హద్దులు దాటిన ప్రేమ..ముద్దులతో సరిగమ..!

తెలుగు బుల్లితెర మీద స్టార్ మా టీవీ ఆధ్వర్యంలో టెలికాస్ట్ చేస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ దుమ్ము రేపుతోంది. ఇతర టీవీ ఛానల్స్ కు ధీటుగా ఈ ప్రోగ్రాం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా స్టార్ టీవీ బిగ్ బాస్ ను ప్రసారం చేస్తోంది. తమిళ్, కన్నడ, హిందీ లో ఈ షో కు పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ టేకోవర్ చేసుకున్న మా టీవీని స్టార్ టీవీ భారీ ఎత్తున ఆఫర్ ఇచ్చి స్వంతం చేసుకుంది. వినూత్న కార్యక్రమాలు, ఆకట్టుకునే భారీ తారాగణంతో రూపొందించిన సీరియల్స్ ను టెలికాస్ట్ చేస్తూ ప్రత్యర్థి టీవీలకు సవాల్ విసురుతోంది. నాగార్జునకున్న ఫాలోయింగ్ ను గుర్తించిన స్టార్ యాజమాన్యం మీలో కోటీశ్వరుడు ఎవరూ అంటూ రియాల్టీ షో ప్రసారం చేసింది. ఇది ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. అనంతరం మెగాస్టార్ చిరంజీవితో దీనిని నడిపించారు.

తాజాగా బిగ్ బాస్ ను స్టార్ట్ చేసారు. మాటీవీలో మొదటి సారిగా ఈ రియాల్టీ షో ను జూనియర్ ఎన్టీఆర్ స్టార్ట్ చేయగా, రెండో సారి బిగ్ బాస్ ను హీరో నాని హోస్ట్ చేశారు. ముచ్చటగా మూడో సారి నాగార్జున ప్రారంభించారు. స్టార్ట్ చేసే కంటే ముందు బిగ్ బాస్ పై పలు ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. కోర్టు దాకా వెళ్ళింది. మహిళా సంఘాలు అభ్యంతరం చెప్పాయి. అయినా స్టార్ మా వెనక్కి తగ్గలేదు. కోర్టు ఆదేశాల మేరకు ఎలా చెబితే అలా ప్రసారం చేస్తామని విన్నవించింది. దీంతో షో స్టార్ట్ అయ్యింది. ఎన్నడూ లేని విధంగా నాగార్జున హోస్ట్ గా సక్సెస్ అయ్యాడు. పార్టిసిపెంట్స్ కూడా ఒకరి కంటే మరొకరు పోటీపడి నటిస్తున్నారు. అయితే కొంచం ఎక్కువైందన్న విమర్శలు లేక పోలేదు. ఇంటిల్లిపాది, యూత్ , పెద్దలు సైతం ఇప్పుడు బిగ్ బాస్ ను చూడకుండా ఉండలేక పోతున్నారు. జులై 2017 లో మొదటిసారిగా స్టార్ట్ అయిన ఈ బిగ్ బాస్ ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చనీయాంశంగా మారి పోయింది.

దీనిని ప్రమోట్ చేయడంలో స్టార్ టీవీ మేనేజ్ మెంట్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఇటీవల నాగ్ లేక పోయినా నటి రమ్యకృష్ణ ఆయన స్థానంలో హోస్ట్ గా దుమ్ము రేపింది. మరో వైపు పార్టిసిపెంట్స్ మాత్రం కొంచం హద్దులు దాటారన్న విమర్శలు లేక పోలేదు. తాజాగా జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఇంటి సభ్యుల త్యాగాలన్నీ ఒకెత్తు అయితే పునర్నవి రాహుల్‌ను హగ్‌ చేసుకోవడం, ముద్దు పెట్టు కోవడం మరో ఎత్తు. ఇక ఈ సీన్‌పై సోషల్‌ మీడియాలో లెక్కలేనన్ని మీమ్స్‌, కామెంట్స్‌  వైరల్‌ అవుతున్నాయి. కష్టమైన టాస్క్ ను రాహుల్ పూర్తి చేయడంతో పునర్నవికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. అంతుపట్టని సంతోషంతో.. రాహుల్‌ను హగ్‌ చేసుకుని, ముద్దు పెట్టేసింది. ఈ ఒక్క కిస్ తో రాహుల్ హీరో అయి పోయాడు. ఎంతయినా ముద్దులో ఉన్నంత హాయి ఇంకెక్కడా దొరకదు కదూ. ఎంత ఘాటు ప్రేమయో పునర్నవి అంటూ పాటలు పాడుకుంటున్నారు ప్రేమికులు. ఈ కిస్సాట ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఎంతైనా కిస్సింగ్ లో ఉన్న మజాయే వేరు కదూ..! 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!