రాబోయే కాలం..టీవీలదే రాజ్యం..మొబైల్ టీవీలదే సామ్రాజ్యం

టెక్నాలజీలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నా..రాబోయే కాలమంతా టెలివిజన్, మొబైల్ టీవీలకే ఎక్కువ ప్రయారిటీ లభించనుంది. టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవడం ..ప్రతి ఒక్కరు మొబిలిటితో కనెక్టివిటీ కలిగి ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనికేషన్ కే పెద్దపీట దక్కుతోంది. ఫోన్ టీవీతో పాటు సాధారణ టీవీకి మంచి భవిష్యత్ ఉందంటూ ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్స్ అనే సంస్థ చేసిన సర్వేలో వెల్లడించింది. ఇండియాలో ఫోన్ టీవీ మార్కెట్ 2023 నాటికి మార్కెట్ పరంగా మూడు రెట్లు పెరుగుతుందని..దాని విలువ అమాంతం 11 వేల 976 కోట్లకు చేరుకుంటుందని స్పష్టం చేసింది. దీని విలువను గుర్తించిన మార్కెట్ వర్గాలు..ఫోన్ టీవీ ప్రొవైడర్లు కంటెంట్‌ను పెంచేందుకు కృషి చేస్తున్నారు. అందరికీ టెల్కో సేవలు అందుబాటులో ఉండడం, తక్కువ ధరకు డేటా లభించడంతో ఇంటర్నేషనల్ ఫోన్ టీవీ ప్రొవైడర్స్ కు భారత్ ఒక బలీయమైన మార్కెట్‌కు అవకాశం ఉందని గుర్తించాయి. భవిష్యత్‌లోను కొత్తగా మార్పులు చోటు చేసుకున్నా..ప్రజలను ఆకట్టుకోగలిగిన మాధ్యమం ఏదైనా ఉందంటే అది ఫోన్ టీవీ మాత్రమేనని సంస్థ పేర్కొ...