పదవుల పందేరం..అస్మదీయులకు అందలం..?
ఏపీలో కొలువు దీరిన సీఎం జగన్ మోహన్ రెడ్డి అతి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను కూడా తన తండ్రి బాటలోనే నడుస్తున్నారు. తనకు చేదోడుగా ఉన్న వారికి పదవులను కట్టబెడుతున్నారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఆలయంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంకు ధర్మకర్తల మండలి ఎట్టకేలకు సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత ప్రకటించారు. తిరుమల అంటేనే కోట్లాది ప్రజల, భక్తుల మనోభావాలకు సంబంధించినది. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా పాలక మండలిని ఏర్పాటు చేయాల్సి ఉండగా, గత కొన్నేళ్ల నుంచి దీనికి విరుద్దంగా పాలకులు సభ్యులను నియమిస్తూ వస్తున్నారు. వీరి వల్ల దేవాలయానికి ఒరిగిందేమీ ఉండదు. పైపెచ్చు వీరికి ప్రత్యేక ప్రోటోకాల్. అదనపు ఖర్చు కూడా.తాజాగా జగన్ మోహన్ రెడ్డి టీటీడీ పాలక మండలిని ఖరారు చేశారు.
ఇందులో అందరూ జగమెరిగిన, పలు ఆరోపణలు ఉన్న వ్యాపారవేత్తలు. ఈసారి పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచారు.
జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో జగన్ మోహన్ రెడ్డికి సన్నహితులు కాగా, తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వీరిలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జూపల్లి రామేశ్వర్ రావు ఉండగా ఇంకొకరు దామోదర్ రావు .ఈయన నమస్తే తెలంగాణ సీఎండీ గా ఉన్నారు. వీరి తో పాటు కావేరి సీడ్స్ అధినేత భాస్కర్ రావు కూడా ఉండటం విశేషం. ఈముగ్గురిలో ఇద్దరు శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామికి అపర భక్తులు. వీరి వెనుక స్వామి వారి ఆశీర్వాదం ఉన్నదేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎక్కువగా వ్యాపార వేత్తలు ఉండడం వల్ల తిరుమలకు , ఆ వేంకటేశ్వరుడి ఎలాంటి లాభం చేకూరుతుందో ఏలుతున్న జగన్ మోహన్ రెడ్డికే తెలియాలి.
కాగా టీటీడీ ప్రకటించిన వారిలో చోటు దక్కించుకున్న వారెవరో చూస్తే.
మొత్తం 24 మందిలో సభ్యులను ఖరారు చేయగా మరో నలుగురిని ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమించారు. మొత్తం సభ్యుల్లో ఏపీ నుంచి ఎనిమిది మంది, తెలంగాణ నుంచి ఏడుగురు , తమిళ నాడు నుంచి నలుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, ఢిల్లీ , మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కింది. ఇప్పటికే టీటీడి ధర్మకర్తల మండలి చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉండగా మూడు నెల్ల తర్వాత పూర్తి స్థాయిలో నియమించారు. గతంలో 19 మంది మాత్రమే ఉండే వారు. ఈసారి దాని సంఖ్యను పెంచారు. ముగ్గురు ఎమ్మెల్యేలకు స్థానం కల్పించారు. రాజంపేట, ఎలమంచిలి, పెనుమలూరు ఎమ్మెల్యేలు ఉన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు పేరు వినిపించినా చివరలో చోటు దక్కలేదు. తమిళనాడు సీఎం ప్రతిపాదించిన కుమార గురుకు , స్టాలిన్ ప్రతిపాదించిన నిషిత ముప్పవరపులను నియమించింది.
ఏపీ నుంచి ఎమ్మెల్యేలు రమణమూర్తి రాజు, మల్లికార్జున రెడ్డి , పార్థసారథి ఉండగా మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ , ఎంపీ ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి , నాదెళ్ల సుబ్బారావు , అనంత, ప్రసాద్ కుమార్ ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, హెటిరో ఫర్మా ఎండీ పార్థసారథి రెడ్డి , భాస్కర్ రావు కావేరి సీడ్స్ ఎండీ , మారం శెట్టి రాములు, దామోదర్ రావు నమస్తే తెలంగాణ సీఎండీ , ప్రతాప్ రెడ్డి , శివ కుమార్ వైకాపా నేతలు ఉన్నారు. తమిళ నాడు నుంచి ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ , కృష్ణమూర్తి వైద్యనాథన్ , నిషిత, కుమార గురు ఉన్నారు. కర్ణాటక నుంచి సుధా నారాయణ మూర్తి , రవి నారాయణ , రమేష్ శెట్టి ఉండగా ఢిల్లీ నుంచి శివ శంకరన్, మహారాష్ట్ర నుంచి రాజేష్ శర్మ ఉన్నారు. ఈ మొత్తం జాబితాలో పొలిటికల్ లీడర్లు , పారిశ్రామిక వేత్తలు ఉండగా సామాన్యుల , జర్నలిస్ట్స్ , సామాజిక సేవ చేసే వాళ్ళు లేక పోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి