వారెవ్వా..అమెజాన్..అయ్యో యాపిల్ ..!

ప్ర‌పంచంలోనే అత్యంత న‌మ్మ‌క‌మైన కంపెనీ ఏదంటే ట‌క్కున మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది యాపిల్, గూగుల్ కంపెనీలే. కానీ ఇపుడు ఆ సీన్ మారిపోయింది. ప్ర‌తి రోజు కోట్లాది మంది ప్ర‌పంచ వ్యాప్తంగా గూగుల్ ను వాడందే ఉండ‌లేరు. ఇక మ‌రో అమెరిక‌న్ కంపెనీ యాపిల్ పేరు చెబితే చాలు ..జ‌నం గుండెలు ల‌య త‌ప్పి పోతాయి. అంత‌లా దానికి క్రేజ్ ఉంది. తాజాగా ప్ర‌పంచ వ్యాప్తంగా నిర్వ‌హించిన న‌మ్మ‌క‌మైన బ్రాండ్స్..కంపెనీలు ఏవి అని ఓ సంస్థ స‌ర్వే చేప‌ట్ట‌గా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగు చూశాయి. గూగుల్ లేకుండా ఉండ‌లేం..కానీ ఎంత భ‌ద్రం అనే విష‌యంలో మాత్రం దానికి ఓటు వేయ‌లేమంటూ చెప్పేశార‌ట‌. మ‌రో కంపెనీ యాపిల్ కూడా ఒపినియ‌న్స్ వ్య‌క్తం చేశారు. చూస్తే అందంగా ఉండొచ్చు..క్వాంటిటీ క‌న్న ..క్వాలిటి విష‌యంలో అన్ని బ్రాండ్స్ కంటే గొప్ప‌గా ఉండ‌వ‌చ్చు..కానీ రోజూ అందించే ఆఫ‌ర్స్ విష‌యంలో అదే దేశానికి చెందిన అమెజాన్ కంపెనీకే జ‌నం ఓటేశారు.

ఈ కామ‌ర్స్ రంగంలో స‌ద‌రు కంపెనీ త‌న హ‌వాను కొన‌సాగిస్తూ వ‌స్తోంది. వినియోగ‌దారుల అభిరుచులు, అభిప్రాయాలు, సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకుంటూ త‌న‌కంటూ ఓ బ్రాండ్‌తో పాటు ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. డిజిట‌ల్ రంగం విస్త‌రించ‌డం, టెక్నాల‌జీ అప్ డేట్ కావ‌డం, ఇంట‌ర్నెట్  అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌పంచం చిన్న గ్రామంగా త‌యారై పోయింది. మ‌నుషుల మ‌ధ్య‌, జాతుల మ‌ధ్య‌, దేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దులు లేకుండా పోయాయి. ఆధునిక‌ప‌ర‌మైన టెక్నాల‌జీని ఎవ‌రైతే వాడుకుంటారో వారే ఇపుడు ప్ర‌పంచానికి రారాజుగా వెలుగొందే అవ‌కాశం నెల‌కొంది. అంత‌లా టెక్నాల‌జీ అనుసంధాన‌మై పోయింది. ఉద‌యం లేచి న‌ప్ప‌టి నుంచి రాత్రి ప‌డుకునే దాకా అంతా టెక్నాల‌జీనే. వైఫైతో అనుసంధానం కావ‌డం, ఈ కామ‌ర్స్ రంగం మ‌రింత పుంజు కోవ‌డంతో కొత్త కంపెనీలు లెక్క‌లేన‌న్ని పుట్టుకు వ‌చ్చాయి.

కానీ అమెజాన్ మాత్రం అమెరికాలో ప్రారంభ‌మై ఇపుడు ప్ర‌పంచంలోని ప్ర‌తి దేశానికి విస్త‌రించింది. త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ వస్తోంది. ఎక్క‌డైనా..ఎప్పుడైనా స‌రే మ‌న‌కు కావాల్సిన వ‌స్తువులను మ‌నం కోరుకుంటే..ఆర్డ‌ర్ చేస్తే చాలు కేవ‌లం ఒకే ఒక్క రోజులో మ‌న ఇంటి ముందు వాలిపోయే టెక్నాల‌జీని అప్ డేట్ చేసుకుంది. ల‌క్ష‌లాది మందికి అమెజాన్ కంపెనీ ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి క‌ల్పిస్తోంది. కోట్లాది రూపాయ‌ల‌ను వెన‌కేసుకుంటోంది. వ్యాపార ప‌రంగా రోజుకు ల‌క్ష‌ల్లో ఆర్డ‌ర్స్ వ‌స్తున్నాయి. తాను ప్రారంభించిన ప్ర‌తి చోటా ..భారీ ఎత్తున మాల్స్, గోదాములు, స్టోర్ రూముల‌ను ఏర్పాటు చేస్తోంది. దీంతో అద‌న‌పు ఆదాయం స‌మ‌కూరుతోంది ఈ కంపెనీకి. ఏ మాత్రం స‌ర్వీసులో ఆల‌స్యం జ‌రిగినా లేదా తీసుకున్న వ‌స్తువు డ్యామేజ్ అయినా వెంట‌నే తిరిగి ఇచ్చే ఏర్పాటు చేయ‌డంతో అమెజాన్‌ను కోట్లాది జ‌నం న‌మ్ముతున్నారు. త‌మ అవ‌స‌రాల‌ను తీర్చుకుంటున్నారు. సో..డ‌బ్బులు ఊరికే రావు..సంపాదించాలంటే ఈ కామ‌ర్స్ దిగ్గ‌జ కంపెనీ స‌క్సెస్ స్టోరీని చ‌ద‌వాల్సిందే.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!