జయహో జస్‌ప్రీత్..జాక్ పాట్ కొట్టేసిన దృవ..!

ఎంత పెద్ద కంపెనీ అయినా, అది ఏ రంగానికి చెందినదైనా సరే టెక్నాలజీ మీద ఆధార పడాల్సిందే. లేకపోతే ఇతర దిగ్గజ కంపెనీలకు పోటీ ఇవ్వకుండానే వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే దిగ్గజ కంపెనీలన్నీ డేటా, సెక్యూరిటీ , ఆటోమెషీన్, మిషన్ లెర్నింగ్, తదితర ఫ్లాట్‌ఫాంలపై ఆధారపడుతున్నాయి. ఇందు కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాయి. ప్రపంచాన్ని విస్మయ పరుస్తూ, ఆదాయంలో దూసుకెళుతున్న ఐటీ కంపెనీలకు ఇండియాకు చెందిన జస్‌ప్రీత్ సింగ్ రూపొందించిన దృవ ఐటీ సొల్యూషన్స్ టాప్ వన్‌లో నిలుస్తోంది. అమెరికాకు చెందిన అమెజాన్ కంపెనీకి దృవ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఆల్ ఇన్ వన్ బ్యాకప్, డిసాస్టర్ రికవరీ, ఆర్కైవల్ అండ్ అనలిటిక్స్ సొల్యూషన్స్ అన్నీ ఒకే ఒక్క క్లిక్‌తో సేవలు పొందేలా రూపొందించాడు సింగ్. ఊహించని రీతిలో దృవ సొల్యూషన్స్ టాప్ రేంజ్ లోకి దూసుకెళ్లడంతో అన్ని కంపెనీస్ బిగ్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. వికింగ్ కంపెనీ ఏకంగా దృవలో 130 మిలియన్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది. ఈ మేరకు ఎంఓయు కూడా చేసుకుంది. టోటల్ కేపిటల్ పరంగా చూస్తే దృవ 328 మిలియన్లకు చేరుకుంది. సాస్...