ఇంటి దారి ప‌ట్టిన టీమిండియా - కోట్లాది భార‌తీయుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన కోహ్లీ సేన..!

కోట్లాది భార‌తీయుల ఆశ‌ల‌పై టీమిండియా నీళ్లు చ‌ల్లింది. ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన సెమీ ఫైన‌ల్‌లో ఇండియా జ‌ట్టు 19 ప‌రుగుల తేడాతో ఓడి పోయింది. టోర్న‌మెంట్‌లో ఓవ‌ర్ ఆల్‌గా అద్భుత‌మైన ఫామ్‌ను క‌న‌బ‌ర్చి సెమీస్‌కు చేరిన భార‌త జ‌ట్టు అనూహ్యంగా , చేజేతులారా అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. టైటిల్ ఫేవ‌రేట్‌గా ఉన్న కోహ్లీ సేన ..త‌క్కువ టార్గెట్‌ను ఛేదించ‌లేక చ‌తికిలి ప‌డిపోయింది. ఏ స‌మ‌యంలోనైనా జ‌ట్టును ముందుండి న‌డిపించే నాయ‌కుడు, ఓట‌మి అంటేనే ఒప్పుకోని ఇండియ‌న్ కెప్టెన్ విరాట్ కోహ్లి ప‌రుగులేమీ చేయ‌కుండానే పెవీలియ‌న్ బాట ప‌ట్టాడు. ఆప‌ద స‌మ‌యంలో ఆదుకునే ఆప‌ద్భాంద‌వుడిగా పేరొందిన మ‌హేంద్ర సింగ్ ధోనీ ఆఖ‌రు వ‌ర‌కు వున్నా , ఆఫ్ సెంచ‌రీ కొట్టినా భార‌త్‌ను గ‌ట్టెక్కించ లేక పోయాడు.

ప‌రీక్షా స‌మ‌యంలో ఎదురొడ్డి నిలిచి ఆడాల్సిన, ఎంతో అనుభ‌వం క‌లిగిన ధోనీ లేని ప‌రుగు కోసం వెళ్లి రనౌట్ అయ్యాడు. ఇండియా జ‌ట్టులో చెప్పు కోవాల్సింది ఒక్క‌డినే ర‌వీంద‌ర్ జ‌డేజా. త‌న అద్భుత‌మైన బ్యాటింగ్‌తో దుమ్ము రేపిన ఈ క్రికెట‌ర్ ఏకంగా 77 ప‌రుగులు చేసి న్యూజిలాండ్ జట్టుపై ఒత్తిడి పెంచాడు. అయినా ఆ జ‌ట్టు ఏ స‌మ‌యంలోను సంయ‌మ‌నం కోల్పోలేదు. అన్ని ఫార్మాట్‌ల‌లో టీమిండియాపై పై చేయి సాధించింది. భార‌త బ్యాట్స్‌మెన్స్‌ను ప‌రుగులు చేయ‌నీయ‌కుండా క‌ట్ట‌డి చేసింది. ప్రారంభంలోనే మ‌నోళ్లు ఎప్పుడు పెవీలియ‌న్ కు చేరుకుందామా అన్న రీతిలో ఆడారు. కోట్లాది ఫ్యాన్స్ గుండెల్లో దుఖాఃన్ని నింపారు. ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచింది. మాంచెస్ట‌ర్ లో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో మొద‌టి రోజు భారీ వ‌ర్షం దెబ్బ‌కు అంపైర్ల ప్యాన‌ల్ ..ఆఖ‌రు వ‌ర‌కు మ్యాచ్ నిర్వ‌హించాల‌ని చూశారు. కానీ ఆ ప‌రిస్థితి లేక పోవ‌డంతో , వాయిదా వేశారు.

అంత‌కు ముందు 5 వికెట్లు కోల్పోయి 211 ప‌రుగులతో ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 239 ప‌రుగులు చేసింది. విలియ‌మ్స‌న్ 67 ప‌రుగులు చేసి నిల‌బెట్ట‌గా , రాస్ టేలర్ ఒంట‌రి పోరు సాగించాడు. ఇండియ‌న్ బౌల‌ర్ల‌కు అడ్డు ప‌డ్డాడు. అనంత‌రం 240 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త జ‌ట్టు తొలి బంతి నుంచే క‌ష్టాలు ఎదుర్కొంది. టాప్ -3 బ్యాట్స్ మెన్స్ అయిన కే.ఎల్. రాహుల్, రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిలు ఒక్కో ప‌రుగు మాత్ర‌మే చేసి

 విజయానికి 18 పరుగుల ముందు భారత ఇన్నింగ్స్ ముగిసింది. విజయంపై ఆశలు రేకెత్తించిన జడేజా (77) అవుటయ్యాక భారత ఆశలు అడుగంటాయి. సిక్సర్‌తో ధోనీ ఆశలు రేపినప్పటికీ ఆ వెంటనే రనౌట్ అవడం కివీస్‌కు కలిసొచ్చింది. ఆ తర్వాత మిగిలిన రెండు వికెట్లను తీయడానికి కివీస్ పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండాపోయింది. చాహల్ అవుట్‌తో ప్రపంచకప్‌లో భారత ప్రస్థానం ముగిసింది. న్యూజిలాండ్ రెండోసారి ప్రపంచకప్ ఫైనల్‌లో అడుగుపెట్టింది.

అంతకుముందు 211/5తో ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. విలియమ్సన్ 67, రాస్ టేలర్ 74 పరుగులు చేశారు. అనంతరం 240 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలి బంతి నుంచే కష్టాలు ఎదుర్కొంది. టాప్-3 బ్యాట్స్‌మెన్ అయిన రాహుల్, రోహిత్, కోహ్లీలు ఒక్కో పరుగు మాత్రమే చేసి అవుటవడం భారత్‌కు ప్రతికూలంగా మారింది. లక్ష్యం చిన్నదే అయినా ఒత్తిడి ముందు తలొగ్గి వికెట్లు సమర్పించుకుంది. 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడంతో తర్వాతి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. అయితే, ధోనీ (50), జడేజా(77)లు భారత శిబిరంలో ఆశలు రేపినప్పటికీ వారిద్దరూ అవుటయ్యాక మ్యాచ్ కివీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. 221 పరుగులకే భారత్ కుప్పకూలి పరాజయం పాలైంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!