జ‌య‌హో జ‌స్‌ప్రీత్..జాక్ పాట్ కొట్టేసిన దృవ‌..!

ఎంత పెద్ద కంపెనీ అయినా, అది ఏ రంగానికి చెందిన‌దైనా స‌రే టెక్నాల‌జీ మీద ఆధార ప‌డాల్సిందే. లేక‌పోతే ఇత‌ర దిగ్గ‌జ కంపెనీల‌కు పోటీ ఇవ్వ‌కుండానే వెన‌క్కి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే దిగ్గ‌జ కంపెనీల‌న్నీ డేటా, సెక్యూరిటీ , ఆటోమెషీన్, మిష‌న్ లెర్నింగ్, త‌దిత‌ర ఫ్లాట్‌ఫాంల‌పై ఆధార‌ప‌డుతున్నాయి. ఇందు కోసం కోట్లాది రూపాయ‌లు వెచ్చిస్తున్నాయి. ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రుస్తూ, ఆదాయంలో దూసుకెళుతున్న ఐటీ కంపెనీల‌కు ఇండియాకు చెందిన జ‌స్‌ప్రీత్ సింగ్ రూపొందించిన దృవ ఐటీ సొల్యూష‌న్స్ టాప్ వ‌న్‌లో నిలుస్తోంది. అమెరికాకు చెందిన అమెజాన్ కంపెనీకి దృవ సాంకేతిక స‌హ‌కారం అందిస్తోంది. ఆల్ ఇన్ వ‌న్ బ్యాక‌ప్, డిసాస్ట‌ర్ రిక‌వ‌రీ, ఆర్కైవ‌ల్ అండ్ అన‌లిటిక్స్ సొల్యూష‌న్స్ అన్నీ ఒకే ఒక్క క్లిక్‌తో సేవ‌లు పొందేలా రూపొందించాడు సింగ్.

ఊహించ‌ని రీతిలో దృవ సొల్యూష‌న్స్ టాప్ రేంజ్ లోకి దూసుకెళ్ల‌డంతో అన్ని కంపెనీస్ బిగ్ ఆఫ‌ర్స్ ప్ర‌క‌టిస్తున్నాయి. వికింగ్ కంపెనీ ఏకంగా దృవ‌లో 130 మిలియ‌న్లు పెట్టుబ‌డి పెట్టేందుకు రెడీ అయింది. ఈ మేర‌కు ఎంఓయు కూడా చేసుకుంది. టోట‌ల్ కేపిట‌ల్ ప‌రంగా చూస్తే దృవ 328 మిలియ‌న్ల‌కు చేరుకుంది. సాస్ కంపెనీ దృవ‌లో అంత‌ర్భాగంగా ఉంది. క్లౌడ్ డేటా ప్రొటెక్ష‌న్, మేనేజ్‌మెంట్ లో ఏకంగా వికింగ్ గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ ఈ భారీ పెట్టుబ‌డి పెట్టింది. ఈ కంపెనీ మార్కెట్ ప‌రంగా ఒన్ బిలియ‌న్ బ్రాండ్ వాల్యూ సంపాదించుకుంది. 2017లో దృవ కు రైవ‌ర్ వుడ్ కేపిట‌ల్ కంపెనీ 80 మిలియ‌న్లు ఇన్వెస్ట్ చేసింది.

దృవ కంపెనీ క్ల‌యింట్ల‌లో బిగ్ కంపెనీస్ ఉన్నాయి. టెన‌యా కేపిట‌ల్, నెక్స‌స్ వెంఛ‌ర్ పార్ట్‌న‌ర్స్ తో ప‌లు కంపెనీలు ఈ కంపెనీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు సై అంటున్నాయి. ఫార్చూన్ 500 కంపెనీస్‌లో 10 శాతం వాటా క‌లిగి ఉంది. ఫిజెర్, ఫ్లెక్స్, మారియ‌ట్‌, లైవ్ నేష‌న్ అండ్ హిటాచీ దిగ్గ‌జ కంపెనీలు దృవ సేవ‌లు పొందుతున్నాయి. కంపెనీని మ‌రింత విస్త‌రించేందుకు గాను ఆయా కంపెనీలు పెట్టే డ‌బ్బుల‌ను ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్టు ఫౌండ‌ర్ అండ్ సిఇఓ జ‌స్ ప్రీత్ సింగ్ వెల్ల‌డించారు. ఈ ఏడాది పూర్త‌య్యే స‌రికి మార్కెట్ లో 50 శాతం వాటాను చేజిక్కించు కోవాల‌న్న‌దే త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. వ‌చ్చే ప‌ది ప‌న్నెండు నెలల్లో ఇన్షియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌రింగ్ అంటే ఐపీఓ కు ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు తెలిపారు. మొత్తం మీద టెక్నాల‌జీ ప‌రంగా దూసుకెళుతున్న దృవ రానున్న రోజుల్లో ఐటీ సెక్టార్‌లో మెరెన్ని సంచ‌నాలకు శ్రీ‌కారం చుట్ట‌నుందో వేచి చూడాల్సిందే. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!