డాలర్లు కురిపిస్తున్న దోశె - కందస్వామినా మజాకా
ప్రపంచం మారిపోతోంది బాస్. కాస్తంత డిఫరెంట్ గా ఆలోచించి..దాన్ని వర్కవుట్ చేసేలా కష్టపడితే చాలు కోట్లు వెనకేసు కోవచ్చు. కావాల్సిందల్లా పట్టుదల. మొహమాటానికి చెక్ పెట్టేయాలి. తమ మీద తమకు నమ్మకం ఉండాలి. అంతేనా ఏ పనైనా కానీ, కానీ అది మరింత రుచికరంగా, అద్భుతంగా మళ్లీ మళ్లీ తిరిగి వచ్చేలా ఫుడ్ ఐటమ్స్ ను తయారు చేయగలిగితే ఆఫ్‌లైన్‌లోనే కాదు ఆన్‌లైన్‌లో మార్కెట్ దుమ్ము రేపవచ్చు. ఇపుడు ఫుడ్ ఇండస్ట్రీ డాలర్లను డామినేట్ చేస్తోందంటే నమ్మగలమా. ఇది ముమ్మాటికి నిజం. ఇండియన్స్ కరెన్సీ కంటే ఆకలిని తీర్చుకునేందుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు.
జనం అవసరాలే హోటల్ , రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల ఏర్పాటుకు జీవం పోశాయి. ఇపుడు దేశంలో ఎక్కడికి వెళ్లినా ఇవి దర్శనమిస్తాయి. ఇక సంతలు, జాతర్లలో , ఇతర ఫంక్షన్లలో కేటరింగ్‌లు, హోటళ్లు, చిన్న కొట్ల గురించి చెప్పాల్సిన పనేలేదు. ఇక ఇండియన్స్, ప్రవాస భారతీయుల వంటకాల్లో మొదటి ప్రాధాన్యత, ఛాయిస్ ఏమిటంటే దోశె. అందుకే చెన్నైకి చెందిన ప్రేమ్ గణపతి తక్కువ పెట్టుబడితో కోట్లాది రూపాయలు సంపాదించాడు. చరిత్ర సృష్టించాడు. అతడు స్థాపించిన దోశా ప్యాలస్ ప్రపంచంలోనే నెంబర్ వన్ హోటల్‌గా కొనసాగుతోంది. రుచికరమైన వంటకంగా ఇది పేరు తెచ్చుకుంది. అంతేనా చిరస్మరణీయమైన సర్వీస్ కూడా తన సక్సెస్‌కు కారణం.
ఇలాంటి సక్సెస్ ఫుల్ ఆంట్రప్రెన్యూర్ సక్సెస్ స్టోరీ ఇది. కందస్వామి తిరుకుమార్ ..పేరు చెబితే చాలు అమెరికాలో మోస్ట్ ఫేమస్ మ్యాన్. అతడికి ఉన్నంత క్రేజ్ ఇంకెవ్వరికీ లేదంటే నమ్మలేం. అంతగా పాపులర్ అయ్యారు ఈ దోశె మేకర్. శ్రీలంకకు చెందిన కందస్వామి తిరుకుమార్..కొన్నేళ్ల కిందటే బతుకు దెరువు కోసం యుఎస్‌కు వలస పోయిండు. అక్కడ ఉన్న రెస్టారెంట్లలో పనివాడుగా కుదిరాడు. భారతీయ వంటకాలను తయారు చేయడం నేర్చుకున్నడు. ఈ అనుభవం అతడికి ఎంతగానో ఉపయోగపడింది. జీవనోపాధి కోసం ఫుడ్ కోర్టును ప్రారంభించాలని అనుకున్నడు. అమెరికాలో ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు, వారి అభిరుచులకు అనుగుణంగా డిఫరెంట్ ఫ్లేవర్స్ తో దోశెలు తయారు చేస్తే బాగు పడవచ్చని అనుకున్నాడు.
గత 18 ఏళ్లుగా దోశెలు అమ్ముతూ ఆ మహానగరంలో గొప్ప పేరు సంపాదించాడు. దోశెలను టేస్టీగా తయారు చేయడంతో ఎన్నారైలే కాదు యుఎస్ వాసులు కూడా ఫిదా అయ్యారు. నగర వాసులంతా తిరు అని ప్రేమగా పిలుచుకుంటారు. ప్లెయిన్ దోశె, ఉప్మా దోశె, ఆనియన్ దోశె, బట్టర్ దోశె, ఊతప్పం, ఇడ్లీ లంచ్, జాఫ్నా లంచ్, రోటీ, కూరలు, సింగపూర్ నూడిల్స్, సమోసా మొదలైన వంటకాలకు ఆయన ఫుడ్ కార్ట్ చాలా ఫేమస్. జనం కోరే రుచులను అందించే తిరు కొన్ని ప్రయోగాలూ చేసిండు. అలా ఒక దోశెని తయారు చేసి, దానికి ‘పాండిచ్చేరి దోశె’ అనే పేరు పెట్టిండు.
న్యూయార్క్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎప్పుడూ ఓ 20 మంది ఈ కార్ట్ దగ్గర కూర్చుని ఇండియన్ వంటకాల్ని ఆరగిస్తూనే ఉంటారు. దాదాపు 40 నిమిషాల పాటు ఇక్కడ ఉండిపోతారు. ఇంత గిరాకీ ఉన్న తిరు ఏ రోజైనా తాను రాకపోతే ఆ విషయాన్ని ముందుగానే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తాడు. ఉదయాన్నే ఈ విషయాన్ని తన అభిమాన కస్టమర్లకు చెప్పడం వల్ల ఆయన కోసం ఎవరూ ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. టూరిస్టులు, విద్యార్థులే కాకుండా స్థానికంగానూ తిరూకి అభిమానులున్నారు. ఈ దోశె మ్యాన్ గురించి యుఎస్ లోని ప్రతి మ్యాగజైన్, మీడియా సక్సెస్ స్టోరీస్ ప్రచురించాయి. టెలికాస్ట్ చేశాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి