స్వయంకృతాపరాధం ..కోలుకోలేని అపజయం - కన్నీటి పర్యంతమైన భారతీయం..!
సమస్త క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా నివ్వెర పోయేలా చేసిన క్షణాలు. హాట్ ఫెవరేట్‌గా ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో బరిలోకి దిగిన టీమిండియా జట్టు ఏకంగా అద్భుతమైన ప్రదర్శన చేసింది. అటు బ్యాటింగ్‌లోను..ఇటు బౌలింగ్‌లోను ..కలిసికట్టుగా పోరాడింది. లీగ్ దశలో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ ఓడిపోగా..మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో టోర్నీమెంట్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. బ్యాటింగ్ దిగ్గజాలు పది మందిని ఎంపిక చేస్తే అందులో ఇండియన్ క్రికెటర్స్ కనీసం అయిదుగురైనా ఉండి తీరాల్సిందే. కోట్లాది భారతీయుల ఆశలు తగ్గకుండా ..జాతి గర్వించే రీతిలో ఇండియన్స్ ఆడారు. దీంతో జాతి యావత్తు ఉత్తుంగ తరంగమై మేరా భారత్ మహాన్ అంటూ నినదించింది. ఎక్కడ చూసినా కోట్లాది ప్రజలు జాతీయ పండుగను చేసుకున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ రాజధాని దాకా ఎక్కడ చూసినా ..ఏ సందులోకి వెళ్లినా..ఏ రెస్టారెంట్‌లో కూర్చున్నా..బస్సుల్లో, రైళ్లల్లో, విమానాల్లో సైతం క్రికెట్ వినిపించింది..కనిపించింది.
హర్యానా కరేన్ కపిల్ దేవ్ నిఖంజ్ సారథ్యంలో ఎప్పుడైతే భారత క్రికెట్ జట్టు 1983లో ప్రపంచ కప్పును ఎగరేసుకుని సగర్వంగా ముద్దాడిందో ..ఆ రోజు నుంచి నేటి దాకా అభిమానులు 100 కోట్లను దాటేసారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇదో రికార్డు . ఆ తర్వాత ఇండియన్ క్రికెట్ జట్టు పగ్గాలు తీసుకున్న హైదరాబాద్ మణికట్టు మాంత్రికుడు మహమ్మద్ అజారుద్దీన్ భారత్‌కు ఎనలేని విజయాలు సమకూర్చి పెట్టాడు. లార్డ్స్, కోల్‌కోతా మైదానాలలో అతడు క్రియేట్ చేసిన రికార్డులను ఎవరూ చెరిపి వేయలేక పోయారు. ఆ తర్వాత సచిన్, ద్రావిడ్, గంగూలీ, ధోనీ, ఇలా దేశ వ్యాప్తంగా ఎందరో క్రికెటర్లు తమ ప్రతిభా పాటవాలకు పదును పెడుతూ జట్టులో కీలక పాత్ర పోషించారు. కళ్లు చెదిరేలా ఆడారు..రికార్డులను బద్దలు కొట్టారు. 10 వేల పరుగులను అలవోకగా సాధించగా..మరికొందరు బౌలింగ్‌లో 300 వికెట్లను కూల్చి తమకు సాటిరెవ్వరూ అంటూ ప్రపంచానికి చాటి చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు.
కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. క్రికెట్ ఆటలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి ఇంట్లో టీవీ వచ్చేశాక..క్రికెట్ దేశాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు 500 కోట్ల దాకా ఉన్న వ్యాపారం..ఇపుడు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇండియా లేక పోతే క్రికెట్ ఆటే లేదనట్టుగా భారతీయులు అంతగా ఈ ఆటతో కనెక్టు అయ్యారు. వీరిని చూసి మిగతా దేశాలు సైతం ఆశ్చర్యానికి లోనవుతున్నాయి. ఎందుకింతటి అభిమానం..ఎందుకింతటి ప్రేమ ..వ్యామోహం. దీనిపై అని.. ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న పెద్దన్న అమెరికాకు ..ఆ దేశపు అధ్యక్షులకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. క్రికెట్ కు ఉన్న క్రేజును చూసి. దీంతో వాళ్లు కూడా ఈ గిల్లీ దండ ఆటను ప్రాక్టీస్ చేసే పనిలో పడ్డారు. అంటే దీనికున్న క్రేజు ఏమిటో ..చూస్తేనే అర్థమవుతుంది.
వరల్డ్ వైడ్‌గా టెలికాస్ట్ సర్వీసెస్‌లో టాప్ వన్ పొజిషన్‌లో ఉన్న స్టార్ గ్రూపు యాజమాన్యం ..దిగ్గజ కంపెనీ సోనీని వెనక్కి నెట్టేసి..క్రికెట్ ఆటపై సర్వ హక్కులను 1647 కోట్టకు చేజిక్కించుకుంది. ఇది ఓ రికార్డు. ఇంతలా అంచనాలు పెంచి..ఆఖరు సెమీ ఫైనల్ దాకా వచ్చిన టీమిండియా జట్టు ..ఇలా కోట్లాది మంది భారతీయుల గుండెలను కన్నీటి పర్యంతమయ్యేలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు. కోట్లాది రూపాయలు వెనకేసు కోవడంలో ఉన్నంత శ్రద్ధ ..జాతి కోసం..భారత పతాకాన్ని ఎగరేయాలన్న ఆకాంక్ష..కోరిక వుంటే మన క్రికెటర్లు ఇలా ఆడి మనల్ని విషాదంలోకి నెట్టి వేస్తుందని అనుకోలేదు. ఇలాంటి వాళ్లను దేవుళ్ల కంటే ఎక్కువగా ఆరాధించిన అభిమానులను ముందు అనాలి. ఒక్కో క్రికెటర్ వందల కోట్లను ఎప్పుడో దాటేశారు. ఇండియా కంటే కివీస్ జట్టు అద్భుతంగా ఆడింది. ఫ్యాన్స్ మనసు దోచుకుంది. మొత్తం మీద క్రికెట్టే గెలిచింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి