నాయకత్వ వైఫల్యం..చేజార్చుకున్న విజయం - ఇండియా డీలా..కీవీస్ భళా..!
నాయకుడంటే ఎలా వుండాలి. ముందుండి నడిపించాలి. భావోద్వేగాలను అదుపులో వుంచు కోవాలి. తన వాళ్లను దూరంగా ఉంచాలి. తాను సైతం జాతికి అంకితం కావాలి. అదీ ఆటంటే..అదీ స్ఫూర్తి అంటే. అందుకే మన ఇండియన్ క్రికెటర్లకు మిగతా దేశాల జట్ల ఆటగాళ్లకు ఉన్నంత తేడా. చెప్పాల్సి వస్తే..ఎంతో. టోర్నీలో బాగా ఆడామని మనం అనుకుంటున్నాం. పసి కూనలుగా భావించిన అందరికీ బంగ్లాదేశ్ తో టీమిండియా ఆడిన ఆటను మరొక్కసారి చూస్తే తెలుస్తుంది. మనం ఎంత చావు తప్పి గెలిచామోనని. కోట్లాది ప్రజలు వీళ్లను దేవుళ్లుగా చూసి..ఆరాధిస్తున్నారు కాబట్టే వీరికి ఆట మీద కంటే ఆదాయంపైనే దృష్టి ఎక్కువై పోయింది. లెక్కలేనంత ప్రాఫిట్ రాబట్టే వీళ్ల ఆటలు సాగుతున్నాయి. అదే ఆస్ట్రేలియా జట్టును చూడండి. పక్కా ప్రొఫెషనల్స్ వాళ్లు. వాళ్లకు తెలిసింది ఒక్కటే. ఆట. అంతే. మిగతాదే ఏదైనా. వాళ్లకు కుటంబాలు మనలాగే ఉంటాయి. కానీ వారంతా మైదానం వెలుపుల వుంటారు. వీరికి చేదోడుగా ఉంటారు కానీ మనలా వెంట పెట్టుకుని, రెస్టారెంట్లు, పబ్‌ల వెంట పరుగులు తీయరు. సెల్ఫీలు దిగరు. ప్రచారం చేసుకోరు.
పక్కా ప్రొఫెషనల్ ఆటగాళ్లు ఎప్పుడూ ..వారి ధ్యాసంతా ఆటే. ఇంకో దానితో వారు కనెక్ట్ అవరు. పక్కాగా ఆడతారు..ప్రతి దానిని లెక్క కట్టి కష్టపడతారు. జట్టు కోసం సమిష్టిగా ఆలోచిస్తారు. కలిసికట్టుగా పోరాడతారు. విజయం సాధిస్తే పొంగిపోరు. పోనీ పరిస్థితులు బాగాలేక ఓటమి పాలైతే..కుంగి పోరు. జయాపజయాలను సమానంగా చూస్తారు. ఆటే వారికి వేదం..ఆటే వారికి జీవన నాదం. ఆటే ప్రపంచం..ఆటే సర్వస్వం. కానీ మనవాళ్లు అలాకాదు. రాజులకంటే ఎక్కువ. దేవుళ్ల కంటే ఎక్కువ. మన వాళ్లకు ప్రియురాళ్లు కావాలి. అభిమానులు ఏమై పోతేనేం. జాతి ఏమై పోతేనేం. వాళ్లు తమ ప్రజల కోసం ఆడతారు. తమ దేశం కోసం ఆడుతున్నట్టే భావిస్తారు. వారి ప్రతి అడుగు అటు వైపే కదులుతాయి. మన క్రికెటర్ల అడుగులు .. ఎంజాయిమెంట్ వైపు పరుగులు తీస్తాయి. ఇదీ మనకూ ..వారికున్న తేడా. ఒక్కసారి గమనించి చూడండి. ప్రపంచ కప్ టోర్నమెంట్‌ను నిశితంగా పరిశీలించండి. ఎందుకంటే ప్రతి మ్యాచ్‌ను..వాటి హైలెట్స్‌ను కళ్లకు కట్టినట్టు స్టార్ గ్రూప్ ప్రసారం చేసింది. అంతేకాకుండా మళ్లీ చూసేందుకు ఫ్యాన్స్ కోసం లైబ్రరీలో దాచి పెట్టింది. యూట్యూబ్‌లో లెక్కలేనన్ని వీడియోలు ఉన్నాయి.
ఇక కీవీస్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌ను గమనిస్తే ఒక్కటే బోధపడుతుంది. ఏమిటంటే..రియల్‌గా ఈ విజయం కివీస్‌దేనని. వాళ్లు మనలాగే వికెట్లు కోల్పోయారు. ఓ వైపు వాన చినుకులు పడుతూనే ఉన్నా ఆ జట్టులోని రాస్ టేలర్ నవ్వుతూనే ఉన్నాడు. మన వాళ్లు ఎంతగా మైదానం వైపు పరుగులు తీసినా సరే సంయమనం కోల్పోలేదు. చివరి వరకు తన ప్రయత్నం చేశాడు. గోడలా నిలబడ్డాడు. కొన్నిసార్లు తడబడ్డాడు. అయినా ఓర్పు కోల్పోలేదు. మన బౌలర్లు సైతం కట్టడి చేశారు. తక్కువ స్కోర్ కే పరిమితం చేశారు. చూస్తే కొండంత స్కోరేమీ కాదు..కానీ మనోళ్లు దానిని ఈజీగా తీసుకున్నారు. బొక్క బోర్లా పడ్డారు. పరమ చెత్త ఫీల్డింగ్‌తో చేజేతులారా పోగొట్టుకున్నారు. అంతేనా..మనం ఆరాధించిన ఆటగాళ్లు ..నిలవాల్సిన సమయంలో వికెట్లను పారేసుకున్నారు. ఇక కెప్టెన్ గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. అలా వచ్చి ఇలా పెవీలియన్ దారి పట్టాడు. నిన్న ఓ 50 పరుగులు చేస్తే ..స్టాండ్లో ఉన్న తన ప్రియురాలిని చూసి బ్యాట్ ఊపిన ఈ మహానుభావుడికి ..కోట్లాది భారతీయులు పడే ఆవేదనను అర్థం చేసుకోలేక పోయాడు. జాతిని ప్రేమించే వాళ్లు..దేశం కోసం ఆడే వాళ్లు..క్రికెట్‌ను ఆటగా స్వీకరించే వాళ్లు..మనలాగా ఉండరు. పక్కా ప్రొఫెషనల్స్‌గా ఉంటారు. సో ఈ ఓటమికి ..క్రికెటర్లతో పాటు కోచ్ రవిశాస్త్రి , సెలెక్టు చేసిన బీసీసీఐ పాలకవర్గందే బాధ్యత.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి