క‌ర్నాట‌కం ర‌స‌వ‌త్త‌రం ..రాజ‌కీయ క‌ల్లోలం..!

క‌థ మార‌లేదు. సీన్స్ మాత్రం పండుతూనే ఉన్నాయి. క‌న్న‌డ నాట రాజ‌కీయం మ‌రింత ర‌స‌వ‌త్త‌రాన్ని త‌ల‌పింప చేస్తోంది. దూరద‌ర్శ‌న్‌లో రామాయ‌ణం సీరియ‌ల్‌ను త‌ల‌పింప చేస్తోంది క‌ర్నాట‌క పాలిటిక్స్. జాతీయ మీడియా ఓ వైపు క్రికెట్ జ‌పం చేస్తున్నా..మ‌రో వైపు క‌న్న‌డ రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేస్తున్నాయి. ఓవైపు కేపిటిల్ సిటీ ఢీల్లీతో పాటు బెంగ‌ళూరు, ముంబై కేంద్రాలుగా ఈ ఆస‌క్తిక‌ర‌మైన స్టోరీ రోజుకో ట్విస్ట్‌ల‌ను రేపుతూ రంజుగా మార్చేస్తోంది. ఎప్పుడైతే కాంగ్రెస్, జేడీఎస్‌లు సంకీర్ణ స‌ర్కార్‌ను ఏర్పాటు చేశాయో..అప్ప‌టి నుంచి క‌ర్నాట‌క వాసుల‌కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అస‌లు ప్ర‌భుత్వం ఉందో లేదో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. రాజ‌కీయ కురువృద్ధుల‌కు కేరాఫ్‌గా మారిన ఈ నాట‌కంలో ఓ వైపు మాజీ ప్ర‌ధాని దేవెగౌడ స్వ‌యాన కుమారుడు కుమార‌స్వామి ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఇంకో వైపు మ‌ల్లికార్జున ఖ‌ర్గే తో పాటు మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధిరామ‌య్య‌లు ఈ ప‌ద‌విపై క‌న్నేసారు. పైకి అంతా ఒక్క‌టిగానే ఉన్నామ‌ని చెబుతున్నా ఎవ‌రికి వారు త‌మ ఆధిప‌త్యాన్ని చెలాయించాల‌నే ఉద్ధేశంతో డ్రామాల‌కు తెర తీశారు.

తీరా చూస్తే..రోజుల త‌ర‌బ‌డి క‌ర్నాటకలో రాజ‌కీయ అనిశ్చితి నెల‌కొంది. రోజుకు ఒక‌రి చొప్పున రాజీనామాలు స‌మ‌ర్పిస్తున్నా..అస‌లైన నిర్ణ‌యం తీసుకోవాల్సిన స్పీక‌ర్ తాపీగా ...స‌మాధానం ఇస్తున్నారు. మ‌రింత వేడిని పుట్టిస్తున్నారు. దీంతో అటు మీడియాకు ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీకి ఈ ఆట ఆడ‌నీయ‌మంటూ గోడ మీద నుంచి తేరిపార చూస్తోంది. ఇంకెంత కాలం ఈ క్రీడ‌ను ఆడ‌తారోనంటూ. మ‌రో వైపు ట్ర‌బుల్ షూట‌ర్స్ రంగంలోకి దిగారు. డీకే శివ‌కుమార్ తో పాటు కాంగ్రెస్ హై క‌మాండ్ గులాం న‌బీ ఆజాద్‌ను ప‌రిస్థితిని కంట్రోల్ తెచ్చేందుకు ప్రయ‌త్నాలు ప్రారంభించింది. అయితే పొద్ద‌స్త‌మానం రెబ‌ల్స్ ముంబైలో విడిది చేసిన హోట‌ల్ వ‌ద్ద నిరీక్షించిన డీకేకు అవ‌మాన‌మే జ‌రిగింది. తాము అత‌నితో మాట్లాడే ప్ర‌స‌క్తి లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. దీనికి కార‌ణం సిద్ధిరామ‌య్యే నంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు వృద్ధ నేత దేవెగౌడ‌. ఎంచ‌క్కా అమెరికా వెళ్లి వ‌చ్చిన కుమార స్వామి మాత్రం ఏమీ పాలుపోక ..నిమ్మ‌కుండి పోయారు.

అధికార కూట‌మికి చెందిన మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు త‌మ ప‌ద‌వికి రాజీనామా చేశారు. రిజైన్స్ విష‌యంలో స్పీక‌ర్ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. వాళ్ల‌ను క‌లిసేందుకుని ట్రై చేసిన డీకే శివ‌కుమార్ ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండ‌గా ఎలాగైనా స‌రే క‌ర్నాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు క‌దుపుతోంది. గ‌వ‌ర్న‌ర్ ద్వారా చ‌క్రం తిప్పేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కాంగ్రెస్ నేత‌ల్ని క‌లిసేందుకు గ‌వ‌ర్న‌ర్ నో చెప్ప‌డంతో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మొత్తంగా చూస్తే సీఎం గా కుమార స్వామి కొన‌సాగ‌డం క‌ష్ట‌మ‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. కాగా మొత్తం రాజీనామాల సంఖ్య 16కు పెరిగాయి. హౌసింగ్ మినిస్ట‌ర్‌గా ప‌నిచేసిన ఎంబీటీ నాగ‌రాజు, స్టేట్ పొల్యూష‌న్ బోర్డు ఛైర్మ‌న్‌గా ఉన్న కె. సుధాక‌ర్ లు తాజాగా రాజీనామా చేశారు. వీరిద్ద‌రూ సిద్దిరామ‌య్య గ్రూపున‌కు చెందిన వారు. స్పీక‌ర్‌ను క‌లిసి లెట‌ర్లు అంద‌జేశారు. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూసి తాను క‌ల‌త చెందాన‌ని, ప‌దవి నుంచే కాదు పాలిటిక్స్‌కు గుడ్ బై చెబుతున్నానంటూ వెల్ల‌డించారు. ఇక 14 మందిలో 9 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు చెల్ల‌వంటూ స్పీక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. ఇక ముంబైలో తాను మినిస్ట‌ర్‌నని, రూం బుక్ చేసుకున్నానని, త‌న‌ను వెళ్ల‌నీయండంటూ చెప్పినా డీకేను వినిపించు కోలేదు. మొత్తం మీద క‌ర్నాట‌క రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రాన్ని త‌ల‌పింప చేస్తోంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!