ఏపీలో కొలువుల పండగ..దూకుడు పెంచిన జగన్
రాజ్యం తల్చుకుంటే, పరిపాలనాధిపతి అనుకుంటే ఏదైనా చేయొచ్చని పాలనా పరంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు , పథకాలు అమలు చేయవచ్చని నిరూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. తాను ఎన్నికల ప్రచారంలో , పాదయాత్ర నిర్వహించిన సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కొలువుల పండుగకు తెర తీశారు. సమాజ సేవలో ఉద్యోగులు కీలక భూమిక పోషిస్తారని వారు బాగుంటే మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తారని సీఎం నమ్మారు.
అన్ని వర్గాలకు చెందిన వారికి ఆమోదయోగ్యంగా వుండేలా చర్యలు చేపట్టారు. ఇది ఓ రకంగా మిగతా రాష్ట్రాలకు ఇబ్బందికర పరిణామమే. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో సుదీర్ఘమైన పోరాటాన్ని నిర్వహించి చరిత్ర సృష్టించి..తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ ఎస్ ఇపుడు నీళ్ల జపం చేస్తోంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కానీ ఉద్యమ కాలంలో అన్నింటిని వదిలేసి తమ బతుకులు బాగు పడతయని, తమ కుటుంబాలు చల్లంగ ఉంటాయని ఆశించిన లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు గల్లంతయ్యాయి. ఈరోజు వరకు కొన్నింటిని మాత్రమే భర్తీ చేశారు. ఇంకా భర్తీ చేయాల్సినవి చాలా ఉన్నాయి.
ఎన్నికల సమయంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తానని చెప్పారు. కానీ ఇపుడు అదే పద్ధతి నడుస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోక నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. కానీ ఏపీ సీఎం బాధ్యతలు స్వీకరించిన తక్షణమే చకా చకా పాలనాపరమైన సంస్కరణలకు తెర తీశారు. సమర్థవంతమైన, అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా చస్తానని, ఎవరైనా లంచం అడిగితే లేదా ఇబ్బందులు ఉన్నట్లయితే తనకు నేరుగా ఫిర్యాదు చేయొచ్చవంటూ జగన్ ప్రకటించారు. దీంతో ఏపీలోని జనానికి జగన్ మీద అపారమైన నమ్మకం ఏర్పడింది. ఒక్కో శాఖను ఆయన సమీక్షిస్తున్నారు. ఆయా శాఖలపై పట్టు తెచ్చుకుంటున్నారు. సీఎం సుబ్రమణ్యంతో ప్రతి రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఎలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రజలకు మేలు జరుగుతుందో సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆయన ఉన్నతాధికారులను కోరారు. ఎలాంటి బేషజాలకు పోకుండా గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. తాజాగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెర తీశారు. అంతేకాకుండా ప్రభుత్వం కొత్తగా అమలు చేసే కార్యక్రమాలు, పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు గాను ప్రతి ఊరికో వలంటీర్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆమేరకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. తాను మాటలు చెప్పే వ్యక్తి కానని, చేతల మనిషినని నిరూపించారు.
ఆయా గ్రామంలోనే పనిచేసేలా, ఇంటర్ పాసైతే చాలు దీనికి అర్హులని , ఉన్న చోటనే ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించారు. 4 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఇపుడు నిరుద్యోగులంతా జగన్ జపం చేస్తున్నారు. ఆయా శాఖల వారీగా మిగిలి పోయిన ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేస్తామని ప్రకటించారు సీఎం. అంతేకాకుండా ఆయా శాఖల్లో ఇప్పటికే కాంట్రాక్టు పద్దతిన పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందు కోసం మార్గదర్శకాలు తయారు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ వారంతా ఇపుడు తమకు జగన్ లాంటి సీఎం అయితే బావుంటుందని కోరుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి