కర్నాటకం రసవత్తరం ..రాజకీయ కల్లోలం..!

కథ మారలేదు. సీన్స్ మాత్రం పండుతూనే ఉన్నాయి. కన్నడ నాట రాజకీయం మరింత రసవత్తరాన్ని తలపింప చేస్తోంది. దూరదర్శన్‌లో రామాయణం సీరియల్‌ను తలపింప చేస్తోంది కర్నాటక పాలిటిక్స్. జాతీయ మీడియా ఓ వైపు క్రికెట్ జపం చేస్తున్నా..మరో వైపు కన్నడ రాజకీయాలపై ఆసక్తికరమైన కథనాలను ప్రసారం చేస్తున్నాయి. ఓవైపు కేపిటిల్ సిటీ ఢీల్లీతో పాటు బెంగళూరు, ముంబై కేంద్రాలుగా ఈ ఆసక్తికరమైన స్టోరీ రోజుకో ట్విస్ట్‌లను రేపుతూ రంజుగా మార్చేస్తోంది. ఎప్పుడైతే కాంగ్రెస్, జేడీఎస్‌లు సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేశాయో..అప్పటి నుంచి కర్నాటక వాసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అసలు ప్రభుత్వం ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. రాజకీయ కురువృద్ధులకు కేరాఫ్‌గా మారిన ఈ నాటకంలో ఓ వైపు మాజీ ప్రధాని దేవెగౌడ స్వయాన కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకో వైపు మల్లికార్జున ఖర్గే తో పాటు మాజీ ముఖ్యమంత్రి సిద్ధిరామయ్యలు ఈ పదవిపై కన్నేసారు. పైకి అంతా ఒక్కటిగానే ఉన్నామని చెబుతున్నా ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని చెలాయించాలనే ఉద్ధేశంతో డ్రామాలకు తెర తీశారు. త...