ఇక..ఎస్..తో.. పేటీఎం..?

బ్యాంకింగ్ రంగంలో సేవల్లో ముందు వరుసలో ఉన్న ఎస్ బ్యాంక్ లో కొంత మొత్తంలో వాటాను కొనుగోలు చేసే దిశగా డిజిటల్ చెల్లింపుల సంస్థ పే టీఎం ప్రయత్నాలు చేస్తోంది. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాణా కపూర్, ఆయనకు చెందిన సంస్థలకు యస్ బ్యాంక్‌లో 9.6 శాతం మేర వాటా ఉన్నది. ఈ వాటాలో కొంత భాగాన్ని కొనుగోలు చేయడానికి పేటీఎమ్ యాజమాన్య సంస్థ, వన్ 97 కమ్యూనికేషన్స్ చర్చలు జరుపుతోందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, ఆర్‌బీఐ ఆమోదాన్ని బట్టి ఒప్పందం స్వరూపం ఆధారపడి ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పేటీఎమ్ వ్యవస్థాపకులు విజయ్ శేఖర శర్మకు ఇప్పటికే పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌లో వాటా వున్నది. దీంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, డీల్ ఈజీగా అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే, సంస్థాగత ఇన్వెస్టర్లు ఒక బ్యాంక్‌లో 5 శాతం మేర ఇన్వెస్ట్ చేయవచ్చు. యస్ బ్యాంక్ ఇటీవల క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ ద్వారా 1,930 కోట్ల నిధులు సమీకరించింది. మరిన్ని పెట్టుబడులు సమీకరించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో యస్ బ్యాంక్‌కు 1,50...