరిగానే కొంత మొత్తం ఖాతాలో జ‌మ అవుతుంది. దీని వ‌ల్ల కుటుంబాల‌కు అద‌న‌పు ఆదాయం స‌మ‌కూరిన‌ట్ల‌వుతుంది. 

దీంతో పాటు వినియోగ‌దారుల‌ను మ‌రింత పెంచుకోవాల‌నే దృష్టితో ఈ కార్డును ప్ర‌వేశ పెట్టింది ఫ్లిప్ కార్ట్. దీని వ‌ల్ల ఈ కామ‌ర్స్ కంపెనీలు స్నాప్ డీల్‌, అమెజాన్‌ల క‌స్ట‌మ‌ర్లు దీని వైపు మొగ్గు చూపే అవ‌కాశం ఉంద‌ని కంపెనీ అంచ‌నా వేస్తోంది. దీంతో పాటు వెల్‌క‌మ్ ఆఫ‌ర్ కింద సుమారు 4 వేల రెస్టారెంట్ల‌లో 20 శాతం దాకా డిస్కౌంట్, ఎయిర్ పోర్టు లాంజ్ యాక్సెస్, పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై నెల‌కు సుమారు 500 రూపాయ‌ల వ‌ర‌కు స‌ర్ ఛార్జి రుసుము త‌గ్గింపు వంటి ఆఫ‌ర్ల‌ను అంద‌జేస్తోంది ఫ్లిప్ కార్ట్. అయితే, ఈ కో -బ్రాండెడ్ క్రెడిట్ కార్డు పొందాలంటే వార్షిక రుసుము కింద 500 రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. ఒక‌వేళ 2 ల‌క్ష‌ల రూపాయ‌ల కంటే ఎక్కువ‌గా కొనుగోలు చేసిన‌ట్ల‌యితే ఈ మొత్తం కూడా కంపెనీకి చెల్లించాల్సిన అవ‌స‌రం అంటూ ఉండ‌దు. గ‌తంలో యాక్సిస్ బ్యాంక్‌తో క‌లిసి 2016లో యాక్సిస్ బ్యాంక్ బ‌జ్ క్రెడిట్ కార్డును తీసుకు వ‌చ్చింది. ఇక స్నాప్ డీల్ హెచ్‌డిఎఫ్‌సీతో ను ఎస్‌బిఐ ఐఆర్‌సీటీతోను, అమెజాన్ ఐసిఐసీఐతోను జ‌త‌క‌ట్టాయి. ఇలాంటి కార్డుల‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!