రోజా సెల్వ‌మ‌ణి ప‌ద‌విపై వీడ‌ని ఉత్కంఠ‌..?

ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలిగా పేరొందిన రోజా సెల్వ‌మ‌ణికి ఏపీ వైసీపీ సర్కార్‌లో చోటు ద‌క్క‌క పోవ‌డంపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. కేబినెట్ లో ఎవ‌రెవ‌రు వుంటార‌నే కొద్ది స‌మ‌యానికి ముందు రోజా మాట్లాడుతూ త‌న‌కు ఏ ప‌ద‌వి ఇచ్చినా చేసేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. అంత‌గా అధినేత మీద న‌మ్మ‌కం పెట్టుకున్నారు. ఉన్న‌ట్టుండి 25 మంది జాబితాలో రోజా పేరు లేదు. వైసీపీ శ్రేణులు, సీనియ‌ర్లు, అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గుర‌య్యారు. పార్టీలో మ‌హిళా నాయ‌కురాలిగా..అంత‌కంటే పార్టీకి వాయిస్‌గా ఉన్నారు. అధికార పార్టీని అడుగ‌డుగునా అడ్డుకున్నారు. మాట‌ల‌తో వాళ్ల‌కు చెక్ పెట్టారు. ఓ ర‌కంగా చెప్పాలంటే స్టేట్‌లో ఆమె ప్రాధాన్య‌త అంత‌కంత‌కూ పెరిగి పోయింది. మ‌రో వైపు అంబ‌టి రాంబాబు కూడా చోటు ద‌క్క‌లేదు. 

చిత్తూరు జిల్లాలో జ‌న్మించిన రోజా. న‌టిగా రాణించారు. 150 సినిమాలకు పైగా న‌టించారు. 1991 నుండి 2002 దాకా సినిమా రంగంలోనే ఉన్నారు. 10 ఏళ్ల పాటు తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం సినిమాల్లో న‌టించారు. ప‌లు అవార్డులతో పాటు పుర‌స్కారాలు అందుకున్నారు. న‌టిమ‌ణిగా, పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా, ప్రొడ్యూస‌ర్‌గా, టీవీ ప్ర‌యోక్త‌గా ఆమె ఎంతో పేరు గ‌డించారు. నాగ‌బాబుతో క‌లిసి ఈటీవీలో వ‌స్తున్న జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాం టాప్ రేటింగ్ లో ఉంటోంది. ఇందులో రోజా పాత్ర కూడా ముఖ్య‌మే. 1999లో రోజా పాలిటిక్స్ లోకి ఎంట‌ర్ అయ్యాడు. టీడీపీలో చేరారు. 2014లో చిత్తూరు జిల్లా న‌గ‌రి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో కూడా వైసీపీ నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు.

సెల్వ‌మ‌ణిని ఆమె పెళ్లి చేసుకున్నారు. ఇద్ద‌రు పిల్ల‌లు వున్నారు. బై బై బాబు అంటూ ఆమె మాట్లాడిన మాట‌లు రాష్ట్ర వ్యాప్తంగా వైర‌ల్ అయ్యాయి. వైసీపీలో ఆమె మోస్ట్ పాపుల‌ర్ వుమెన్ లీడ‌ర్‌గా వినుతికెక్కారు. పార్టీ కోసం ప‌నిచేస్తూనే, అధినేత న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా టీడీపీకి చుక్క‌లు చూపించారు. జ‌గ‌న్ కేబినెట్‌లో కంప‌ల్స‌రీగా రోజాకు చోటు ద‌క్క‌డం ఖాయ‌మ‌ని అంతా భావించారు. పేరు లేక పోవ‌డంతో అంద‌రితో పాటు ఆమె అవాక్క‌య్యారు. పార్టీనే న‌మ్ముకుని ఎన్నో అవ‌మానాలు, విమ‌ర్శ‌లు ఎదుర్కొని ఎమ్మెల్యేగా గెలిచిన రోజా ఓ ఫైర్ బ్రాండ్ లీడ‌ర్. 

ఇలాంటి వాళ్లే ఇపుడు పార్టీకి కావాల్సింది. జ‌గ‌న్‌పై విప‌క్షాలు చేసిన విమ‌ర్శ‌ల‌ను రోజా ధైర్యంగా తిప్పి కొట్టింది. జ‌గ‌న్ మంత్రివ‌ర్గం కూర్పుపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతున్నా..సీనియ‌ర్లు, రోజాకు చోటు లేక పోవడం ఆశ్చ‌ర్యానికి లోను చేసింది. మంత్రివ‌ర్గంలో చోటు లేక పోయినా..కార్పొరేష‌న్ ప‌ద‌వులు ఇంకా భ‌ర్తీ చేయాల్సి వుంది. టీటీడీ ఛైర్మ‌న్‌గా వైవీ సుబ్బారెడ్డికి ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇపుడు రోజాకు ఇవ్వ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఏది నిజ‌మో తెలియాలంటే కొంత వ‌ర‌కు వేచి చూడాల్సిందే. 

కామెంట్‌లు