కేసీఆర్ భగీర‌థ ప్ర‌య‌త్నం - కాళేశ్వ‌రం క‌ళ్ల‌ముందు సాకారం

అప‌ర మేధావిగా, దార్శ‌నికుడిగా, ముందు చూపు క‌లిగిన నాయ‌కుడిగా పేరుగాంచిన తెలంగాణ ష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌రో చ‌రిత్ర‌కు నాంది ప‌లికారు. అసాధ్యమ‌నుకున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టును సుసాధ్యం చేసి త‌న‌కు ఎదురే లేద‌ని నిరూపించుకున్నారు. కోట్లాది రూపాయ‌ల ఖ‌ర్చుతో అతి త‌క్కువ టైంలో ప్ర‌పంచంలోనే అతి పెద్ద వంతెన నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టారు. ఇది తెలంగాణ సాధించిన ఘ‌న‌త‌. కోట్లాది ప్ర‌జ‌ల ఆశ‌లు సాకారం అయ్యేలా చేసిన వైనం భావి త‌రాల‌కు పాఠంగా నిలువ బోతున్న‌ది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దీనిని మంత్రి ఈటెల ప‌ర్య‌వేక్షించారు. రేయింబ‌వ‌ళ్లు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు క‌ష్ట‌ప‌డ్డారు. ఈ ప్రాజెక్టుకు కొండ గుర్తుగా సీఎం విగ్ర‌హాన్ని ఇక్క‌డ ఏర్పాటు చేశారు.

ఇంత‌టి ప్ర‌తిష్టాత్మ‌కమైన కాళేశ్వ‌రం ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. 3 ప్ర‌ధాన రిజ‌ర్వాయ‌ర్లు, 16 రిజ‌ర్వాయ‌ర్లు, 20 లిఫ్టులు అంటే ఎత్తిపోత‌లు, 203 కిలోమీట‌ర్ల మేర సొరంగ మార్గం, 1521 కిలోమీట‌ర్ల పొడ‌వునా కాల్వ‌లు నిర్మించారు. 37 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగు నీరు అందించేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. మొత్తం ప్రాజెక్టు పూర్త‌య్యేందుకు 80 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు. రీ డిజైన్ కూడా చేశారు. దీనిపై విప‌క్షాలు కోర్టును ఆశ్ర‌యించాయి. అయినా వాట‌న్నింటిని త‌ట్టుకుని స‌గ‌ర్వంగా ఈ ప్రాజెక్టు జాతికి అంకితం కానుంది. 4 వేల మందికి పైగా పోలీసులు బందోబ‌స్తు చేప‌ట్టారు. ప్రాజెక్టు వ‌ద్ద భారీగా గాలీ, వాన బీభ‌త్సం సృష్టించింది. అయినా ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మీడియాకు మాత్రం ఎంట్రీ లేకుండా చేశారు. తామే అన్ని ఫోటోలు, వీడియోలు, స‌మాచారాన్ని అంద‌జేస్తామ‌ని అధికారులు వెల్ల‌డించారు. దీనిపై కొంద‌రు సీనియ‌ర్లు అభ్యంత‌రం తెలిపారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు లింక్ 2- ప్యాకేజీ 8 లోని రామ‌డుగు మండ‌లం ల‌క్ష్మీ పూర్ పంపు హౌస్‌లో ఆసియాలోనే పెద్ద దైన 139 మెగావాట్ల మోటార్ల‌ను వినియోగిస్తున్నారు. ఈ ఒక్క మోటారు 115 కిలోమీట‌ర్ల పైకి నీటిని ఎత్తి పోస్తుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత లోతైన స‌రేజ్ పూల్ కూడా ఇదే. ప్యాకేజీ 6లో నందిమేడారం పంపు హౌస్‌లో 124.8 మెగావాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన నాలుగు మోటార్ల‌ను ఇప్ప‌టికే ట్ర‌య‌ల్ ర‌న్ చేసి పంపింగ్‌కు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు వ‌ల్ల తెలంగాణ భ‌విష్య‌త్ మారిపోనుంద‌ని కేటీఆర్ తెలిపారు. ఆర్థిక‌, సామాజిక స్థితిగ‌తులు మారుతాయ‌న్నారు. జిల్లాల వారీగా చూస్తే ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎక‌రాల‌కు సాగు నీరు అందుతుందో తెలుసు కోవ‌చ్చు. సిరిసిల్లలో లక్షా 41 వేల 205 ఎక‌రాల‌కు నీరందుతుంది. సిద్దిపేట‌లో 3 ల‌క్ష‌ల 80 వేల 399 ఎక‌రాలు, యాదాద్రి జిల్లాలో ల‌క్ష 32 వేల 993 ఎక‌రాలు, మెద‌క్ జిల్లాలో 2 ల‌క్ష‌ల 59 వేల 808 ఎక‌రాల‌కు నీరందుతుంది.

న‌ల్ల‌గొండ జిల్లాకు 29 వేల 169 ఎక‌రాలు, సంగారెడ్డిలో ల‌క్షా 80 వేల 026 ఎక‌రాలు, నిజామాబాద్ జిల్లాలో లక్షా 67 వేల 800 ఎక‌రాలు , జ‌గిత్యాల‌లో ల‌క్షా 95 వేల ఎక‌రాలు, కామారెడ్డిలో 2 ల‌క్ష‌ల 34 వేల ఎక‌రాలు, నిర్మ‌ల్ లో ల‌క్ష ఎక‌రాలు, మేడ్చెల్‌లో 50 వేల ఎక‌రాలు, పెద్ద‌ప‌ల్లిలో 30 వేల ఎక‌రాలు, క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 80 ఎక‌రాల‌కు సాగు నీరందుతుంది దీని ద్వారా. ఇక జ‌లాశ‌యాల ప‌రంగా చూస్తే..మేడిగ‌డ్డ బ్యారేజీ 16.17 టీఎంసీల సామ‌ర్థ్యం క‌లిగి ఉన్న‌ది. అన్నారం బ్యారేజీ 10.87టీఎంసీలు, సుందిళ్ల 8.83 , మేడారం 0.78, అనంత‌గిరి 3.50 టీఎంసీలు, శ్రీ‌రంగ‌నాయ‌క సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ 3 టీఎంసీలు, మ‌ల్ల‌న్న సాగ‌ర్ 50, మ‌ల్క‌పేట 3, కొండ‌పోచమ్మ సాగ‌ర్ 15 టీఎంసీల సామ‌ర్థ్యం క‌లిగి ఉన్న‌ది.

గంధ‌మ‌ల్ల రిజ‌ర్వాయ‌ర్ 9.87 టీఎంసీల సామ‌ర్థ్యం క‌లిగి ఉన్న‌ది. బ‌స్వాపురం 11.39 టీఎంసీలు, భూంప‌ల్లి 0.09 , కొండెం చెరువు 3.50 , తిమ్మ‌క్క‌ప‌ల్లి 1.50 , దంతెప‌ల్లి 1, ధ‌ర్మారావుపేట 0.50 , ముద్దిజివాడి చెరువు 0.50 , కాటేవాడి చెరువు 0.50, మోతే జ‌లాశ‌యం 1 టీఎంసీ నీటి సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉన్నాయి. కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో కొత్త శ‌కం ప్రారంభ‌మైంద‌ని , ఇది నీటి పారుద‌ల రంగంలో కొత్త చ‌రిత్ర‌ను సృష్టించింద‌ని నీళ్ల నిరంజ‌న్ రెడ్డి పేర్కొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!