అమెజాన్ దీపావళి ధమాకా
ఈ కామర్స్ లో దిగ్గజ కంపెనీగా ఉన్న అమెజాన్ కంపెనీ కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అపరిమితమైన డిస్కౌంట్స్ , భారీ గిఫ్ట్స్ ఇస్తున్నట్లు తెలిపింది. నిన్న దసరా పండగ సందర్బంగా పెద్ద ఎత్తున ఆఫర్స్ కు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం అమెజాన్ , స్నాప్ డీల్ , ఫ్లిప్ కార్ట్ ల మధ్య పోటీ నెలకొంది. దీంతో కొనుగోలుదారుల పంట పండుతోంది. ఇదిలా ఉండగా దసరా ఫెస్టివల్ లో ప్రోడక్ట్స్ ను కొనుగోలు చేయని వాళ్లకు ఈసారి వచ్చే దీపావళి లో అందుకే ఛాన్స్ ఇచ్చింది అమెజాన్. మరో వైపు మిగతా కంపెనీలు సైతం కస్టమర్స్ ను మెస్మరైజ్ చేసే పనిలో పడ్డాయి. ఇక అమెజాన్ మాత్రం ఈసారి ఎన్నడూ లేని రీతిలో బంపర్ ఆఫర్స్ ఇస్తోంది.
ఈ బిగ్ డీల్స్ అన్నీ కొన్ని రోజులు మాత్రమే ఉండబోతున్నాయి. ఫ్లిప్ కార్ట్ కూడా ఇదే రీతిన ఇస్తోంది. అయితే అమెజాన్ మాత్రం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 60 శాతం దాకా డిస్కౌంట్ ఇస్తోంది. టాప్ బ్రాండ్స్, లేటెస్ట్ ఉత్పత్తులపై కూడా టాప్ డీల్స్ ఇవ్వబోతోంది. ఇండియా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ - దీపావళి స్పెషల్ సేల్ పేరుతో దీనిని నిర్వహిస్తోంది. ఈ ప్రత్యేక విక్రయాల్లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర గృహోపరణాలపై భారీ ఆఫర్లను అందిస్తోంది. అలాగే ప్రైమ్ సభ్యుల కోసం ఒక రోజు ముందు నుంచే ప్రత్యేకమైన సేల్, స్పెషల్ అఫర్లను అమెజాన్ ప్రకటించింది.
ఆపిల్, షావోమి, వన్‌ప్లస్, శాంసంగ్, వివో, హానర్ వంటి స్మార్ట్‌ఫోన్ల్‌పై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 60 శాతం దాకా డిస్కౌంట్ లభ్యం. వన్‌ప్లస్ 7టీ, శాంసంగ్ ఎం 30ఎస్, వివో యు10 తో సహా అమెజాన్ స్పెషల్స్ స్మార్ట్ ఫోన్‌లను తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉంచినట్టు కంపెనీ తెలిపింది. దీంతో పాటు నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లున్నాయి. డెబిట్ , క్రెడిట్ కార్డులు, బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డులు, అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులపై అపరిమిత రివార్డ్ పాయింట్లుతోపాటు ఇతర ప్రయోజనాలు కూడా అందుకోవచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి