కంపెనీ కహానీ..కలెక్షన్లలో సునామీ..! వారెవ్వా..వర్మ..!!
డైనమిజం ఎలా వుంటుందో..ఇండియాలో ఆక్టోపస్‌లా విస్తరించిన మాఫియాను..ముంబయి లైఫ్ స్టయిల్‌ను సెల్యూలాయిడ్ మీద ఆవిష్కరించిన ఒకే ఒక్క దర్శకుడు రాం గోపాల్ వర్మ. ఆద్యంతమూ కొత్తదనాన్ని ..డేర్‌నెస్‌ను అమితంగా ఇష్టపడే ఈ డైరెక్టర్ రూటే సపరేట్. పేరుకే మూడక్షరాలు అయినా ఆర్జీవీ అంటే వ్యక్తి వందలాది మంది సమూహం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే కాదు..అనుకున్నాడంటే తక్షణమే ఆచరణలోకి తీసుకు రావడం ఆయన స్పెషాలిటీ. శివతో తెలుగు సినిమా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఈ అగ్ర దర్శకుడు ..ఏకంగా ముంబయిని సంబ్రమాశ్చర్యానికి గురి చేశాడు. వాట్ ఏ టాలెంట్..వాట్ ఏ కరేజ్. ఓ వైపు బాల్ థాకరే..మరో వైపు దావూద్..చోటా రాజన్..గ్యాంగులు..మాఫియా కల్చర్..ఆ కాన్సెప్ట్ ను తలుచుకుంటేనే మనకైతే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
కానీ వర్మ దమ్మున్నోడు..గట్స్ ఉన్నోడు..ఏకంగా గ్యాంగ్‌స్టర్లను..గ్రూపులను..రౌడీల లైఫ్ స్టయిల్‌ను..మాఫియా చేస్తున్న ఆగడాలను తెరపైకి తీసుకు వచ్చాడు. పాత ముఖాలతో బోర్ కొట్టించిన హిందీ సినిమాను తన వైపు చూసేలా చేశాడు వర్మ. ఎందుకూ పనికిరాని వారిని..అడిషన్స్‌లో ఫెయిల్ అయిన వారిని ..తన సినిమాలో ఎంచుకున్నాడు. అంతేకాకుండా పవర్ ఫుల్ పాత్రలను క్రియేట్ చేశాడు. వారికి తన స్పేస్‌లో చోటు ఇచ్చాడు. ఇంకేం..బాక్సాఫీసు వద్ద సినిమాలన్నీ హిట్. భారీ కలెక్షన్లు రాబట్టాయి. ఇదీ వర్మకున్న టాలెంట్. కంటెంట్ వుంటే చాలు..కటౌట్స్ ఎందుకు అన్నది ఈ డైరెక్టర్ విషయంలో చక్కగా సరిపోతుంది. శివతో స్టార్ట్ అయిన సక్సెస్ యాత్ర ముంబయిని భయపడేలా చేసింది. గ్యాంగ్ వార్స్ ఎలా పనిచేస్తాయి. మాఫియా ఎలా గుప్పిట్లోకి తెచ్చుకుంటుంది ..గన్స్ అండ్ కల్చర్..మర్డర్స్..పాలిటిక్స్..బిజినెస్ ఎలా కలిసి వుంటాయో చూపించిన దర్శకుడు వర్మనే. జెడీ చక్రవర్తితో సత్య, అజయ్ దేవ్‌గన్, మోహన్‌లాల్..మనీషా కోయిరాలతో ..మాఫియా నేపథ్యంతో కంపెనీ సినిమా తీశాడు.
అందరూ పెదవి విరిచారు. ముంబయి ఓ పట్టాన ఎవరికీ అర్థం కాదు. అల్లర్లు..అశాంతి..ఇరు వర్గాల మధ్య పోరాటం..ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఓ వైపు పేదరికం..మరో వైపు స్మగ్లింగ్ దందా..సెటిల్‌మెంట్లు..నేర సంస్కృతిని ఒంట పట్టించుకున్న ఈ నగరపు పోకడను అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. కంపెనీకి డైరెక్టర్ వర్మ అయితే నిర్మాతలుగా తనతో పాటు అశ్వనీదత్, బోనీ కపూర్ తీశారు. జైదీప్ సహాని కథను సమకూర్చితే..సీమా బిశ్వాస్, వివేక్ ఒబే రాయ్, హక్ ప్రధాన పాత్రల్లో నటించారు. సందీప్ చౌతా మ్యూజిక్ అందించారు. హేమంత్ చతుర్వేది సినిమాటోగ్రఫీ సమకూర్చితే..చందన్ అరోరా ఎడిట్ చేశారు. వర్మ కార్పొరేషన్, వైజయంతి మూవీస్ పేరుతో కంపెనీని 12 ఏప్రిల్ 2002లో విడుదల చేశారు. సినిమా రిలీజ్ అయి 17 ఏళ్లు కావొస్తోంది. సినిమా ఇప్పటికీ ఒక బలమైన సందేశాన్ని ఆవిష్కరించింది. ఏళ్లు గడిచినా వర్మ సృష్టించిన కేరక్టర్స్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. హింస..మాఫియా..పాలిటిక్స్..ఏకమై రాజ్యంలో భాగమయ్యాయి. టెక్నాలజీ మారింది..దీంతో పాటే హింసోన్మాదం..శాడిజం ..శృంగారం పెచ్చరిల్లి పోయింది. ఆధిపత్య పోరులో పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు.
ఈ దేశంలో అడ్డాలు..అడ్డదార్లు ఎక్కువయ్యాయి. కంట్రోలింగ్ సిస్టం అదుపు తప్పింది. నేరం ..రాజ్యం చెట్టాపట్టాలు వేసుకుంటూ తిరుగుతున్నాయి. సామాన్యుడి గొంతును వినేదెవ్వరు..దీనిని ప్రశ్నించాడు ..సామాన్యులను..చిరునామా లేని వాళ్లకు లైఫ్ ను ఇచ్చాడు. అంతేనా స్టార్ డం తీసుకు వచ్చాడు. 155 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా ఇండియన్ సినిమా ఫీల్డ్‌లో సంచలనం సృష్టించింది. ఏడు కోట్ల రూపాయలతో రామ్ దీనిని తీశాడు. ఇంకేం నిర్మాతలు ఆశ్చర్య పోయేలా రూపీస్, డాలర్స్ వళ్లో వాలాయి. ఇదీ పక్కా మాఫియా గ్యాంగ్‌ల మధ్య వార్‌కు సంబంధించిన మూవీ. ఇంకొకరైతే టచ్ చేసేవారు కాదేమో..కానీ ఆర్జీవీ ఊరుకుంటాడా..డోంట్ కేర్ అంటూ డైనమిక్‌గా..రిచ్‌గా..పవర్ ఫుల్ గా తీశాడు. యూత్ కనెక్టివిటి కలిగిన సినిమా కావడంతో ..హీరోయిజం కంటే కంటెంట్ డామినేట్ చేసేలా తీశాడు. ఇక్కడే డైరెక్టర్ పనితనం ఏమిటో తెలుస్తుంది. బాక్సాఫీస్ వద్ద 25 కోట్లకు పైగా రాబట్టింది. సత్యకు సీక్వెల్‌గా కంపెనీని పేర్కొన్నా ఆ సినిమా వేరు..ఈ సినిమా వేరు. చందు ..మాలిక్ పాత్రలు కీలకంగా ఉంటాయి. ఇబ్రహీం..చోటా రాజన్‌ల మధ్య ఉన్న కోల్డ్ వార్‌ను సినిమాలోకి తీసుకు వచ్చాడు.
మాఫియా ఏం చేస్తోంది అనే దానిపై కొన్నేళ్లు ఆర్జీవి రీసెర్చ్ చేశాడు. సినిమాను ముంబయి, నైరోబి, హాంగ్ కాంగ్, స్విట్జర్లాండ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాడు. ఆస్టిన్ ఫిలిం ఫెస్టివల్‌తో పాటూ న్యూయార్క్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్, ఫ్రిబోర్గ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో నామినేట్ అయింది ఈ మూవీ. 48వ ఫిలిం ఫేర్ అవార్డుల ఎంపికలో ఆరు అవార్డులను స్వంతం చేసుకుంది. బెస్ట్ యాక్టర్ గా అజయ్ , మేల్ సపోర్ట్ యాక్టర్‌గా వివేక్ ఒబేరాయ్ ఎంపికయ్యారు. స్టోరీ లైన్‌కు వస్తే..చందు ముంబయి అండర్ వరల్డ్‌లో జాయిన్ అవుతాడు. అక్కడ ఎలా ప్రాఫిట్ పొందాలో దాదా మాలిక్ వద్ద నేర్చుకుంటాడు. ఇద్దరూ కలిసి అనీస్‌ను చంపేస్తారు. శత్రువులంటూ లేకుండా చేసుకుంటూ మొత్తాన్ని గుప్పిట్లోకి తెచ్చుకుంటాడు. పోలీస్ ఇన్స్‌పెక్టర్ రాథోడ్ సమక్షంలో తనకు అడ్డు వచ్చిన గ్యాంగ్ లీడర్ ..కోలిగ్ అస్లాంను చంపేస్తాడు. రాథోడ్ టార్చర్ చేస్తాడు. మాలిక్ పర్మిషన్‌తో చందు చంపేస్తాడు. ఇవన్నీ ఎందుకని ప్రశ్నిస్తాడు . హోం మినిస్టర్ పోస్ట్ కోసం పొలిటికల్ లీడర్‌ను చంపేందుకు కాంట్రాక్టు తీసుకుంటాడు. చందు అభ్యంతరం చెబుతాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయి.
దీనిని పోలీస్ కమిషనర్ పాత్రలో నటించిన మోహన్ లాల్ స్కెచ్ వేస్తాడు. ఒకప్పుడు ఒక్కరిగా ఉన్న వీరిద్దరు ఇపుడు బద్ధ శత్రువులుగా మారారు. ఎవరికి వారే గ్యాంగ్ లీడర్లుగా తయారయ్యారు. ఎవరి టీం వారిదే.. వీరిద్దరు ఎంతో మందిని చంపారు. ఇపుడు ఇద్దరూ నువ్వా నేనా అనే స్థాయికి వచ్చేశారు. కెన్యాలో చందును చంపేందుకు మాలిక్ ప్లాన్ చేస్తాడు. కాల్పుల్లో గాయపడి బయట పడతాడు చందు. కోడా సింగ్ మాలిక్‌ను హాంగ్ కాంగ్‌లో చంపేస్తాడు. విషయం తెలిసి చందు షాక్ కు గురవుతాడు. కోడాను పోలీసులు అరెస్ట్ చేస్తారు. చందు పోలీస్ కమిషనర్ ముందు సరెండర్ అయి జైలు జీవితం గడుపుతాడు. ఇంతటితో సినిమా ముగుస్తుంది. పవర్ ఫుల్ ప్రజెంటేషన్..దెబ్బకు నోట్ల కట్టలు రాలాయి. వర్మ డైనమిక్ డైరెక్టర్‌గా మరోసారి రుజువు చేసుకున్నారు.
ఇండియాలో వసూళ్లు ఆశించినదానికంటే ఎక్కువగా వస్తే..ఓవర్సీస్‌లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది కంపెనీ. 295 ప్రింట్‌లతో విడుదలైన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. హైదరాబాద్, నాగ్‌పూర్, ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైయి..ఇలా ప్రతి నగరంలో ఎక్కడ చూసినా కంపెనీ గురించిన కబుర్లే. మాఫియాకు కొత్త అర్థం చెప్పిన ఆర్జీవీ ..ఎక్కడికి వెళ్లినా ఎవరికీ రానంత స్టార్ డమ్‌ను స్వంతం చేసుకున్నారు. ఇండియన్ ఫిలిం క్రిటిక్స్ సినిమాకు హెవీ రేటింగ్స్ ఇచ్చారు. వర్మపై ప్రశంసల జల్లులు కురిపించారు. ఓ రకంగా ఆకాశానికి ఎత్తేశారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ ఫోటోగ్రఫి, ఉత్తమ ఛాయాగ్రహణం..ఉత్తమ స్క్రీన్ ప్లే..ఉత్తమ సంభాషణల రచయిత..ఇలా ప్రతి ఫ్రేంలోను పురస్కారాలు లభించాయి. సినీ జగత్తులో కంపెనీ లాంటి సినిమా ఎవరైనా తీయగలరా..ఒక్క రాం గోపాల్ వర్మ అనే డైరెక్టర్ తప్ప..ఆర్జీవీ ..హ్యాట్సాఫ్ యు..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి