కవిత్వంతో ఐపీఎస్ కరచాలనం
ఓ వైపు ఐపీఎస్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరో వైపు సామాజిక బాధ్యతగా కవిత్వంతో కరచాలనం చేస్తోంది చందనా దీప్తి. జీవితాన్ని ఆవిష్కరించే సాధనాల్లో పోయెట్రి ఒకటి. సానుకూల దృక్ఫథంతో ఆలోచిస్తే సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయని , చూసే దృష్టిని బట్టి లైఫ్ వుంటుందని ఆమె నమ్ముతారు. ఆ దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. కవిత్వం రాయడంతో పాటు వివిధ అంశాలపై రచనలు కూడా చేస్తున్నారు. పోలీసు శాఖ అంటేనే చాలా మంది ఇబ్బందికరంగా భావిస్తారు. ప్రస్తుతం చందనా దీప్తి ఎస్పీగా మెదక్ జిల్లా బాధ్యతలు చూస్తున్నారు. జిల్లా వాసులకు బాసటగా నిలుస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్ఫూర్తి దాయకంగా ఉండేలా రచనలు చేస్తూ చైతన్యవంతం చేస్తున్నారు.
చందనా దీప్తి ముందు నుంచి మెరిట్ స్టూడెంట్. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలో సిఎస్ఇ కోర్సు చేశారు. 2012 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. దీప్తి స్వంత ఊరు తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. హైదరాబాద్‌లో ఉంటూ కష్టపడి చదివారు. బెస్ట్ స్టూడెంట్‌గా పేరు తెచ్చుకున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో చందనా దీప్తి ప్రజలను కార్యోన్ముఖులను చేసే పనిలో పడ్డారు. ఎస్పీగా శాంతిభద్రతలను కాపాడుతూనే ..మానవతా దృక్ఫథంతో జనాన్ని ప్రేమిస్తున్నారు. సామాజిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. మధ్య దళారీలను, బ్రోకర్ వ్యవస్థకు మంగళం పాడారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో మెలగాలని కోరారు. అంతేకాకుండా జిల్లా వాసులకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండేలా సోషల్ , డిజిటల్ మీడియాను యూజ్ చేసుకుంటున్నారు.
ఫేస్ బుక్‌లో ప్రజల కోసం ఆస్క్ మెదక్ ఎస్పీ పేరుతో పేజీని ఓపెన్ చేశారు. వింగ్స్ హర్ థాట్స్ పేరుతో వాట్ ఈజ్ లవ్ పేరుతో కవిత రాశారు. ఆమె స్వచ్ఛమైన తెలుగులోనే రాస్తున్నారు. ప్రేమంటే వాట్సప్‌లలో కాలాన్ని వేస్ట్ చేయడం కాదు, స్మార్ట్ ఫోన్లను యూజ్ చేయడం కాదు. వేగంగా డ్రైవ్ చేసి ప్రాణాలు పోగొట్టుకోవడం కాదు. నిజమైన ప్రేమ బతికేందుకు కావాల్సిన బలాన్ని ఇస్తుంది. నిజమైన ప్రేమ అమ్మ కళ్లను చూస్తే తెలుస్తుంది అంటారు హృదయాత్మకంగా . పెద్దవాళ్లు, తల్లిదండ్రులకు, విద్యార్థినీ విద్యార్థులకు, అన్ని రంగాలకు చెందిన ప్రజలకు ఆమె తోడుగా నిలిచారు. పోలీసులంటే నెలకొన్న భయాన్ని తొలగించారు. వారు కూడా మనుషులేనని తెలియ చెప్పారు. వారికి కూడా సామాజిక బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. ప్రతి ఒక్క ఉద్యోగి ప్రజలను తమ వారిగా గౌరవించాలని బోధించారు.
తాను ముందుండి నడవడంతో ఆమెతో పాటు ఇతర సిబ్బంది కూడా నడుస్తున్నారు. జనంతో కలిసిపోయి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఇదంతా చందనా దీప్తి లైఫ్ స్టయిల్. ఆమె పెద్ద వారికి, పేరెంట్స్‌కు ఒకే ఒక ప్రశ్న సంధిస్తున్నారు. అదేమిటంటే..నేటి యువతీ యువకులను, మీ స్వంత బిడ్డలను మీరేం ఏం చేస్తున్నారని శల్య పరీక్ష ..చేయకండి..ప్రశ్నించకండి..మీరేం చేయగలరో అడగండి అని సూచిస్తున్నారు.
అప్పుడే వారిని మర్చగలమంటున్నారు. వారంతట వారే స్వయం ప్రకాశకులుగా ఎలా ఎదగగలరో, అందుకు కావాల్సినవన్నీ ఇవ్వడానికి సిద్దంగా ఉండాలని సూచిస్తున్నారు దీప్తి. ఆవేశాలకు లోనై నేరాలు చేయొద్దంటూ ఆమె కోరుతున్నారు. మేడం చేస్తున్న ప్రయత్నంతో చాలా మంది ఖైదీలు మారిపోతున్నారు. చెరగని చిరునవ్వు, సమస్యను పాజిటివ్ కోణంలో ఆలోచిస్తే ఇన్ని సమస్యలంటూ వుండవంటారు చందనా దీప్తి. ఉద్యోగం బాధ్యతను తెలియ చేస్తే..సాహిత్యం, కవిత్వం స్వాంతన చేకూరుస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి