పోస్ట్‌లు

అక్టోబర్ 19, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

శేషేంద్రుడు ప్రాతః స్మరణీయుడు

చిత్రం
రూపం అపురూపం. అక్షరం అద్భుతం. తెలుగు సాహిత్యంలో గుంటూరు శేషేంద్ర శర్మ  ఓ సంచలనం. ఎన్నదగిన సాహితీవేత్తలలో ప్రముఖుడిగా ఉన్నారు. ఆయన రాసిన ప్రతి అక్షరం, పదం జనాన్ని, లోకాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. అలంకార శాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వ మానవ దృష్టి. అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. సర్వేజనా సుఖినో భవంతు అన్నది ఆయన ఆత్మ నినాదం. నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నాగరాజుపాడు గ్రామంలో పుట్టారు. భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేటు తో పాటు ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో మున్సిపల్‌ కమీషనరుగా పని చేసి, పదవీ విరమణ పొందారు. నా దేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణ హంస, కాలరేఖ, షోడశి, ఆధునిక మహాభారతం...

నవ్వుల రేడు నవ్విన రోజు

చిత్రం
తెలుగు సినిమాలో ఆరోగ్యకరమైన హాస్యానికి కేరాఫ్ గా నిలిచిన కమెడియన్ రాజబాబు ను ఎలా మరిచి పోగలం. బతికినన్నాళ్లు అందరిని నవ్వించేందుకు ప్రయత్నం చేశారు. ఈ రంగంలో రెండు దశాబ్దాల పాటు ప్రముఖ హాస్య నటునిగా రాజబాబు వెలుగొందరు. అక్టోబరు 20 న 1935 లో పుట్టారు. శతాబ్దపు హాస్య నటుడిగా ప్రసంశలు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లో పుట్టిన రాజబాబు పూర్తి పేరు పుణ్య మూర్తుల అప్పల రాజు. తల్లిదండ్రులు పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు, శ్రీమతి రవణమ్మ. నిడదవోలు లోని పాఠశాల చదువు చదువుతూనే బుర్ర కథ నేర్చు కోవడానికి అచ్యుత రామయ్య గారి దగ్గర చేరాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడుగా కొద్ది కాలం పనిచేశాడు.  పాఠాలు చెబుతూనే నాటకాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. అందులో నటించే వాడు. ఇదే సమయంలో ఒక సారి నాటకంలో రాజబాబును చూసిన పుట్టినిల్లు సినిమా దర్శకుడు గరికపాటి రాజారావు సినిమాలలో చేరమని ఉత్సాహ పరిచాడు. దీంతో చెప్పా పెట్టకుండా ఫిబ్రవరి 7, 1960 రోజున మద్రాసు చేరుకొన్నాడు. పూట గడవడానికి హాస్య నటుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ప్రైవేటు చెప్పే వాడు. కొన్న...

మోదీతో బాలీవుడ్ నటుల భేటీ

చిత్రం
మహాత్మా గాంధీ జయంత్యుత్సవాల సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ తన అధికార నివాసంలో ప్రముఖ బాలీవుడ్‌ నటులు, నిర్మాతలతో భేటీ అయ్యారు. 2022లో జరుపుకునే 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల పైనా చర్చించారు. ‘గాంధీ ఎట్‌ 150’ ఇతి వృత్తంగా తీసిన వీడియోలను ప్రధాని విడుదల చేశారు.1857 నుంచి 1947 వరకు జరిగిన స్వాతంత్య్ర పోరాటం,1947–2022 కాలంలో దేశాభివృద్ధికి సంబంధించి ఇన్స్పిరేషన్ స్టోరీస్ తీసేలా సినీ, టీవీ పరిశ్రమ దృష్టి సారించాలని కోరారు. కళారంగంలో చూపిసున్న సృజనాత్మకతను దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉపయోగించాలని అన్నారు. మీరెంతో అద్భుతంగా పని చేస్తున్నారు. కళాకారులుగా మీ ప్రతిభ ప్రపంచమంతటికీ సుపరిచితం. మీ క్రియేటివిటీని మరింత విస్తరింప జేయడానికి ప్రభుత్వ పరంగా చేతనైనంత సహాయం అందజేస్తామని ప్రధానమంత్రి మోడీ స్పష్టం చేశారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మామల్లపురంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో తాను జరిపిన సమావేశం కారణంగా ఆ ప్రాంతానికి పర్యాటకుల రాక పెరిగిందని తమిళనాడు సీఎ...

సమ్మె విరమిస్తేనే సై..లేకుంటే నై..!

చిత్రం
గత కొన్ని రోజులుగా ఆర్టీసీ సమ్మె చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని, తక్షణమే చర్చలు జరుపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అంతే కాకుండా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంతవరకు వేచి చూసే ధోరణి అవలంభిస్తున్న ప్రభుత్వం సమ్మె తీవ్రతను గుర్తించడం లేదు. అంతే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిపే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు. మరో వైపు కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ సీఎం కేసీఆర్ అన్నారు. దీంతో కార్మికులు ఆందోళనకు గురై ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్టీసీ జేఏసీ నేతలకు సకల జనులతో పాటు అన్ని పార్టీలు, ప్రజా, విద్యార్ధి సంఘాలు మద్దతు తెలిపాయి. బీసీ కార్మికులు వేధింపులకు లోనవుతున్నారని ఫిర్యాదులు అందాయని, తక్షణమే పూర్తి వివరాలతో ఈనెల 25 లోపు బీసీ కమిషన్ ఎదుట ఆర్టీసీ ఎండీ హాజరు కావాలని కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి నోటీసులు జారీ చేశారు. మరో వైపు కోర్టు సీరియస్ అయ్యింది. ఇంకో వైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఆర్టీసీ నేతలు ఫిర్యాదు చేశారు. అన్ని వైపుల నుండి వత్తిళ్లు పెరగడం తో సర్కార్ పునరాలోచనలో పడ్డది. అయితే సమ్మె, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం ఉన్నతాధికారులు, మంత్రి...

పోస్ట్ ప్రొడక్షన్ హబ్ లో ముంబై బెటర్ - నెట్ ఫ్లిక్స్

చిత్రం
డిజిటల్ మీడియాలో వరల్డ్ వైడ్ గా దూసుకెళుతున్న నెట్ ఫ్లిక్స్ తాజాగా ఆసియాలో అతి పెద్ద మార్కెట్ కలిగిన భారత్ పై కన్నేసింది. ఇప్పటికే దీనికి కోట్లాది మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. వీడియో స్ట్రీమింగ్ లో నెట్ ఫ్లిక్స్ మిగతా వాటితో పోటీ పడుతూనే తన బిజ్ నెస్ ను విస్తరించే పనిలో పడ్డది. ఇందులో భాగంగా పోస్ట్ ప్రొడక్షన్ లో ముంబై ప్రాంతం అత్యంత అనువైన ప్రాంతమని ఈ అమెరికన్ కంపెనీ పేర్కొంది. ఆసియా ఖండంలో తమకు ఇంత మంచి సిటీ ఎక్కడా అగుపించలేదని పేర్కొంది. ఇటీవలే ఇండియాకు చెందిన పలువురిని రిక్రూట్ చేసుకుంది. ఇప్పటికే మిలియన్స్ కొద్దీ వీడియోలను ఇందులో పొందు పర్చింది. అయితే కస్టమర్స్ తమకు నచ్చిన సీరియల్స్, మూవీస్ చూడాలంటే తప్పనిసరిగా ప్రతి నెలా 199 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ తో పాటు గూగుల్ వీడియో, అమెజాన్ ప్రోమో, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా డిజిటల్ మీడియా రంగంలోకి ఎంటర్ కాబోతున్నది. మరో వైపు వినోద రంగంలో టాప్ రేంజ్ లో ఉన్న స్టార్ టీవీ కూడా హాట్ స్టార్ ను ప్రవేశ పెట్టింది. దీనికి కూడా విపరీతమైన జనాదరణ ఉంటోంది. తాజాగా ఎంటర్ టైన్మెంట్ రంగంలో అతి పెద్ద బిజినెస్ కలిగి ఉన్నద...

అమితాబ్ ఆరోగ్యం పదిలం

చిత్రం
భారతదేశం గర్వించే అరుదైన నటుడిగా పేరున్న బిగ్ బి, అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం పదిలంగానే ఉంది. కాలేయ సంబంధిత వ్యాధితో కొన్నేళ్ల నుంచి బాధ పడుతూ వస్తున్నారు. ఇటీవల మరోసారి నొప్పి అనిపించడంతో అమితాబ్ పుణేలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. ఎప్పటి లాగే వైద్యుల పర్యవేక్షణలో వైద్యుల సలహాలు తీసుకుంటూ వస్తున్నారు. నాలుగు రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉన్నారు. అనంతరం అమితాబ్ ను డిశ్చార్జ్ చేశారు. ఆయన వెంట సతీమణి జయా బచ్చన్‌, కొడుకు అభిషేక్‌ బచ్చన్‌ ఉన్నారు. కాగా బాలీవుడ్ లో అందరి నటుల కంటే ఎక్కువగా బిగ్సో బి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. అయితే  బిగ్‌బీ ఆస్పత్రిలో ఉన్న సమయంలో కూడా వరుసగా రెండు ట్వీట్లు చేసి అభిమానులను పలుకరించారు. మొదటగా జయా బచ్చన్‌తో కార్వా చౌత్‌ పండుగలో పాల్గొన్న ఓ ఫొటోను షేర్‌ చేశారు. అంతే కాకుండా స్వతహాగా కవి అయిన అమితాబ్‌ .. దానికి అందమైన క్యాప్షన్‌ కూడా జత చేశారు. ఆమె నాలో సగం అందుకే హాఫ్‌ ఇమేజ్‌ కనిపించేటట్టు షేర్‌ చేశా అని ట్వీట్ చేశారు. మిగతా సగం కనిపించాల్సిన అవసరమేముంది అని పేర్కొన్నారు. ఇక మరో ట్వీట్‌లో జయాతో కలిసి వారం క్రితం పాల్గొన్న ఒక ఈవెంట్‌ ఫొటో జత చేశారు. ఇదిల...

మెరిసిన రోహిత్..నిలిచిన రహానే

చిత్రం
సౌత్ ఆఫ్రికా తో ఇప్పటికే టెస్ట్ సిరీస్ గెలుచుకున్న టీమిండియా మూడో టెస్టులోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్ లో ఉండడం..అతనికి అజింక్య రహానే తోడు కావడంతో భారత్ భారీ స్కోర్ దిశగా పరుగులు తీస్తోంది. రోహిత్ ఈ టెస్టులో వరల్డ్‌ రికార్డును నెలకొల్పాడు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మూడో సిక్సర్‌ కొట్టిన తర్వాత ఈ సిరీస్‌లో 16వ సిక్సర్‌ను రోహిత్‌ ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో వెస్టిండీస్‌ ఆటగాడు హెట్‌మెయిర్‌ రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. 2018-19 సీజన్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో హెట్‌మెయిర్‌ 15 సిక్సర్లు కొట్టాడు. 2010-11 సీజన్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో హర్భజన్‌ సింగ్‌ 14 సిక్సర్లు కొట్టాడు. భారత్‌ తరఫున ఇప్పటి వరకూ అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల రికార్డు. దాన్ని కూడా సవరించాడు రోహిత్‌. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ 130 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక ‍ ్సర్లతో సెంచరీ సాధించాడు. రోహిత్‌కు టెస్టుల్లో 6వ సెంచరీ కాగా, ఈ సిరీస్‌లో మూడో శతకం...

అమెజాన్ దీపావళి ధమాకా

చిత్రం
ఈ కామర్స్ లో దిగ్గజ కంపెనీగా ఉన్న అమెజాన్ కంపెనీ కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అపరిమితమైన డిస్కౌంట్స్ , భారీ గిఫ్ట్స్ ఇస్తున్నట్లు తెలిపింది. నిన్న దసరా పండగ సందర్బంగా పెద్ద ఎత్తున ఆఫర్స్ కు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం అమెజాన్ , స్నాప్ డీల్ , ఫ్లిప్ కార్ట్ ల మధ్య పోటీ నెలకొంది. దీంతో కొనుగోలుదారుల పంట పండుతోంది. ఇదిలా ఉండగా దసరా ఫెస్టివల్ లో ప్రోడక్ట్స్ ను కొనుగోలు చేయని వాళ్లకు ఈసారి వచ్చే దీపావళి లో అందుకే ఛాన్స్ ఇచ్చింది అమెజాన్. మరో వైపు మిగతా కంపెనీలు సైతం కస్టమర్స్ ను మెస్మరైజ్ చేసే పనిలో పడ్డాయి. ఇక అమెజాన్ మాత్రం ఈసారి ఎన్నడూ లేని రీతిలో బంపర్ ఆఫర్స్ ఇస్తోంది. ఈ బిగ్ డీల్స్ అన్నీ కొన్ని రోజులు మాత్రమే ఉండబోతున్నాయి. ఫ్లిప్ కార్ట్ కూడా ఇదే రీతిన ఇస్తోంది. అయితే అమెజాన్ మాత్రం ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై 60 శాతం దాకా డిస్కౌంట్‌ ఇస్తోంది. టాప్‌ బ్రాండ్స్‌, లేటెస్ట్‌ ఉత్పత్తులపై కూడా టాప్‌ డీల్స్‌ ఇవ్వబోతోంది. ఇండియా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ - దీపావళి స్పెషల్ సేల్‌ పేరుతో దీనిని నిర్వహిస్తోంది. ఈ ప్రత్యేక విక్రయాల్లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెర...

తేల్చుకోనున్న జేఏసీ - 23 న ఓయూలో సభ

చిత్రం
ఆర్టీసీ బంద్ సక్సెస్ కావడం ..ప్రభుత్వం స్పందించక పోవడంతో తమ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించారు ఆర్టీసీ జెఎసి. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశం అయ్యారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి ఇతర జేఏసీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమ్మెను మరింత ఉధృతం చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ జేఏసీ నాయకులను కలవనున్నారు. అలాగే, ఎంఐఎం నేతలనూ కలవాలని నిశ్చయించారు. 23న ఉస్మానియా యూనివర్సీటీలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని జేఏసీ తీర్మానించింది. ఇక ధర్నా కార్యక్రమంలో గాయపడ్డ పోటు రంగారావుని ఆర్టీసీ జేఏసీ నేతలు కలిసి పరామర్శించనున్నారు. సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు చేపట్టిన బంద్ సంపూర్ణం అయ్యింది. పోరాటాన్ని ఇలాగే కొనసాగించాలి. బంద్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం కావాలి. ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో పడింది. కాలయాపన మంచిది కాదు. సర్కార్ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతోంది. తెలంగాణ ఉద్యమం తరువాత జరిగిన ఉద్యమాల్లో ఇదే అతి పెద్ద ఉద్యమం. ఆర్టీసీని రక్షించండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళతాం. మళ్లీ గవర్నర్ ను కలుస్తాం. ఎంఐఎం నేతలను కూడా కలుస్తాం. నాయకుల వేళ్లు తీసినా, తలలు నరికినా ఉద్య...

ఆర్టీసీ బంద్ సంపూర్ణం..స్పందించని ప్రభుత్వం

చిత్రం
తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుండా మొండి వైఖరితో వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపు సక్సెస్ అయ్యింది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా టిఎన్జీవోస్ , ఎన్జీవోస్ , ఉపాధ్యాయ, సచివాలయ, విద్యుత్, విద్యార్ధి సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు, సకల జనులు సమ్మెలో పాల్గొన్నారు. ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులు ఆయా ఆర్టీసీ బస్సు డిపోల ముందు ఆందోళన చేపట్టారు. పలువురు కార్మికులను పోలీసులు అరెస్టులు చేశారు. పోలీస్ స్టేషన్స్ కు తరలించారు. వీరికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క, ముకేశ్ గౌడ్, బీజీపీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ , రామ్ చంద్రరావు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండ రామ్, సీపీఐ నేత తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి తో పాటు ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డి, థామస్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం  చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు స్టూడెంట్స్ ను బలవంతంగా ...

సామజ వరగమనా..నిన్ను ఆపగలమా

చిత్రం
మాటల మాంత్రికుడు, ప్రముఖ సినీ దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో..రైజింగ్ స్టార్ బన్నీ ..లవ్లీ హీరోయిన్ పూజా హెగ్డే కలిసి నటిస్తున్న అల వైకుంఠపురంలో సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన సామజవరగమనా సాంగ్ తెలుగు సినిమా చరిత్రలో రికార్డు బ్రేక్ చేసింది. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో మొదటి పాటగా ఈ పాటను రిలీజ్ చేశారు. విడుదలైన కొద్దీ సేపటికే యూట్యూబ్లో భారీ ఎత్తున స్పందన లభించింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ఆ పాట సంచలనాలు రేపుతుంది. ఇప్పటి వరకు 41 మిలియన్ల వ్యూస్‌ ఈ పాట సొంతం చేసుకుంది. అలాగే 7 లక్షల లైక్స్ ను కూడా యూట్యూబ్ లో దక్కించుకుంది. అత్యధిక యూట్యూబ్ లైక్స్ ను దక్కించుకున్న తెలుగు పాటగా సామజవరగమనా నిలిచింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించాడు. ‘అత్యధికులు లైక్‌ చేసిన తెలుగు పాట. మీ ప్రేమకు థ్యాంక్స్‌’  అని బన్ని ట్వీట్‌ చేశారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ 90 శాతానికి పైగా పూర్తయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతి పండగకు విడుదల చేయాలనీ నిర్మాతలు ప్లాన్ చేశారు. థమన్ అందించిన సంగీతం, పాటల...

వైసీపీ స్పోక్స్ పర్సన్స్ వీరే

చిత్రం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాలనా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి మరో వైపు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే భారీ విజయాలను నమోదు చేసుకుని మంచి ఊపు మీదున్న ఆయన రాబోయే మరో ఐదేళ్లు తమ పార్టీనే అధికారంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే గ్రామీణ వ్యవస్థను మరింత పటిష్టవంతం చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు వేలాదిగా గ్రామ వాలంటీర్లను నియమించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ౩౦ మంది సభ్యులతో అధికార ప్రతినిధుల జాబితాను ఎంపిక చేశారు.  పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరందరినీ అధికార ప్రతినిధులుగా ప్రకటిస్తూ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్‌, రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి వెల్లడించారు. పార్టీకి సంబంధించి ఇక నుంచి వీరు స్పోక్స్ పర్సన్స్ గా వ్యవహరిస్తారు. ఇక ఎంపిక చేసిన వారిలో..ఉండవల్లి శ్రీదేవి, ధర్మ...