పాఠ్యాంశంగా తలైవా జీవితం
కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి..బాలచందర్ పుణ్యమా అంటూ సినిమాల్లోకి ప్రవేశించి ..తనకంటూ ఓ స్టయిల్‌ను ఇమేజ్‌ను ..బ్రాండ్‌ను స్వంతం చేసుకున్న అరుదైన నటుడు రజనీకాంత్. తమిళనాట ఆయనకున్నంత క్రేజ్..ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇంకెవ్వరికీ లేదు. ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో. తమిళ రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్ర. ఏది మాట్లాడినా అదో సెన్సేషన్. కర్ణాటకలో జన్మించిన రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. అతడి పేరును దర్శకుడు బాలచందర్ రజనీకాంత్ గా మార్చేశారు. ఏ ముహూర్తంలో పెట్టాడో కానీ అప్పటి నుంచి నేటి దాకా ఆయన ఏది పట్టుకున్నా బంగారమే. కోట్లాది రూపాయలు, లెక్కనేనన్ని ఆస్తులు సంపాదించినా రజనీకాంత్ సింపుల్‌గా వుంటారు.
ఆయనకు భక్తి ఎక్కువ. ధ్యానంలో మునిగి పోతారు. హిమాలయాలకు వెళతారు. మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి అంటే రజనీకి వల్లమాలిన అభిమానం. ప్రతి ఏటా స్వామి వారిని దర్శించుకుంటారు. ఆశీస్సులు పొందుతారు. సాధారణ స్థాయి నుంచి ..అత్యున్నతమైన స్థాయిని అందుకున్న రజనీకాంత్ జీవితం ఎందరికో ఆదర్శ ప్రాయంగా వుంటుందని తమిళులు పెద్ద ఎత్తున అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా పిల్లల కోసం ఐదవ తరగతిలో కలాం, చార్లీ చాప్లిన్, తదితరుల సరసన ఈ సూపర్ స్టార్‌ను చేర్చింది. ఇక నుంచి విద్యార్థులు ఆయన లైఫ్‌ను చదువుకుంటారు. తమిళనాడులో ఈ స్టార్‌ను ముద్దుగా తలైవా అని పిలుచుకుంటారు. ఇపుడు ఆయనకు 68 ఏళ్ల వయసు. అయినా ఎక్కడా నిరాశ కనిపించదు. చలాకీగా వుంటారు. ఎప్పుడైనా సెట్స్ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు.
తనను నమ్ముకున్న వారికి మేలు చేయందే నిద్రపోని మనస్తత్వం ఆయనది. మీకు గుర్తుందా..రంజిత్ పా .. వయసులో చిన్నోడు. కానీ సామాజిక సమస్యల మీద మంచి పట్టున్న ఈ యువ దర్శకుడి లోని టాలెంట్‌ను పసిగట్టాడు. కసిని చూశాడు. ఏకంగా సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు. కాలా ఓ సంచలనం. మాస్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ..క్లాస్‌ను నిరాశ పరిచింది. అయినా తలైవా పట్టించు కోలేదు. జయాపజయాలను ఆయన సమానంగా చూస్తారు. దేని పట్ల ఆసక్తిని కనబర్చరు. లైఫ్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ అని నమ్మే ఈ నటుడు .. ఏకాంతాన్ని కోరుకుంటారు. ఇంట్లో వున్నా..షూటింగ్‌లో ఉన్నా ..ఆయన ధ్యాసంతా మౌనం వైపే. తన నుంచి తనలోకి అనే సూత్రాన్ని స్వతహాగా పాటిస్తారు. ఇదే ఆయనకున్న స్పెషాలిటీ. గుప్త దానాలు చేయడం, సేవా కార్యక్రమాలలో పాల్గొనడం, అనాధలను ఆదు కోవడం, అన్నదానాలు నిరంతరం నిర్వహించడం, పిల్లల ఆరోగ్యం కోసం ఖర్చు చేయడం..ఆలయాలు, హిమాలయాలు సందర్శించడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది.
తాను ఏం కావాలని అనుకుంటున్నాడో ..స్పష్టంగా చెప్పాడు..బాషా సినిమాలో రజనీకాంత్. అదో మాస్టర్ పీస్ సినిమా. కానీ ఎందుకనో తమిళ ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోయారు రజనీ చనిపోవడాన్ని. చాలా వ్యతిరేకత వచ్చింది. కానీ సినిమాలో ఏదో అంతర్లీనంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. చాలా సినిమాలు చేశా..కానీ బాబా సినిమా నాకు దగ్గరగా వున్న సినిమా. తాను లైవ్‌గా వుండాలని కోరుకుంటారు. కానీ వారికి తెలియదు జీవితం చాలా చిన్నదని అంటారు ..నర్మ గర్భంగా రజనీకాంత్. ఏదీ శాశ్వతం కాని దాని కోసం ఎందుకింత ఆత్రమో నని ..బహదూర్ షా జాఫర్ అన్న మాటలు ..తలైవాను చూస్తే నిజమనిస్తుంది కదూ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి