గెలుపొందిన ఇంగ్లండ్ ..త‌ల‌వంచిన ఆస్ట్రేలియా - ఫైన‌ల్ పోరుకు రెడీ ..!

ఊహించ‌నిదే జ‌రిగింది. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఆశించిన రీతిలో ఫ‌లితాలు ప్ర‌తికూలంగా వ‌చ్చాయి. నిన్న‌టికి నిన్న అండ‌ర్ డాగ్స్ గా ప‌రిగ‌నించిన ఇండియా జట్టు ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌కు పోయి..చేజేతులారా ఓట‌మిని కొని తెచ్చుకుంది. నాకౌట్ ద‌శ‌లో సెమీ ఫైన‌ల్లో న్యూజిలాండ్ ..భార‌త్‌ను ఇంటికి పంపించింది. రెండో సెమీ ఫైన‌ల్ ఉత్కంఠ భ‌రితంగా సాగుతుంద‌నుకుంటే ..ఏకంగా ఆతిథ్య జ‌ట్టు ఇంగ్లండ్ కంగూరుల‌కు ద‌డ పుట్టించింది. అద్భుత‌మైన ప‌ర్‌ఫార్మెన్స్‌తో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని స్వంతం చేసుకుని, ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్‌లోకి దూసుకెళ్లింది. ఈసారి క‌ప్పు కొత్త గూటికే చేర‌నుంది. ఇదీ ఇవాల్టీ విశేషం. జేస‌న్ రాయ్ చెల‌రేగి పోగా ..వోక్స్ దుమ్ము రేపాడు. దీంతో గెలుపు సునాయ‌సంగా ల‌భించింది ఇంగ్లండ్ జ‌ట్టుకు.

అయిదు సార్లు గెలిచిన ఆస్ట్రేలియా ఆరోసారి ఎగ‌రేసుకు పోదామ‌ని క‌ల‌లు క‌న్న‌ది. ఆ జ‌ట్టు ఆశ‌ల‌పై ఇంగ్లండ్ ఆట‌గాళ్లు నీళ్లు చ‌ల్లారు. ఈసారి ఎలాగైనా స‌రే క‌ప్పును ముద్దాడాల‌ని ప‌రిత‌పించిన విండీస్, శ్రీ‌లంక‌, పాకిస్తాన్, ఇండియా జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంటి దారి ప‌ట్టాయి. ఇక మిగిలింది అస‌లైన పోరు న్యూజిలాండ్, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఇంత‌వ‌ర‌కు ఒక్క‌సారి కూడా క‌ప్‌ను చేజిక్కించుకోని ఇంగ్లండ్ ఈసారి దానిపై క‌న్నేసింది. ద‌శాబ్దాల స్వప్నాన్ని నెర‌వేర్చుకునేందుకు ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతోంది. తొలిసారి ఫైన‌ల్‌కు చేరుకున్న కీవీస్ సైతం తాను కూడా రేసులో ఉన్నాన‌ని అంటోంది. కాగా సెమీఫైన‌ల్ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే, ఆస్ట్రేలియా జ‌ట్టునే హాట్ ఫేవ‌రేట్‌గా పేర్కొంటూ వ‌చ్చారు క్రికెట్ పండితులు. వారి అంచ‌నాలు త‌ప్ప‌ని నిరూపించాయి ..ఇత‌ర జ‌ట్లు. అటు బౌలింగ్‌లోను..ఇటు బ్యాటింగ్‌లోను రాణించిన ఇంగ్లండ్ ..ప్రారంభం నుంచే ఆస్ట్రేలియా జ‌ట్టుపై ఆధిప‌త్యం వ‌హిస్తూ వ‌చ్చింది.

పూర్తిగా ఏక‌ప‌క్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ..ఎనిమిది వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. వోక్స్‌, ర‌షీద్, ఆర్చ‌ర్ బంతుల‌తో క‌ట్ట‌డి చేస్తే..విధ్వంస‌క‌ర‌మైన బ్యాటింగ్‌తో జేస‌న్ రాయ్ ఆ జ‌ట్టు బౌలింగ్‌ను  ఉతికేసి ఇంగ్లండ్ టార్గెట్‌ను ఈజీ చేశాడు. ప్ర‌పంచ‌క‌ప్ లో ఓడి పోవ‌డం ఇదే తొలిసారి ఆస్ట్రేలియా టీంకు.
ఫేవ‌రేట్‌గా ప్ర‌పంచ‌క‌ప్‌లో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ త‌న‌పై అంచ‌నాలు ఏ మాత్రం త‌ప్పు కాద‌ని నిరూపించి ఫైన‌ల్లోకి దూసుకెళ్లింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జ‌ట్టు 49 ఓవ‌ర్ల‌లో 223 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. స్టీవెన్ స్మిత్ 119 బంతుల్లో 85 ప‌రుగులు చేయ‌గా, కేరీ 70 బంతుల్లో 46 ప‌రుగులు, జేస‌న్ రాయ్ 65 బంతుల్లో 85 ప‌రుగులు , మోర్గాన్ 45 ప‌రుగులు చేయ‌డంతో ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. ఆసిస్ ప‌త‌నాన్ని శాసించిన వోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!