కంపెనీ కహానీ..కలెక్షన్లలో సునామీ..! వారెవ్వా..వర్మ..!!

డైనమిజం ఎలా వుంటుందో..ఇండియాలో ఆక్టోపస్‌లా విస్తరించిన మాఫియాను..ముంబయి లైఫ్ స్టయిల్‌ను సెల్యూలాయిడ్ మీద ఆవిష్కరించిన ఒకే ఒక్క దర్శకుడు రాం గోపాల్ వర్మ. ఆద్యంతమూ కొత్తదనాన్ని ..డేర్‌నెస్‌ను అమితంగా ఇష్టపడే ఈ డైరెక్టర్ రూటే సపరేట్. పేరుకే మూడక్షరాలు అయినా ఆర్జీవీ అంటే వ్యక్తి వందలాది మంది సమూహం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే కాదు..అనుకున్నాడంటే తక్షణమే ఆచరణలోకి తీసుకు రావడం ఆయన స్పెషాలిటీ. శివతో తెలుగు సినిమా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఈ అగ్ర దర్శకుడు ..ఏకంగా ముంబయిని సంబ్రమాశ్చర్యానికి గురి చేశాడు. వాట్ ఏ టాలెంట్..వాట్ ఏ కరేజ్. ఓ వైపు బాల్ థాకరే..మరో వైపు దావూద్..చోటా రాజన్..గ్యాంగులు..మాఫియా కల్చర్..ఆ కాన్సెప్ట్ ను తలుచుకుంటేనే మనకైతే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కానీ వర్మ దమ్మున్నోడు..గట్స్ ఉన్నోడు..ఏకంగా గ్యాంగ్‌స్టర్లను..గ్రూపులను..రౌడీల లైఫ్ స్టయిల్‌ను..మాఫియా చేస్తున్న ఆగడాలను తెరపైకి తీసుకు వచ్చాడు. పాత ముఖాలతో బోర్ కొట్టించిన హిందీ సినిమాను తన వైపు చూసేలా చేశాడు వర్మ. ఎందుకూ పనికిరాని వారిని..అడిషన...