షబానా ఆజ్మి..సహజ నటీమణి..!

భారతీయ సినిమా రంగంలో సహజ నటనకు ప్రతిరూపం షబానా కైఫీ ఆజ్మి. ఆమెకు ఇప్పుడు 70 ఏళ్ళు. ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ ఆమె భర్త. నటిగా, సామాజిక యాక్టివిస్ట్ గా పేరు పొందారు. సినిమాలలో కాకుండా టీవీ, థియేటర్ లలో కూడా నటించారు. ఆమె తండ్రి షౌకత్ ఆజ్మీ గొప్ప కవి. పూణే లోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో షబానా చేరారు. అక్కడ నటనలో మెళకువలు నేర్చుకున్నారు. ఆమె తన అసమాన ప్రతిభతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఏకంగా అయిదు సార్లు నేషనల్ ఫిలిం అవార్డును అందుకున్నారు షబానా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పురస్కారాలు అందుకున్నారు. 30 వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో విమేన్ ఇన్ సినిమా అనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ను ప్రకటించింది. దేశంలో నాలుగో అత్యున్నతమైన పురస్కారం ఇది.

ఇప్పటి దాకా షబానా ఆజ్మి 120 సినిమాలలో నటించారు. 1988 నుంచి నేటి దాకా నటిస్తూనే ఉన్నారు.  సామాజిక భాద్యతగా ఆమె స్వీకరించారు. స్త్రీ పక్ష పాతిగా పేరు తెచ్చుకున్నారు. మహిళల తరపున పోరాడుతున్నారు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్స్ ఫండ్ కు గుడ్ విల్ అంబాజిడర్ గా పని చేస్తున్నారు. ఆమెను గుర్తించిన ప్రభుత్వం షబానను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆమెది స్వస్థలం హైదరాబాద్ నగరం. సయ్యద్ ముస్లిం కుటుంబం. తండ్రి కవి అయితే తల్లి స్టేజ్ నటి. అన్న బాబా ఆజ్మి సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. చెల్లెలు తన్వి ఆజ్మి నటి కూడా. తల్లిదండ్రులు సామాజిక చైతన్యం కలిగిన వాళ్ళు. ఆమె జయభాదురి నటనను చూసి స్ఫూర్తి పొందారు. షబానా లోని టాలెంట్ ను గుర్తించిన డైరెక్టర్ శ్యామ్ బెనెగల్ మొదటి సారిగా అంకుర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.

హైదరాబాద్ లో జరిగిన వాస్తవ కథ. దాని ఆధారంగానే మూవీ తీశారు. లక్ష్మి పాత్రలో షబానా నటించారు. ఈ మొదటి సినిమాకే ఆమె గొప్ప నటిగా పేరు తెచ్చుకునాన్రు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే అంకుర్ సినిమాను చూసి షబానా నటనను చూసి తెగ మెచ్చుకున్నారు. ఈ ఒక్క ప్రశంస షబానా ఆజ్మి ని గొప్ప నటిగా పేరు తెచ్చుకునేలా చేశాయి అర్త్, కాందార్, పార్ , గాడ్ మదర్ సినిమాలలో అద్భుతంగా నటించింది. జాతీయ స్థాయిలో అవార్డులు పొందారు. మండి సినిమాలో షబానా నటన పీక్ స్టేజ్ కు చేరుకుంది. కాందార్ సినిమాలో గ్రామీణ భార్య పాత్రలో ఆమె లీనమై నటించారు. మాసూమ్ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకు వచ్చింది. పారలెల్ సినిమాలో షబానా ఎంటర్ అయ్యారు. 1996 లో ప్రముఖ డైరెక్టర్ దీపా మెహతా ఫైర్ సినిమా తీశారు.

ఈ ఒక్క సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇది పూర్తిగా స్వలింగ సంపర్కం (లెస్బియన్స్ )కు సంబంధించిన సినిమా. దేశాన్ని ఒక్క ఊపు ఊపేసింది. ఇంటెర్నేషనల్ లో భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో షబానా ముద్దు సీన్ మరింత పాపులర్ అయ్యింది. ఇద్దరి మధ్య కలిగే భావోద్యేగాలను ఈ మూవీలో చూపించారు. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. ఒకానొక దశలో సినిమాను నిషేధించాలనేంత దాకా వెళ్లాయి. లాస్ ఏంజెల్స్ లో జరిగిన 32 వ చికాగో ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటిగా షబానా అవార్డు అందుకున్నారు. ఇదే డైరెక్టర్ తీసిన మరో సామాజిక నేపథ్యం తో తీసిన వాటర్ సినిమాలో ఆమె నటించి మెప్పించారు. దీంతో మిగతా టాప్ దర్శకులు షబానా ఆజ్మి ని సినిమాలకు తీసుకున్నారు.

బెనెగల్ నిశాంత్, జానూన్, సుష్మాను సినిమాలు తీస్తే సత్యజిత్ రే షత్రంజ్  కె కిలారి , మృణాల్ సేన్ కాందార్ , జెనిసిస్, ఏక్ దిన్ ఆఛానక్, సయీద్ మీర్జా ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యో అత్తా హై తీశారు. ఇక సాయి పరాంజి స్పర్శ్ , దిశ, గౌతమ్ ఘోష్ పార్, అపర్ణా సేన్ పింక్నీక్ , సాథీ, మహేష్ భట్ అర్త్ , వినయ్ శుక్లా గాడ్ మదర్ మూవీస్ లో నటించారు. మన్మోహన్ దేశాయి డైరెక్షన్ లో అమర్ అక్బర్ ఆంటోనీ , పర్వరిష్ , ప్రకాష్ మెహ్రా జ్వాలాముఖి లో నటించగా హాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటించారు షబానా. ఇలా చెప్పుకుంటూ పోతే గొప్పనైన చరిత్ర ఉంది. సోషల్ యాక్టివిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. సహజ నటిగా పేరు తెచ్చుకున్న ఆమె మరెన్నో పుట్టిన రోజులు జరుపు కోవాలని కోరుకుందాం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!