వారంలో ఒక రోజు - పోలీసుల్లో ఆనందం ..కుటుంబాల్లో సంతోషం

వాళ్లు మనలాంటి మనుషులే. మనమంతా ఇలా ఆనందంగా ఉన్నామంటే వారందిస్తున్న సేవలే. రక్షణ విభాగంలో కీలక భూమిక పోషిస్తూ రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల దాకా ప్రతి ఒక్కరికి 8 గంటల పని, వారంలో ఒక రోజు వారాంతపు సెలవు తీసుకుంటున్నారు. దర్జాగా కుటుంబాలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఆయా ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల నేతలు పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటి దాకా అమలు కాలేదు. రాజు తలుచుకుంటే ఏదైనా చేయవచ్చని ఏపీ సీఎంగా ఎన్నికైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన విధంగానే తక్షణమే పోలీసు శాఖలో ప్రతి ఒక్కరికి వీక్లీ ఆఫ్ తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆయన తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. పోలీసులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపార...